ఆనందం, పిలిస్తే పలుకుతా, నవ వసంతం వంటి చిత్రాలతో తెలుగులో సక్సెస్‌ఫుల్ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు జై ఆకాశ్. ఈయన ఏ తరహా పాత్రలు చేసినా తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటారు. రామకృష్ణ సహా తదితర సినిమాలతో కోలీవుడ్‌లోనూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రయోగాలకు మారుపేరైన ఈయన నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా రాణిస్తున్నారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోసం ఎదురుచూడకుండా, వారిపై ఆధారపడకుండా తానే ఏ క్యూబ్ మూవీస్ అనే యాప్‌ను ప్రారంభించి తద్వారా తన చిత్రాలనే కాకుండా ఇతర చిత్రాలను అందులో విడుదల చేస్తున్నారు.
సొంతంగా యాప్..
అలా ఈయన ఇటీవల హీరోగా నటించి నిర్మించిన 'జై విజయం' ఏ క్యూబ్ మూవీస్ యాప్‌లో విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. ఆ తరువాత ఇప్పుడు థియేటర్లలోనూ ప్రదర్శింపబడుతోంది. కాగా తాజాగా జై ఆకాష్ కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మామరం. ఇందులో బ్రహ్మానందం, కాదల్ సుకుమార్, రాహుల్‌దేవ్ ముఖ్యపాత్రలు పోషించారు. నందా సంగీతాన్ని, పాల్‌పాండి చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది.
ఆడియో లాంచ్
ఈ సందర్భంగా సోమవారం చైన్నెలో కమలా థియేటర్‌లో చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జై ఆకాష్ మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రమని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని గత 2012లో ప్రారంభించి 10 ఏళ్లుగా షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కథ డిమాండ్ కారణంగా ఇన్నేళ్లు షూటింగ్ చేసినట్లు చెప్పారు. ఇందులో తన పాత్ర 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు మూడు కోణాల్లో సాగుతుందని చెప్పారు. అందుకే రియాలిటీ కోసం 10 ఏళ్లు దశల వారీగా షూటింగ్ నిర్వహించినట్లు వివరించారు.
చదవండి: బిగ్‌బాస్ సిరితో గొడవ.. సినిమా డిజాస్టర్.. స్పందించిన నందకిశోర్
Comments
Please login to add a commentAdd a comment