![ఆనందం స్థాయిలో...](/styles/webp/s3/article_images/2017/09/2/61422811014_625x300.jpg.webp?itok=-0Gq9C3C)
ఆనందం స్థాయిలో...
జైఆకాష్ హీరోగా నటించి, స్వీయదర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’. నందిత సమర్పణలో ఎన్.జె. రత్నావత్ నిర్మించిన ఈ చిత్రంలో ఏంజెల్ సింగ్, జియాఖాన్, అలేఖ్య కథానాయికలు. త్వరలో తెరకు కానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను విడుదల చేశారు. ఆకాష్ మాట్లాడుతూ -‘‘‘స్వీట్ హార్ట్’ చిత్రానికి దర్శకుడిగా అవకాశం ఇచ్చిన రత్నావత్ మళ్లీ నా దర్శకత్వంలోనే ఈ చిత్రాన్ని రూపొందించడం ఆనందంగా ఉంది. హీరోగా నాకు మంచి గుర్తింపు తెచ్చిన ‘ఆనందం’ స్థాయిలో ఈ చిత్రం విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. వినోదాత్మకంగా సాగే ఈ చిత్రంలో సప్తగిరి రెండో హీరోగా నటించారని నిర్మాత చెప్పారు. ఎగ్జిక్యూటివ్ నిర్మాత రత్నావత్ బలరామ్, సంగీతదర్శకుడు సుమన్ జూపూడి పాల్గొన్నారు.