చెన్నై టూ బ్యాంకాక్ అంటున్న జైఆకాశ్
నటుడు జైఆకాశ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం చెన్నై టూ బ్యాంకాక్.జి.ఫిలిం ఫ్యాక్టరీ పతాకంపై కే.షాజహాన్, కే.ఆనంద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి త్యాగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. నటి సోనీ చరిష్టా, యాళిని కథానారుుకలుగా నటిస్తున్నారు. ఇతర ముఖ్యపాత్రల్లో పవర్‌స్టార్, శామ్స్, అశ్విన్ నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ స్థానిక వడపళనిలోని ఏవీఎం స్టూడియోలో పూజాకార్యక్రమాలతో ప్రారంభమైంది. ప్రముఖ దర్శకుడు ప్రభుసాలమన్ అతిథిగా విచ్చేసి క్లాప్ కొట్టగా దర్శకుడు త్యాగరాజ్ ముహూర్తం సన్నివేశాన్ని జైఆకాష్, శ్యామ్స్, అశ్విన్‌లపై చిత్రీకరించారు.
అనంతరం దర్శకుడు చిత్ర వివరాలను తెలుపుతూ ఇంటి పనుల కోసం అంటూ చెన్నై నుంచి బ్యాంకాంక్‌కు అమ్మారుులను తీసుకెళ్లి చట్ట విరోధ పనులకు వాడుతుంటారన్నారు.వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నారన్నదే చిత్ర కథ అని తెలిపారు.చిత్ర షూటింగ్‌ను అధిక భాగం బ్యాంకాంక్‌లో తీసినట్లు వెల్లడించారు.అదే విధంగా పట్టయ్, బక్కట్, గోవా ప్రాంతాల్లోనూ చిత్రీకరణను జరపనున్నట్లు తెలిపారు. ఇందులో బ్యాంకాక్, మలేషియా నటీనటులు నటించనున్నట్లు చెప్పారు. ఈ చిత్రానికి సంగీతాన్ని యూకే.మురళి, చాయాగ్రహనాన్ని దేవరాజ్ అందిస్తున్నట్లు తెలిపారు.