
అన్యాయాలను ప్రశ్నిస్తుంది
సమాజంలో జరిగే అన్యాయాలను స్పృశిస్తూ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రం ‘ది బెల్స్’. రేయాన్ రాహుల్, నేహాదేశ్‌పాండే జంటగా ఎర్రోజు వెంకట ఆచారి ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రవీణ్ నెల్లుట్ల దర్శకుడు. ఈ సినిమా మే నెలలో విడుదల కానుంది. వెంకట ఆచారి మాట్లాడుతూ -‘‘చక్కని సందేశంతో పాటు, మంచి యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మించాం. ఇప్పటికే పాటలకు మంచి స్పందన లభిస్తోంది ’’ అని చెప్పారు. సమకాలీన అంశాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించామని, అన్ని వయసుల వారికి నచ్చే విధంగా ఉంటుందనీ దర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: కాసర్ల శ్యామ్.