ఆ ఇద్దర్నీ డెరైక్ట్ చేయడం నా అదృష్టం : జై ఆకాష్
ఆ ఇద్దర్నీ డెరైక్ట్ చేయడం నా అదృష్టం : జై ఆకాష్
Published Mon, Mar 10 2014 12:28 AM | Last Updated on Sat, Sep 2 2017 4:31 AM
సుమన్, భానుచందర్ టైటిల్ పాత్రలు పోషించిన చిత్రం ‘ఆ ఇద్దరు’. ‘ఫ్రెండ్‌షిప్ ఫర్ ఎవర్’ అనేది ఉపశీర్షిక. జై ఆకాష్ నటిస్తూ.. దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి ఇ.బాబునాయుడు నిర్మాత. ఈ చిత్రం ప్రచార చిత్రాలను హైదరాబాద్‌లో విడుదల చేశారు. చిరకాల మిత్రుడు భానుచందర్‌తో కలిసి నటించడం పట్ల సుమన్ ఆనందం వెలిబుచ్చారు. సుమన్, భానుచందర్‌లను డెరైక్ట్ చేయడం అదృష్టంగా ఫీలవుతున్నానని, ప్రేమ, స్నేహం, యాక్షన్, కామెడీ సమ్మేళనమే ఈ సినిమా అని జై ఆకాష్ చెప్పారు. సినిమా బాగా వచ్చిందని, త్వరలోనే సినిమాను విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. ఇంకా చిత్రం యూనిట్ సభ్యులతో పాటు జై ఆకాష్ సతీమణి నిషా, ఇసకాన సునీల్‌రెడ్డి, అలేఖ్య తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement