వాడి వల్ల చాలా మోసపోయాను.. కన్నీళ్లు పెట్టుకున్న రీతూ చౌదరి | Rithu Chowdary Emotional For New House Work | Sakshi
Sakshi News home page

Rithu Chowdary: వాడి వల్ల చాలా మోసపోయాను.. నాన్నే ఉండుంటే..: రీతూ చౌదరి

Published Sat, Oct 28 2023 8:25 PM | Last Updated on Sat, Oct 28 2023 8:50 PM

Rithu Chowdary Emotional For New House Work - Sakshi

కామెడీ షో జబర్దస్త్‌ నటి రీతూ చౌదరి బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమే.. కొద్దిరోజుల క్రితం  తన తండ్రి మరణించడంతో ప్రస్తుతం తన కుటుంబానికి అన్నీ తానై చూసుకుంటుంది. తన కొత్త ఇంటి నిర్మాణం విషయంలో ఓ ఇంటీరియర్‌ డిజైనర్‌ వల్ల తాను మానసిక ఆందోళనకు గురయ్యానని చెబుతూ తన యూట్యూబ్‌ ఛానల్‌లో చెప్పుకొచ్చింది. తన ఇంటికి సంబంధించిన ఇంటీరియల్‌ వర్క్‌ను ఒకరికి అప్పగిస్తే డబ్బు తీసుకుని మోసం చేశాడని.. అందువల్ల సుమారు రూ. 2 లక్షలు మోసపోయినట్లు ఆమె తెలిపింది.

(ఇదీ చదవండి:  క్రేజీ హీరోకు జోడీగా దేత్తడి హారిక.. బేబీ టీమ్‌తో గోల్డెన్‌ ఛాన్స్‌)

'మా ఫ్యామిలీకి నాన్న దూరం కావడంతో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆయన లేకపోవడంలో నా కొత్త ఇంటికి సంబంధించిన ఇంటీరియల్‌ వర్క్‌ను ఒకరికి అప్పజెప్పాను. అందుకు గాను అతనికి రూ. 5లక్షలు అడ్వాన్స్‌గా ఇచ్చాను. కానీ అతను డబ్బు తీసుకున్నాక పని మాత్రం నేను చెబుతున్నట్లుగా చేయలేకపోయాడు..  పని రాకపోతే రాదని చెప్పకుండా ఇష్టం వచ్చినట్లు సగం సగం పనులు చేశాడు. దాంతో అతడిని పనిలో నుంచి తీసేసి.. డబ్బులు తిరిగి ఇవ్వమని కోరితే ఎటువంటి రెస్పాన్స్‌ లేకుండా.. ఫోన్లకు కూడా స్పందించేవాడు కాదు.

తిరిగి మమ్మల్నే అనరాని మాటలు అనేవాడు. చివరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూ. 3లక్షలు తిరిగి ఇచ్చాడు. ఓవైపు బ్యాంక్‌ ఈఎంఐలు కట్టుకుంటూ మరోవైపు ఇంటి పని పూర్తి కాక మానసికంగా ఎంతో సతమతమయ్యా. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న మా నాన్న చనిపోవడంతో నేను ఎన్నో కష్టాలు, ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వచ్చింది. ఈ ఇల్లు నిర్మాణ విషయంలో నేను తీవ్రమైన మానసిక కుంగుబాటుకు గురికావడమే కాకుండా.. ఆర్థికంగా మోసపోయాను. ఎన్నోసార్లు కన్నీళ్లు పెట్టుకున్నా.

అతన్ని పనిలో నుంచి తొలగించాక ఇంటీరియర్‌ వర్క్‌ను వేరే వాళ్లకు అప్పగించాను. ప్రస్తుతం వర్క్‌ పూర్తి కావచ్చింది. నాకు ఎదురైన ఇబ్బంది ఎవరికీ రాకూడదనే ఉద్దేశంతోనే ఈ వీడియో షేర్‌ చేస్తున్నాను.' అంటూ రితూ చౌదరి తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement