Ritu
-
ప్రమాదం బారిన చండీగఢ్ బీఎస్ఫీ అభ్యర్థి
దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దీంతో ఎన్నికలకు సంబంధించిన విషయాలు ప్రధానాంశాలుగా నిలుస్తున్నాయి. తాజాగా చండీగఢ్ బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ రీతూ సింగ్ ప్రమాదానికి గురయ్యారు. ఆమె తలకు బలమైన గాయమైంది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లగా, తలకు కుట్లు వేశారు.వివరాల్లోకి వెళితే స్థానికంగా ఉన్న ఒక కాలనీలోని బీఎస్పీ నేతలు, కార్యకర్తలు డాక్టర్ రీతూ సింగ్‌ను నాణేలతో తూకం వేస్తున్నారు. ఇంతలో ఆ తూకం తెగిపోయి, దాని రాడ్డు ఆమె తలకు తగిలింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు చికిత్స అందించి, తలకు కుట్లు వేసి ఇంటికి పంపించారు.చండీగఢ్ నుంచి డాక్టర్ రీతూ సింగ్‌ను బీఎస్పీ పోటీకి నిలిపింది. రీతూ.. ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేశారు. సైకాలజీ సబ్జెక్టులో ఆమెకు విశేష అనుభవం ఉంది. యూనివర్శిటీలో చదువుకుంటున్న సమయంలో ఆమె దళితుల పక్షాన గొంతెత్తారు. ఈ నేపధ్యంలో ఆమెను డిస్మిస్ చేయడంతో పెద్ద ఎత్తున ఆందోళనలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ రీతూ సింగ్ పీహెచ్డీ పకోడా వాలీ పేరుతో ఓ స్టాల్ కూడా పెట్టారు. కుల వేధింపుల ఆరోపణలతో 2023, సెప్టెంబర్‌లో ఆమె ఢిల్లీ యూనివర్సిటీలో నిరసన చేపట్టారు. ఈ సమయంలోనే ఆమె విశ్వవిద్యాలయం నుండి బహిష్కరణకు గుర్యయ్యారు. -
చాలా అసభ్యకరమైన కామెంట్స్..
-
వాడి వల్ల చాలా మోసపోయాను.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ చౌదరి
కామెడీ షో జబర్దస్త్ నటి రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే.. కొద్దిరోజుల క్రితం తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్ డిజైనర్ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్ ఛానల్లో చెప్పుకొచ్చింది. తన ఇంటికి సంబంధించిన ఇంటీరియల్ వర్క్‌ను ఒకరికి అప్పగిస్తే డబ్బు తీసుకుని మోసం చేశాడని.. అందువల్ల సుమారు రూ. 2 లక్షలు మోసపోయినట్లు ఆమె తెలిపింది. (ఇదీ చదవండి: క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్ ఛాన్స్) 'మా ఫ్యామిలీకి నాన్న దూరం కావడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయన లేకపోవడంలో నా కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరియల్ వర్క్‌ను ఒకరికి అప్పజెప్పాను. అందుకు గాను అతనికి రూ. 5లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. కానీ అతను డబ్బు తీసుకున్నాక పని మాత్రం నేను చెబుతున్నట్లుగా చేయలేకపోయాడు.. పని రాకపోతే రాదని చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సగం సగం పనులు చేశాడు. దాంతో అతడిని పనిలో నుంచి తీసేసి.. డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే ఎటువంటి రెస్పాన్స్ లేకుండా.. ఫోన్లకు కూడా స్పందించేవాడు కాదు. తిరిగి మమ్మల్నే అనరాని మాటలు అనేవాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ. 3లక్షలు తిరిగి ఇచ్చాడు. ఓవైపు బ్యాంక్ ఈఎంఐలు కట్టుకుంటూ మరోవైపు ఇంటి పని పూర్తి కాక మానసికంగా ఎంతో సతమతమయ్యా. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న చనిపోవడంతో నేను ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ ఇల్లు నిర్మాణ విషయంలో నేను తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురికావడమే కాకుండా.. ఆర్థికంగా మోసపోయాను. ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా. అతన్ని పనిలో నుంచి తొలగించాక ఇంటీరియర్ వర్క్‌ను వేరే వాళ్లకు అప్పగించాను. ప్రస్తుతం వర్క్ పూర్తి కావచ్చింది. నాకు ఎదురైన ఇబ్బంది ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నాను.' అంటూ రితూ చౌదరి తెలిపింది. -
నయీ సోచ్
కాలంతోపాటు మనుషులూ మారిపోతున్నారు. ఒకప్పటిలా సమాజాభివృద్ధికి జీవితాలను అంకితం చేసేవారు కనుమరుగైతే, కనీసం ఆ దిశగా ఆలోచించేవారు వారు సైతం క్రమంగా తగ్గిపోతున్నారు. ‘‘నేను, నా వాళ్లు, నా కుటుంబం’’ అంటూ స్వార్థంగా మారిపోతున్న ఈ రోజుల్లో కాలుష్యంతో పాడైపోతున్న పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రీతూ సింగ్. డ్రెస్‌లు తయారయ్యాక వృథాగా పోతున్న బట్ట ముక్కలతో సరికొత్త డ్రెస్‌లు రూపొందించి వాటిని నిరుపేద పిల్లలకు ఉచితంగా పంచుతోంది. పంజాబ్‌కు చెందిన రీతూ సింగ్ ఎమ్బీఏ పూర్తయ్యాక ఏడాదిపాటు ఫ్యాషన్ రంగంలో పనిచేసింది. ఆ తర్వాత తనకు సామాజిక సేవచేయాలన్న ఆలోచన వచ్చింది. ఏం చేయాలా అని ఆలోచిస్తున్న సమయంలో.. ఓ రోజు రీతూ తన కుమార్తెని స్కూల్ బస్ ఎక్కించడానికి బస్‌స్టాప్‌లో ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఓ టైలర్, బట్టలు కుట్టగా మిగిలిపోయిన గుడ్డ ముక్కలను దగ్గరలో ఉన్న చెత్త కుండీలో పడవేయడం చూసింది. అది చూసిన రీతూ ‘‘రోజూ ఇన్ని ముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది’’ అని అనుకుని, వృథాగా పోతున్న ఆ బట్ట ముక్కలకు చక్కటి పరిష్కారం చూపాలనుకుంది. ఏడాది పాటు ఫ్యాషన్ రంగంలో అనుభవం ఉన్న రీతూకు ..‘‘ఈ బట్టముక్క లన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది’’ అన్న ఆలోచన వచ్చింది. వెంటనే బొటిక్‌లు, టైలర్ల దగ్గర నుంచి ముక్కలను సేకరించి వాటిని పిల్లలు వేసుకునే విధంగా డ్రెస్‌లు రూపొందించింది. అలా కుట్టిన డ్రెస్‌లను నిరుపేద పిల్లలకు ఇవ్వడంతో వారు వాటిని ధరించి ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. దీంతో రీతూకు మరింత ఉత్సాహం వచ్చింది. మరిన్ని గుడ్డ ముక్కలను సేకరించి ఎక్కువమొత్తంలో డ్రెస్‌ల రూపకల్పన చేయసాగింది. ఇలా గత నాలుగేళ్లుగా రీతు వేస్ట్ పీసెస్‌తో కుట్టిన డ్రెస్‌లను చాలామందికి పంచిపెట్టింది. డ్రెస్‌లతోపాటు బ్యాగులు, జాకెట్లు, నిత్యావసర వస్తువులను వేసుకోగల సంచులను కూడా తయారు చేస్తోంది. నయీ సోచ్‌తో అవగాహన మురికి వాడల్లో నివసిస్తోన్న నిరుపేద పిల్లలకేగాక వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాల్లోని పెద్దలు, పిల్లలకు సైతం డ్రెస్‌లు కుట్టి ఇస్తోంది రీతు. స్కూలుకెళ్లే విద్యార్థులు వేసుకోగలిగిన స్టైలిష్ డ్రెస్‌లను రూపొందించి యాభైకి పైగా మురికివాడల్లో పంచింది. తన కార్యక్రమానికి వస్తోన్న స్పందనకు సోషల్ మీడియాలో ‘నయీ సోచ్’ పేరిట పేజ్ క్రియేట్ చేసి అవగాహన కల్పిస్తోంది. ఈ పేజీ ఫాలో అయ్యేవారు చాలా మంది తమకు తెలిసిన బొటిక్స్, టైలర్స్, బట్టల తయారీ యూనిట్ల నుంచి మిగిలిపోయిన బట్ట ముక్కలను సేకరించి తీసుకొచ్చి ఇస్తున్నారు. స్కూళ్లకు వెళ్లి వస్త్ర పరిశ్రమల ద్వారా కాలుష్యం ఎలా ఏర్పడుతుందో వివరించి, పర్యావరణంపై పిల్లల్లో అవగాహన కల్పిస్తోంది. నలుగురు మహిళలను తన పనిలో చేర్చుకుని వారికి ఉపాధి కల్పిస్తో్తంది. మనసుంటే మార్గం ఉంటుందని పెద్దలు ఎప్పుడో చెప్పారు. అందుకు రీతూ ఉదాహరణగా నిలుస్తోంది. సమాజాభివృద్ధికి సేవచేసే శక్తి, స్థోమతలు నాకు లేవు అని చేతులు దులుపుకోకుండా, తనకున్న నైపుణ్యంతో గుడ్డముక్కలను చక్కని డ్రెస్‌లుగా తీర్చిదిద్ది ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది రీతు. రోజూ ఇన్ని బట్టముక్కలు వృథాగా పోతున్నాయి. టన్నుల కొద్ది బట్ట ముక్కలు ఇలా చెత్తలో కలవడం కాలుష్యానికి దారి తీస్తుంది. ఈ బట్టముక్కలన్నింటిని కలిపి కుడితే మంచి డ్రెస్ రూపొందుతుంది అన్న ఆలోచన నుంచి పుట్టిందే నయీ సోచ్. -
వీరులకు రీతూ బంధన్
మరో మూడు రోజుల్లో అప్యాయతలు, అనుబంధాల మధ్య జరుపుకోనున్న‘రక్షాబంధన్ పండగ’ హడావుడి మొదలైంది. సరికొత్త రాఖీలు మార్కెట్లో కళకళలాడుతుండడంతో...తమ సోదరులకు ఎలాంటి రాఖీలు కట్టాలి? అందమైన రాఖీలు ఎక్కడ దొరుకుతున్నాయి అని ఆడపడుచులంతా ఓపిగ్గా షాపింగ్ చేస్తుంటే... సూరత్‌కు చెందిన రీతూ రాథీ మాత్రం తన సైనిక సోదరులకు కట్టేందుకు వేల సంఖ్యలో రాఖీలు తయారు చేయిస్తోంది. దేశ ప్రజలను తమ కుటుంబ సభ్యులు, తోబుట్టువులుగా భావించి ప్రాణాలకు లెక్కచేయకుండా పోరాడుతున్న వీర జవాన్లకు రాఖీలు కట్టి గౌరవించాలనుకుంది రీతు. ఈక్రమంలోనే ఏడు వేల రాఖీలను తయారు చేయిస్తోంది. రీతు నడిపిస్తోన్న ‘సోచ్ ఫౌండేషన్’ ద్వారా వితంతువులు, వికలాంగులతో రాఖీలు తయారు చేయిస్తూ వారికి ఉపాధిని కల్పిస్తోంది. వ్యాపార, రాజకీయ నేపథ్యమున్న కుటుంబంలో పుట్టిన రీతుకు చిన్నప్పటి నుంచి ఇతరులకు సాయం చేయడమంటే ఇష్టం. బీకాం తరువాత ఢిల్లీలోని జేడీ ఇన్స్టిట్యూట్లో ఎక్స్పోర్ట్ టెక్నాలజీలో ఫ్యాషన్ డిజైనర్ కోర్సు చేసింది. తర్వాత సోమేశ్వర్ డెవలపర్స్ డైరెక్టర్ ఆశిస్ రాఠీని పెళ్లి చేసుకుని ఒక పక్క వ్యాపార పనులు చూసుకుంటూనే, సేవాకార్యక్రమాల దిశగా అడుగులు వేసింది. కోవిడ్ సమయంలో శానిటైజింగ్ మెషిన్‌ను దానం చేయడం, ఫేస్ మాస్కులు పెట్టుకోవడంపై అవగాహన కల్పించడం, ఆహారం లేక అల్లాడుతున్న నిరుపేదల ఆకలి తీర్చడం, ప్రతి ఆదివారం మురికివాడల్లోని పిల్లలకు చదువు చెప్పడం, పోషకాహారం, శానిటరీ పాడ్స్ ఇవ్వడం, వికలాంగులకు మర్మా థెరపీ వంటివి కార్యక్రమాలెన్నింటినో తన టీమ్‌తో చేపట్టింది. గతేడాది ‘ఏక్ సోచ్: ఏక్ ఆత్మనిర్భర్ హిందుస్థాన్ కి ఔర్’ పేరిట ఎన్జీవోని స్థాపించి వివిధ సామాజిక కార్యక్రమాలు చేపడుతూ, నిరుపేదల జీవితాల్లో మార్పులు తీసుకు రావడానికి ప్రయత్నిస్తోంది. ‘‘మనందరికోసం ప్రాణాలు అర్పిస్తోన్న సైనికుల త్యాగాలను దేనితోనూ పోల్చలేము. అనుబంధాల పండుగనాడు వారికి రాఖీ కట్టి గౌరవించాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాను. ఈ ప్రాజెక్టులో భాగంగా ఏడు వేల రాఖీలను రూపొందిస్తున్నాము, వీటిని వితంతువులు, వికలాంగులతో తయారు చేయించడం ద్వారా వారికి ఉపాధి కలుగుతుంది’ అని రీతు చెప్పింది. -
ఇద్దరికి వైరస్... జట్టు మొత్తం వైదొలిగింది
న్యూఢిల్లీ: అయ్యో వైరస్... ఆడనీయవు, అర్హత కానీయవు. టోక్యో ఒలింపిక్స్ వేటలో పడేందుకు క్వాలిఫయింగ్ టోర్నీలో తలపడాల్సిన భారత జూడో జట్టు చివరి నిమిషంలో వైదొలిగింది. కిర్గిజిస్తాన్ దాకా వెళ్లిన 15 మంది సభ్యులు గల భారత జట్టు పోటీలకు దూరమైంది. ఈ బృందంలోని ఇద్దరు ప్లేయర్లు అజయ్, రీతూలకు కరోనా సోకింది. ఈ నెల 4న భారత జట్టు ఆసియా ఓసియానియా ఒలింపిక్ క్వాలిఫయర్స్‌లో పాల్గొనేందుకు బిష్కెక్ (కిర్గిజిస్తాన్)కు వెళ్లింది. అయితే మొదట 15 మంది జూడోకాలకు, నలుగురు కోచ్‌లకు నిర్వహించిన తొలి పరీక్షల్లో అంతా నెగెటివ్‌గానే బయటపడ్డారు. కానీ టోర్నీకి కాస్త ముందుగా 5న నిర్వహించిన పరీక్షల్లో అజయ్, రీతూ పాజిటివ్ అని తేలింది. కరోనా నేపథ్యంలోని టోర్నీ నిబంధనల ప్రకారం జట్టులో ఏ ఒక్కరికి కోవిడ్ సోకినా... మొత్తం జట్టంతా పోటీల నుంచి తప్పుకోవాలి. -
‘టాప్స్’ నుంచి రెజ్లర్ రీతూ ఫొగాట్ ఔట్
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) యువ రెజ్లర్ రీతూ ఫొగాట్‌ను టార్గెట్ ఒలింపిక్స్ పోడియం పథకం (టాప్స్) నుంచి తప్పించింది. గతేడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గిన రీతూ ఇటీవల మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌కు మారింది. టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్‌కు తాను అందుబాటులో ఉండనని... మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు చెప్పింది. ఒలింపిక్స్ పతకాల కోసమే టాప్స్లోని క్రీడాకారులకు ఆర్థిక అండదండలు అందిస్తున్నారు. అలాంటపుడు ఒలింపిక్స్ ఆడని క్రీడాకారులను అందులో ఉంచడం తగదని భావించిన ‘సాయ్’ వెంటనే రీతు ఫొగాట్‌ను తప్పించింది. -
ఓటమితో మొదలు...
మార్లో (ఇంగ్లండ్): బ్రిటన్‌తో ఐదు మ్యాచ్‌ల హాకీ టెస్టు సిరీస్‌ను భారత మహిళల జట్టు ఓటమితో ప్రారంభించింది. తొలి మ్యాచ్‌లో టీమిండియా 0-2 గోల్స్ తేడాతో ఓడిపోయింది. ఆట 38వ నిమిషంలో, 57వ నిమిషంలో ఎలీ రాయర్ బ్రిటన్‌కు రెండు గోల్స్‌ను అందించింది. ఆట ఏడో నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్ లభించినా ఫలితం లేకపోయింది. రెండో క్వార్టర్లో రీతూ గోల్ చేసే ప్రయత్నాన్ని బ్రిటన్ గోల్‌కీపర్ అడ్డుకుంది. ఈ సిరీస్‌లో రెండో మ్యాచ్ గురువారం జరుగుతుంది. -
రొమాంటిక్ ఎంటర్టైనర్
భరత్ భూషణ్, మిలన్, రీతు, చాచా పతుంతిప్ (బ్యాంకాక్) ముఖ్య తారలుగా నగేష్ నారదాసి దర్శకత్వంలో టి. చలపతి నిర్మించిన చిత్రం ‘బూమ్ బూమ్’. సుభాష్ ఆనంద్ స్వరపరచిన ఈ చిత్రం పాటల ఆవిష్కరణ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. టి.ప్రసన్నకుమార్ ఆడియో సీడీని ఆవిష్కరించి తుమ్మలపల్లి రామసత్యనారాయణకు అందించారు. ఈ సందర్భంగా నగేష్ నారదాసి మాట్లాడుతూ - ‘‘యువతను ఆకట్టుకునే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. కథానుసారం షూటింగ్ బ్యాంకాక్‌లోనే చేశాం’’ అన్నారు. పాటలు బాగా కుదిరాయనీ, సినిమా కూడా బాగా వచ్చిందని చలపతి చెప్పారు. కథ బాగుండటంతో మంచి పాటలివ్వడానికి కుదిరిందని సుభాష్ ఆనంద్ తెలిపారు. చిత్రం విజయం సాధించి, యూనిట్ అందరికీ మంచి పేరొస్తుందనే నమ్మకం ఉందని భరత్ భూషణ్ అన్నారు. -
మరో విదేశీ తార...
తెలుగు తెరపై అడపా దడపా విదేశీ తారలు కనిపిస్తుంటారు. తాజాగా థాయ్ చిత్రం ‘ఇన్ ది వన్’, రష్యన్ చిత్రాలు ‘ఐస్‌ల్యాండ్ ఆఫ్ ది లక్’, ‘అల్ట్రా’ తదితర చిత్రాల్లో నటించిన హాలీవుడ్ నటి చాచా పతుమ్తిప్ ‘బూమ్ బూమ్’ ద్వారా కథానాయికగా పరిచయం అవుతున్నారు. భరత్ భూషణ్ హీరోగా రూపొందిన ఈ చిత్రంలో రీతూ మరో నాయిక. నగేష్ నారదాశి దర్శకత్వంలో టి. చలపతి నిర్మించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ త్వరలో జరగనుంది. ‘‘స్వార్థప్రయోజనాల కోసం మనుషులు ఎలా మారిపోతున్నారు? అనే కథాంశంతో ఈ చిత్రం రూపొందించాం’’ అని నిర్మాత చెప్పారు.