
న్యూఢిల్లీ: భారత స్పోర్ట్స్ అథారిటీ (సాయ్) యువ రెజ్లర్ రీతూ ఫొగాట్‌ను టార్గెట్ ఒలింపిక్స్ పోడియం పథకం (టాప్స్) నుంచి తప్పించింది. గతేడాది కామన్వెల్త్, ఆసియా క్రీడల్లో స్వర్ణ, కాంస్య పతకాలు నెగ్గిన రీతూ ఇటీవల మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌కు మారింది.
టోక్యోలో జరిగే 2020 ఒలింపిక్స్‌కు తాను అందుబాటులో ఉండనని... మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌లో అదృష్టాన్ని పరీక్షించుకోనున్నట్లు చెప్పింది. ఒలింపిక్స్ పతకాల కోసమే టాప్స్‌లోని క్రీడాకారులకు ఆర్థిక అండదండలు అందిస్తున్నారు. అలాంటపుడు ఒలింపిక్స్ ఆడని క్రీడాకారులను అందులో ఉంచడం తగదని భావించిన ‘సాయ్’ వెంటనే రీతు ఫొగాట్‌ను తప్పించింది.