రొమాంటిక్ ప్రేమ
జై ఆకాశ్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘దొంగప్రేమ’. శ్రావణి కథానాయిక. దినేశ్ మాడ్నే నిర్మాత. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలలో జై ఆకాశ్ మాట్లాడుతూ- ‘‘కథే ఈ చిత్రానికి హీరో. ప్రేమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఇది. ఇందులో విలన్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రకాశ్‌రాజ్‌తో చేయించాలనుకున్నాను. కానీ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల ఒక స్ట్రగులింగ్ ఆర్టిస్ట్ ఈ పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెలాఖరున గానీ, వచ్చే నెల తొలివారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నిర్మాత నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, ప్రతాని రామకృష్ణ గౌడ్ కూడా మాట్లాడారు.