Jai Akash
-
ఇకపై ఆ పని చేయను.. పక్కన బెట్టేస్తున్నా: హీరో ఆకాశ్
'ఆనందం' లాంటి సినిమాతో తెలుగులోనూ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఆకాశ్.. ఆ తర్వాత కాలంలో సరైన మూవీస్ చేయకపోవడంతో అలా అలా టాలీవుడ్‌కి దూరమైపోయాడు. గత ఏడెనిమిదేళ్ల నుంచి తమిళంలో మాత్రమే చిత్రాలు చేస్తున్నాడు. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ పనిచేస్తున్నాడు. (ఇదీ చదవండి: కాంగ్రెస్ పార్టీలోకి హీరో అల్లు అర్జున్ మామ.. త్వరలో ఎన్నికల్లో పోటీ?) అయితే చిన్న చిత్రాలకు థియేటర్ల దొరక్కపోవడంతో తనే సొంతంగా 'ఏ క్యూబ్ మూవీస్' అనే యాప్ లాంచ్ చేశాడు. తన సినిమాలతో పాటు పలు చిన్న చిత్రాల్ని ఇందులో రిలీజ్ చేస్తున్నాడు. జై ఆకాశ్.. గతేడాది 'జై విజయం' చిత్రంలో హీరోగా నటించి దర్శకత్వం వహించాడు. ఓటీటీలోనూ ఇది సక్సెస్ అయిన సందర్భంగా.. చిత్ర విజయోత్సవాన్ని స్థానిక వడపళనిలోని ఘనంగా నిర్వహించారు. తాను నటించిన 'అమైచర్ రిటర్న్', 'మామరం' వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయని జై ఆకాశ్ చెప్పాడు. ప్రస్తుతం హీరోగా నటించడానికి నాలుగు సినిమాల్లో ఛాన్సులు వచ్చాయని.. ఈ క్రమంలోనే ఇకపై దర్శకత్వానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నటుడు జై ఆకాష్ క్లారిటీ ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: రష్మికతో పెళ్లి ఆగిపోవడంపై మాజీ ప్రియుడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్) -
హీరోగా జైఆకాశ్.. 10 ఏళ్ల పాటు షూటింగ్, ట్రైలర్ చూశారా?
ఆనందం, పిలిస్తే పలుకుతా, నవ వసంతం వంటి చిత్రాలతో తెలుగులో సక్సెస్ఫుల్ కథానాయకుడిగా పేరు తెచ్చుకున్నాడు జై ఆకాశ్. ఈయన ఏ తరహా పాత్రలు చేసినా తన కంటూ ప్రత్యేక ముద్ర వేసుకుంటారు. రామకృష్ణ సహా తదితర సినిమాలతో కోలీవుడ్‌లోనూ తన కంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. ప్రయోగాలకు మారుపేరైన ఈయన నటుడిగానే కాకుండా దర్శకుడు, నిర్మాతగా రాణిస్తున్నారు. అంతేకాకుండా డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్ల కోసం ఎదురుచూడకుండా, వారిపై ఆధారపడకుండా తానే ఏ క్యూబ్ మూవీస్ అనే యాప్‌ను ప్రారంభించి తద్వారా తన చిత్రాలనే కాకుండా ఇతర చిత్రాలను అందులో విడుదల చేస్తున్నారు. సొంతంగా యాప్.. అలా ఈయన ఇటీవల హీరోగా నటించి నిర్మించిన 'జై విజయం' ఏ క్యూబ్ మూవీస్ యాప్‌లో విడుదలై ప్రేక్షకుల ఆదరణను పొందుతోంది. ఆ తరువాత ఇప్పుడు థియేటర్లలోనూ ప్రదర్శింపబడుతోంది. కాగా తాజాగా జై ఆకాష్ కథానాయకుడిగా నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం మామరం. ఇందులో బ్రహ్మానందం, కాదల్ సుకుమార్, రాహుల్‌దేవ్ ముఖ్యపాత్రలు పోషించారు. నందా సంగీతాన్ని, పాల్పాండి చాయాగ్రహణం అందించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో థియేటర్లలో విడుదల కానుంది. ఆడియో లాంచ్ ఈ సందర్భంగా సోమవారం చైన్నెలో కమలా థియేటర్లో చిత్ర ఆడియో, ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు. జై ఆకాష్ మాట్లాడుతూ.. ఇది తన జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా తెరకెక్కించిన కథా చిత్రమని చెప్పారు. మరో విషయం ఏమిటంటే ఈ చిత్రాన్ని గత 2012లో ప్రారంభించి 10 ఏళ్లుగా షూటింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కథ డిమాండ్ కారణంగా ఇన్నేళ్లు షూటింగ్ చేసినట్లు చెప్పారు. ఇందులో తన పాత్ర 25 ఏళ్ల నుంచి 40 ఏళ్ల వరకు మూడు కోణాల్లో సాగుతుందని చెప్పారు. అందుకే రియాలిటీ కోసం 10 ఏళ్లు దశల వారీగా షూటింగ్ నిర్వహించినట్లు వివరించారు. చదవండి: బిగ్‌బాస్ సిరితో గొడవ.. సినిమా డిజాస్టర్.. స్పందించిన నందకిశోర్ -
ఆనందం హీరో కొత్త సినిమా.. ఒకే రోజు థియేటర్, ఓటీటీలో రిలీజ్..
ఆనందం సినిమాతో తెలుగులో గుర్తిపు తెచ్చుకున్న హీరో జైఆకాశ్ ద్విపాత్రాభినయం చేసిన తమిళ చిత్రం యోగ్యన్. మూన్ స్టార్ పిక్చర్స్ పతాకంపై మాదేశ్ నిర్మించిన ఈ చిత్రంలో కవిత, ఆర్తి, ఖుషీ హీరోయిన్లుగా నటించారు. జైఆకాశ్ శిష్యుడు సాయిప్రభా మీనా దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి జూపిన్ సంగీతాన్ని, పాల్పాండి ఛాయాగ్రహణం అందించారు. ఇందులో జైఆకాశ్ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేయడం విశేషం. చెడ్డవాడైన తండ్రికి పుట్టిన కొడుకు ఎలా మారతాడన్న కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని శక్రవారం తెరపైకి వచ్చింది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చైన్నె, వడపళనిలోని శిఖరం ఆవరణలో చిత్ర యూనిట్ నిర్వహించిన మీడియా సమావేశంలో జైఆకాశ్ మాట్లాడుతూ విలన్ పాత్రలో నటించాలన్నది తన చిరకాల కల అని అది ఈ చిత్రంతో నెరవేరిందన్నాడు. ఈ చిత్రంలో తండ్రీకొడుకులుగా నటించడానికి చాలా కసరత్తులు చేశానన్నాడు. సినిమా బాగా వచ్చిందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడం ఎంతకష్టంగా మారిందో తెలిసిందేనని పేర్కొన్నాడు. చాలా తక్కువ థియేటర్లే తమకు దొరికాయని, దీంతో యోగ్యన్ చిత్రాన్ని థియేటర్లతో పాటు ఏకకాలంలో ఓటీటీలోనూ విడుదల చేయనున్నట్లు చెప్పాడు. ఇందుకోసం ఏ క్యూబ్ మూవీస్ అనే సరికొత్త ఓటీటీ యాప్‌ను ప్రారంభించినట్లు చెప్పారు. ఓటీటీలో రోజుకు రూ.50 చెల్లిస్తే ఫోన్లోనూ, టీవీల్లోనూ ఒక రోజంతా చూడవచ్చునని చెప్పారు. ఓటీటీలో తమ చిత్రాలతో పాటు ఇతర చిత్రాలను విడుదల చేస్తామని చెప్పారు. చిన్న నిర్మాతలకు, చిన్న నటీనటుల చిత్రాలకు ఈ ఓటీటీ చాలా హెల్ప్ అవుతుందన్నారు. అదేవిధంగా ఇతర చిత్రాల నిర్మాతలకు ఏ క్యూబ్ మూవీస్ యాప్‌లో విడుదల చేస్తే వచ్చే ఆదాయంలో 80 శాతం వాళ్లకు, 20 శాతం తమ సంస్థకు చేరుతుందని జైఆకాశ్ తెలిపారు. చదవండి: కార్తీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ -
సీరియల్ యాక్టర్‌గా మారిన బ్లాక్ బస్టర్ మూవీ హీరో
2001లో విడుదలైన తెలుగు సినిమా ఆనందం మీకు గుర్తుందా? ఆ సినిమాలో హీరో మీకు గుర్తున్నారా? అతనేనండి జై ఆకాశ్. ఆ ఆనందం హీరో ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? అతను త్వరలోనే ఓ తెలుగు సీరియల్లో అరంగేట్రం చేయబోతున్నాడు. మీరు విన్నది నిజమే. అప్పుడు సినిమా హీరో.. ఇప్పుడు సీరియల్ హీరోగా మరోసారి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. సీరియల్ సెట్స్‌లో చిత్రాలను ఆయన తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. అక్కడే జై ఆకాశ్‌తో పాటు మోనిషా, జబర్దస్త్ ఫేమ్ సన్నీ కూడా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు. కాగా.. జై ఆకాశ్ తెలుగుతో పాటు తమిళ చిత్రాల్లో నటించారు. శ్రీలంకలో జన్మించిన ఆకాశ్ ఆ తర్వాత యూకేలోని లండన్‌లో స్థిరపడ్డారు. కె బాలచందర్ నిర్మించిన రోజావనం (1999) చిత్రంలో రెండో ప్రధాన పాత్ర కోసం ఎంపికయ్యారు. ఆ తర్వాత 2001లో వచ్చిన ఆనందం చిత్రంతో తెలుగులో అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రంలో అతను ప్రధాన పాత్ర పోషించాడు. పలు తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకుడిగా పనిచేశారు. ఆకాశ్ చివరిసారిగా 2010లో నమో వెంకటేశ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత మరోసారి తెలుగు చిత్రసీమలో రీ ఎంట్రీ ఇస్తున్నారు. జై ఆకాశ్ నటించిన రాబోయే డైలీ కొత్త టీవీ షో పేరు 'గీతాంజలి'లో నటిస్తున్నారు. ఇందులో ప్రముఖ బుల్లితెర నటి సుజిత ధనుష్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. View this post on Instagram A post shared by Jai Akash (@jaiakash252) -
ఆ కారణంగానే హీరో ఆకాశ్ సినిమాలకు దూరమయ్యాడా?
‘ఆనందం’ సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయం అయిన హీరో ఆకాశ్. అప్పటికే అతడు పలు సినిమాల్లో నటించినప్పటికి శ్రీనువైట్ల దర్శకత్వంలో వచ్చిన ఆనందం మూవీ ఆయనకు కమర్షియల్ హిట్‌ను అందించింది. ఈ మూవీతో జై ఆకాశ్‌కు ఒక్కసారిగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోయింది. ఇందులో హీరోయిన్‌తో గొడవ పడుతూ, తండ్రికి భయపడే కుమారుడిగా ఆకాశ్ లేడీ ఫ్యాన్స్ ఆకట్టుకున్నాడు. ఇందులో తన హేర్‌స్టైల్, స్టైలిష్ లుక్ అమ్మాయిల కలల రాకుమారుడిగా మారిపోయాడు. ఆనందం మూవీ సమయంలో ఆకాశ్ క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో వరుస సినిమా ఆఫర్లు వచ్చినప్పటికీ ఆకాశ్ హీరోగా ఎక్కువ కాలం రాణించలేకపోయాడు. అయితే దీనికి కారణం తనకు వచ్చిన స్టార్ స్టేటస్‌ను చూసుకుని దర్శక-నిర్మాతలను తన డిమాండ్లతో ఇబ్బంది పెట్టడమే అని సినీ వర్గాల అభిప్రాయం. జై ఆకాశ్ అసలు పేరు.. సతీష్ నాగేశ్వరన్. శ్రీలంక తమిళ కుటుంబం నుంచి 1981 మార్చి 18న కొలంబోలో జన్మించాడు. విద్యాభ్యాసమంతా శ్రీలంకలో చేశాడు. పై చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడ స్థిరపడిన ఆకాశ్ సినిమాలపై ఆసక్తితో చెన్నై వచ్చాడు. ఈ క్రమంలో ‘రోజా వనం’ అనే తమిళ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత తెలుగులో సుమంత్ హీరో వచ్చిన ‘రామ్మా చిలకమ్మ’లో సైడ్ హీరోగా చేశాడు. ఆ వెంటనే ‘ఆనందం’ సినిమాలో మెయిన్ హీరోగా నటించే చాన్స్ వచ్చింది. ఇక ఆ తర్వాత తెలుగు, హిందీ, కన్నడ, తమిళ పరిశ్రమల్లో పలు సినిమాలు చేసి హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇలా నంది అవార్డుతో పాటు పలు పురస్కారాలు అందుకున్న ఆకాశ్ ఎక్కువ కాలం హీరోగా రాణించలేకపోయాడు. సినిమాల్లో సైడ్ క్యారెక్టర్స్ చేస్తూనే దర్శకుడిగా మారాడు. తమిళం, తెలుగులో పలు సినిమాలకు దర్శకత్వం వహించాడు. అలాగే స్వయంగా దర్శకత్వం వహిస్తూనే హీరోగా నటించాడు. ఈ క్రమంలో తమిళ హీరోయిన్ నిషాను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పటివరకు అంత బాగానే ఉంది. కానీ తను నిర్మించిన చిత్రాలు అన్ని బాక్సాఫీసు వద్ద అంతగా రాణించలేదు. అలాగే తన యాటిట్యూడ్‌తో వచ్చిన సినిమా అవకాశాలు పోగొట్టుకోవడం, నటించిన సినిమాలు విడుదల కాకపోవడంతో నటుడిగా ఆకాశ్ కేరీర్ డౌన్ అయ్యింది. ఇక నిర్మాతగా తాను సంపాదించుకున్న ఆస్తులతో పాటు ఉన్న ఆస్తులను కూడా పోగొట్టుకున్నాడు. ఆర్థికంగా నష్టపోయాడు. అయితే ఒక్క సినిమా హిట్‌కే పెద్ద స్టార్‌నని ఫీల్ అవుతూ డైరెక్టర్స్ దగ్గర గొంతెమ్మ కోరికలు కోరేవాడట. సోనాలి బింద్రే, సిమ్రాన్ వంటి స్టార్ హీరోయిన్లు అయితేనే నటిస్తానని డిమాండ్ చేయడంతో ఆకాశ్‌కు అవకాశాలు వెనక్కిపోయేవట. దీంతో కొంతకాలం నటనకు దూరమై తెరపై కనుమరుగైన ఆకాశ్ ఇటీవల దర్శకుడు పూరి జగన్నాథ్ తీసిన ఇస్మార్ట్ శంకర్ మూవీ తనదే అంటూ సంచలన వ్యాఖ్యలు చేసి మళ్లీ తెరపైకి వచ్చాడు. తన సినిమాను పూరి దొంగలించారని, నష్టపరిహరంగా 2 కోట్ల రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్ చేశాడు. అయితే దీనిపై పూరి ఇంతవరకు స్పందించలేదు. ఈ క్రమంలో ఆకాశ్ ఆర్థికంగా నష్టపోయాడని, డబ్బు, ఫేం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నట్లు నెటిజన్లు, పూరి అభిమానులు ఆకాశ్‌ను విమర్శించారు. దీంతో వాటిపై స్పందించిన ఆకాశ్..తనకు లండన్‌లో సొంతంగా 2, 3 పెట్రొల్ బంక్‌లు, సూపర్ మార్కెట్లు ఉన్నాయని చెప్పుకొచ్చాడు. అలాగే తెలుగు పరిశ్రమ తనని దారుణంగా మోసం చేసిందంటూ ఇండస్ట్రీపై అనుచిత వ్యాఖ్యలు చేసి వార్తల్లోకి ఎక్కాడు. -
చెన్నై టూ బ్యాంకాక్ అంటున్న జైఆకాశ్
నటుడు జైఆకాశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం చెన్నై టూ బ్యాంకాక్.జి.ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై కే.షాజహాన్, కే.ఆనంద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్యాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటి సోనీ చరిష్టా, యాళిని కథానారుుకలుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో పవర్‌స్టార్, శామ్స్, అశ్విన్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు ప్రభుసాలమన్ అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టగా దర్శకుడు త్యాగరాజ్ ముహూర్తం సన్నివేశాన్ని జైఆకాష్, శ్యామ్స్, అశ్విన్‌లపై చిత్రీకరించారు. అనంతరం దర్శకుడు చిత్ర వివరాలను తెలుపుతూ ఇంటి పనుల కోసం అంటూ చెన్నై నుంచి బ్యాంకాంక్‌కు అమ్మారుులను తీసుకెళ్లి చట్ట విరోధ పనులకు వాడుతుంటారన్నారు.వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నారన్నదే చిత్ర కథ అని తెలిపారు.చిత్ర షూటింగ్‌ను అధిక భాగం బ్యాంకాంక్‌లో తీసినట్లు వెల్లడించారు.అదే విధంగా పట్టయ్, బక్కట్, గోవా ప్రాంతాల్లోనూ చిత్రీకరణను జరపనున్నట్లు తెలిపారు. ఇందులో బ్యాంకాక్, మలేషియా నటీనటులు నటించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతాన్ని యూకే.మురళి, చాయాగ్రహనాన్ని దేవరాజ్ అందిస్తున్నట్లు తెలిపారు. -
ఐదుగురు భామలతో జైఆకాశ్ రొమాన్స్
మంచి విజయం కోసం పోరాడుతున్న నటుల్లో జైఆకాశ్ ఒకరు. అందుకు ఆయన చేస్తున్న తాజా ప్రయత్నం అమావాసై చిత్రం. జైఅకాశ్‌కు తమిళంతో పాటు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. దీంతో ఆయన చిత్రాలు చాలా వరకు బహుభాషా చిత్రాలుగానే ఉంటాయి. ఈ అమావాసై చిత్రాన్ని కూడా తమిళం, తెలుగు భాషల్లో రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో జైఆకాశ్ ఏకంగా ఐదుగురు ముద్దుగుమ్మలతో రొమాన్స్ చేయడం విశేషం. జయా ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి రాజేశ్ సావంత్ కథ, దర్శకత్వం, నిర్మాత బాధ్యతల్ని నిర్వహిస్తున్నారు. మాటలను బాబా రాయగా సంగీతాన్ని బాలీవుడ్ సంగీత దర్శకుడు సయ్యద్ అహ్మద్, చాయాగ్రహణంను డేవిడ్ బాసు అందిస్తున్నారు. ఇందులో జైఆకాశ్ సరసన సాక్షి, శోగన్, ప్రీతీసింగ్, తాన్యామౌర్య, ముమైత్‌ఖాన్ నటించారు.ఇతర పాత్రల్లో నుపూర్‌మేతా, రాజేశ్‌వివేక్, జీవా, శ్రావణ్ నటించిన ఈ చిత్రంలో ముఖ్య పాత్రను కోటాశ్రీనివాసరావు పోషించారు. చిత్రం గురించి దర్శక నిర్మాత రాజేశ్ సావంత్ తెలుపుతూ ఇది హారర్ నేపథ్యంంతో సాగే మ్యూజికల్ థ్రిల్లర్ కథా చిత్రం అన్నారు. చిత్ర షూటింగ్‌ను రాజస్తాన్, ఉదయ్‌పూర్, జోధ్‌పూర్, చెన్నై ప్రాంతాల్లో నిర్వహించామని వివరించారు. భారీ నిర్మాణ విలువలతో నిర్మిస్తున్న ఈ అమావాసై చిత్ర నిర్మాణం పూర్తి అయ్యిందన్నారు. చిత్రాన్ని తమిళం, తెలుగు భాషల్లో ఏక కాలంలో ఆగస్ట్‌లో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు రాజేశ్ సావంత్ వెల్లడించారు. -
విదేశాల్లో ‘నాన్ యార్’
దర్శకుడు, నిర్మాత, నటుడు ఇలా వివిధ విభాగాల్లో ప్రతిభను చాటుకునే విధంగా నిరంతర ప్రయత్నంలో ఉన్న నటుడు జై ఆకాష్. అలాంటి నటుడి తాజా ప్రయత్నం నాన్‌యార్. ఈయన కథ, కథనం రాసి కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో నాయకిగా లండన్‌కు చెందిన మోడల్ ప్రియ నటిస్తున్నారు. జై బాలాజీ మూవీ మేకర్స్, రానం ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంభాషణలు సమకూర్చి దర్శకత్వం వహిస్తున్నారు ఎన్.రాధ. చిత్రం పూర్తిగా విదేశాల్లో చిత్రీకరణ జరుపుకున్న ఈ చిత్రం గురించి జై ఆకాష్ తెలుపుతూ పట్టుభద్రుడైన హీరోకు లండన్‌లో ఉద్యోగం వస్తుందన్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న తాను భార్యతో కలసి లండన్ వెళతారన్నారు. అక్కడ సంతోషంగా జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్న వీరికి ఊహించని ముప్పు ఏర్పడుతుందన్నారు. దీంతో హీరోలో అనూహ్య మార్పు చోటు చేసుకుంటుందని తెలిపారు. తానెవరో కూడా తెలియని విధంగా ప్రవర్తిస్తారని తెలిపారు. అసలు అందుకు కారణాలేమిటి? ఆ తరువాత ఏమి జరిగిందన్న పలు ఆసక్తికరమైన అంశాలతో దెయ్యాలు, భూతాలు లేకుండానే సస్పెన్స్ థ్రిల్లర్‌గా కథ సాగుతుందని చెప్పారు. సుమన్‌శెట్టి, జాన్సన్, సోనియా శర్మ, దేవంతి, నహీనా, రాధ ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి యూకే. మురళి సంగీతాన్ని అందించారు. చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం శనివారం స్థానిక వడపళనిలోని ఆర్కేవీ స్టూడియోలో జరిగింది. -
ఆనందం స్థాయిలో...
జైఆకాష్ హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’. నందిత సమర్పణలో ఎన్.జె. రత్నావత్ నిర్మించిన ఈ చిత్రంలో ఏంజెల్ సింగ్, జియాఖాన్, అలేఖ్య కథానాయికలు. త్వరలో తెరకు కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆకాష్ మాట్లాడుతూ -‘‘‘స్వీట్ హార్ట్’ చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రత్నావత్ మళ్లీ నా దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది. హీరోగా నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘ఆనందం’ స్థాయిలో ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో సప్తగిరి రెండో హీరోగా నటించారని నిర్మాత చెప్పారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రత్నావత్ బలరామ్, సంగీతదర్శకుడు సుమన్ జూపూడి పాల్గొన్నారు. -
కెమిస్ట్రీ అదిరింది!
జై ఆకాశ్, తమన్, ఆర్చన నాయకా నాయికలుగా రావుట్ల లింగం నిర్మిస్తున్న చిత్రం ‘చాక్లెట్’. రామకృష్ణ వీర్నాల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఉపశీర్షిక ‘ఎ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్’. దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ ఆదర్శంతో ఈ చిత్రం చేశాం. ఇందులో జై ఆకాశ్, అర్చన మధ్య కెమిస్ట్రీ గురించి అందరూ చెప్పుకుంటారు. పాటల్లో, రొమాంటిక్ సన్నివేశాల్లో ఈ ఇద్దరి కెమిస్ట్రీ అదిరిపోయింది. ఇందులో రెండో హీరోగా నటిస్తున్న తమన్‌కి మంచి బ్రేక్ వస్తుంది. త్వరలో రెండో షెడ్యూల్ ఆరంభించనున్నాం’’ అని చెప్పారు. -
ఐస్‌క్రీమ్ ప్రేరణతో...
జై ఆకాశ్, అర్చన, కోమల్ శర్మ, సోనాల్ ఝాన్సీ ప్రధాన పాత్రధారులుగా రూపొందుతోన్న క్రైమ్ హారర్ థ్రిల్లర్ ‘చాక్లెట్’. రామకృష్ణ వీర్నల దర్శకుడు. రావుట్ల లింగం నిర్మాత. తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విశేషాలు తెలుపడానికి హైదరాబాద్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఓ మంచి కథాంశంతో ఈ చిత్రం రూపొందుతోందని జై ఆకాశ్ చెప్పారు. చాక్లెట్‌ని అందరూ ఎలా ఇష్టపడతారో... ఈ సినిమాను కూడా అలాగే అందరూ ఇష్టపడతారని అర్చన అన్నారు. వచ్చేనెలలో రెండో షెడ్యూల్ మొదలుపెడతామనీ, రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ టైటిలే తమ ‘చాక్లెట్’ టైటిల్‌కి ప్రేరణ అని దర్శకుడు చెప్పారు. ఈ చిత్రానికి కెమెరా: రామరాజు, సంగీతం: ప్రేమ్. -
‘ఐస్‌క్రీమ్’ ప్రేరణతో...
జై ఆకాశ్, తమన్ హీరోలుగా, అర్చన కథానాయికగా రూపొందనున్న చిత్రం ‘చాక్లెట్’. ‘ఎ స్వీట్ లవ్‌స్టోరి’ అనేది ఉపశీర్షిక. రామకృష్ణ వీర్నాల దర్శకుడు. రావుట్ల లింగం నిర్మాత. త్వరలోనే సెట్స్‌కి వెళ్లనున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ -‘‘రామ్‌గోపాల్‌వర్మ ‘ఐస్‌క్రీమ్’ ప్రేరణతో హాస్యం కలగలిపిన రొమాంటిక్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించనున్నాం’’ అని తెలిపారు. ‘సత్యం’రాజేశ్, ‘చిత్రం’శ్రీను, ‘ఛత్రపతి’ శేఖర్, పొట్టి విజయ్, ఆర్కేవి, సౌజన్య, అలీభాయ్, వాసు తదితరులు ఇతర పాత్రలు పోషించనున్న ఈ చిత్రానికి కెమెరా: రామరాజు, సంగీతం: ఎల్.ఎం.ప్రేమ్. -
రొమాంటిక్ ప్రేమ
జై ఆకాశ్ స్వీయ దర్శకత్వంలో హీరోగా నటిస్తున్న చిత్రం ‘దొంగప్రేమ’. శ్రావణి కథానాయిక. దినేశ్ మాడ్నే నిర్మాత. హైదరాబాద్‌లో జరిగిన విలేకరుల సమావేశంలలో జై ఆకాశ్ మాట్లాడుతూ- ‘‘కథే ఈ చిత్రానికి హీరో. ప్రేమ నేపథ్యంలో సాగే రొమాంటిక్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో విలన్ పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. అందుకే ప్రకాశ్‌రాజ్‌తో చేయించాలనుకున్నాను. కానీ డేట్స్ ప్రాబ్లమ్ వల్ల ఒక స్ట్రగులింగ్ ఆర్టిస్ట్ ఈ పాత్ర చేస్తున్నాడు. ఈ చిత్రం ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తోంది. ఈ నెలాఖరున గానీ, వచ్చే నెల తొలివారంలో కానీ సినిమాను విడుదల చేస్తాం’’ అని తెలిపారు. అందరికీ నచ్చే సినిమా అవుతుందని నిర్మాత నమ్మకం వెలిబుచ్చారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు, ప్రతాని రామకృష్ణ గౌడ్ కూడా మాట్లాడారు. -
‘దొంగ ప్రేమ’ మూవీ స్టిల్స్
-
శని దేవుడు మూవీ స్టిల్స్
-
జన్మజన్మల బంధం మూవీ స్టిల్స్
-
అదిరింది అలెక్స్ మూవీ స్టిల్స్
-
మలేసియాలో ప్రేమ
‘‘ఇప్పటివరకు లవర్‌బోయ్, కామన్ మేన్ పాత్రలు చేశాను. వాటికి భిన్నంగా ఇందులో ప్రతినాయక ఛాయలున్న పాత్ర చేశాను. శాటిలైట్ రైట్స్, బిజినెస్‌ని దృష్టిలో పెట్టుకుని కాకుండా నాణ్యత గల సినిమా చేయాలనే తపనతో చేశాం. సినిమా బాగా వచ్చింది’’ అని జై ఆకాష్ చెప్పారు. ఆయన హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘లవ్ ఇన్ మలేసియా’. సంగీత, గెహనా వశిష్ట్, రమ్య నాయికలుగా ఈ చిత్రాన్ని గణేశ్ దొండి నిర్మించారు. సుమన్ జూపూడి స్వరపరచిన ఈ చిత్రం పాటలను నిర్మాత కొడాలి వెంకటేశ్వరరావు ఆవిష్కరించారు. గణేశ్ దొండి మాట్లాడుతూ - ‘‘కథానుసారం ఎక్కువ శాతం షూటింగ్‌ని మలేసియాలో చేశాం. మంచి కథ, పాటలు, ఆకాశ్ డెరైక్షన్.. ఈ సినిమా విజయానికి దోహదపడతాయి’’ అని చెప్పారు. మంచి పాటలివ్వడానికి ఆస్కారం ఉన్న కథ ఇదని సంగీతదర్శకుడు తెలిపారు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: నరేశ్ .బి. -
లవ్ ఇన్ మలేషియా మూవీ ఆడియో లాంచ్
-
ప్రేమలో ఓడిన స్త్రీ
ప్రేమలో ఓడిన ఒక స్త్రీ ఏం చేసిందనేదే కాదలిక్కు కన్నిల్లై చిత్రం అని ఆ చిత్ర దర్శకుడు, నటుడు జై ఆకాష్ తెలిపారు. ఈయన కథనం, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తూ తండ్రీ కొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రాన్ని ఎం ఎం ఎం క్రియేషన్స్ సంస్థ, జై బాలాజి మూవీ మేకర్స్ సంస్థ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అలీషా దాస్, నిషా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇతర ముఖ్యపాత్రల్లో వై.ఇందు, లలిత్య, ప్రభాకరన్, శ్రీరమ్య తదితరులు నటిస్తున్నారు. చిత్రం గురించి దర్శక , నటుడు జై ఆకాష్ మాట్లాడుతూ, 17 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వరకు జీవితంలో ప్రేమ పోరాటం చేసిన ఒక స్త్రీ ఇతివృత్తమే కాదలుక్కు కన్నిల్లై చిత్ర కథ అని చెప్పారు. ఒక వ్యక్తిని ప్రేమించి అతని ద్వారా తన జీవితాన్ని కోల్పోయిన ఆ స్త్రీ ఏమి చేసిందనే పలు ఆసక్తికరమైన సన్నివేశాల సమాహారం ఈ చిత్రం అని పేర్కొన్నారు. తాను ఇందులో రెండు వైవిధ్యమైన పాత్రల్ని పోషిస్తున్నట్లు తెలిపారు. యుకె మురళి సంగీతాన్ని అందించిన ఈ చిత్రం ఆడియో ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల చెన్నైలో జరిగింది. -
‘ఫేస్ ఆఫ్’ ప్రేరణతో...
హాలీవుడ్ సంచలన చిత్రం ‘ఫేస్ ఆఫ్’ ప్రేరణతో జై ఆకాశ్ దర్శకత్వంలో ‘లవ్ ఇన్ మలేసియా’ చిత్రం రూపొందుతోంది. ఇందులో ఆకాశ్ సరసన సందీప్తి, సంగీత, గెహనా వశిష్ఠ్ నాయికలుగా చేస్తు న్నారు. గణేశ్ దొండి నిర్మిస్తున్న ఈ చిత్రం 90 శాతం పూర్తయింది. ఓ డాక్టర్‌తో ప్రేమాయణం సాగించే పోలీస్ కథ ఇదని, ఇందులో తాను టైస్ట్ హెడ్‌గా నటిస్తున్నానని జై ఆకాశ్ తెలిపారు. మలేసియాలో అత్యధిక భాగం చిత్రీకరణ జరిపామని, మే నెలలో చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాత చెప్పారు. ఈ చిత్రానికి సంగీతం: జూపూడి సుమన్. -
లవ్ ఇన్ మలేషియా మూవీ స్టిల్స్
-
ముమైత్ స్పెషల్ సాంగ్
జై ఆకాష్ హీరోగా తెలుగులో ‘ఆదివారం అమావాస్య’ పేరుతోనూ, తమిళంలో ‘అమావాస్య’ గానూ ఓ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్ సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవలే జై ఆకాష్, ముమైత్‌ఖాన్‌పై ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు. ఈ సాంగ్‌లో 40 మంది డ్యాన్సర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ పాట చాలా మెస్మరైజింగ్‌గా ఉంటుందని, ముమైత్‌ఖాన్ పేరు మళ్లీ మార్మోగడం ఖాయమని రాకేష్ సావంత్ చెప్పారు. కోట శ్రీనివాసరావు, జీవ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సయ్యద్ అహ్మద్. ఎడిటింగ్: అనిల్ బొంతు, రచన: దిలీప్ మిశ్ర, రాకేష్ సావంత్, సహనిర్మాత: కె.కె. అగర్వాల్. -
ఆ ఇద్దర్నీ డెరైక్ట్ చేయడం నా అదృష్టం : జై ఆకాష్
సుమన్, భానుచందర్ టైటిల్ పాత్రలు పోషించిన చిత్రం ‘ఆ ఇద్దరు’. ‘ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్’ అనేది ఉపశీర్షిక. జై ఆకాష్ నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇ.బాబునాయుడు నిర్మాత. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిరకాల మిత్రుడు భానుచందర్‌తో కలిసి నటించడం పట్ల సుమన్ ఆనందం వెలిబుచ్చారు. సుమన్, భానుచందర్‌లను డెరైక్ట్ చేయడం అదృష్టంగా ఫీలవుతున్నానని, ప్రేమ, స్నేహం, యాక్షన్, కామెడీ సమ్మేళనమే ఈ సినిమా అని జై ఆకాష్ చెప్పారు. సినిమా బాగా వచ్చిందని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు జై ఆకాష్ సతీమణి నిషా, ఇసకాన సునీల్‌రెడ్డి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు. -
‘దొంగ ప్రేమ’లో దమ్ముంది
‘ప్రస్తుతం ఇండస్ట్రీకి నిర్మాతలు చాలా అవసరం. నిర్మాణ వ్యయం అదుపులేని దర్శకుల కారణంగా చాలామంది ఇటు రావడానికి భయపడుతున్నారు. అటువంటి వారికి అండగా నిలిచేందుకే తక్కువ బడ్జెట్లో మంచిక్వాలిటీతో సినిమాలు తీస్తున్నా. ఈ ‘దొంగ ప్రేమ’ కథలో దమ్ముంది’’ అని జై ఆకాష్ చెప్పారు. ఆయన స్వీయ దర్శకత్వంలో నటిస్తూ రూపొందించిన ‘దొంగ ప్రేమ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఖాదర్‌వలి సమర్పణలో దినేష్ మ్యాడ్నీ నిర్మించిన ఈ చిత్రంలో ఖుషి ముఖర్జీ, కవితాఛటర్జీ నాయికలు. ఈ కార్యక్రమంలో నిర్మాత బెక్కెం వేణుగోపాల్, మనోజ్ అగర్వాల్, కిశోర్‌కుమార్, నరేష్, అశోక్ వడ్లమూడి తదితరులు పాల్గొన్నారు.