సాధారణంగా ఎక్కడైనా నిరసన ప్రదర్శనలు జరిగినప్పుడు దానిలో పాల్గొన్నవారు జెండాలను, ప్లకార్డులను పట్టుకోవడాన్ని మనం చూస్తుంటాం. వీటిని ప్రదర్శించడం ద్వారా వారు తమ వాదనను బలంగా వినిపిస్తుంటారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో విద్యార్థులు స్థానిక రిజర్వేషన్లకు వ్యతిరేకంగా ప్రతిరోజూ నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. వీరికి జెండాలను, హెడ్ బ్యాండ్‌లను విక్రయిస్తూ ఓ వ్యాపారి అత్యధికంగా సంపాదిస్తున్నాడు.
ప్రభుత్వ వ్యతిరేక నిరసనల మధ్య రాజధాని ఢాకాలో జాతీయ జెండాలు, హెడ్‌బ్యాండ్‌లకు ఎన్నడూ లేనంత డిమాండ్ ఏర్పడింది. దీనిని గుర్తించిన సుమన్(35) అనే వ్యాపారి నిరసనకారులకు అవసరమైన జెండాలను, హెడ్ బ్యాండ్‌లను విక్రయిస్తున్నాడు. 1989లో ఢాకాలో జన్మించిన సుమన్, బంగ్లాదేశ్ జెండాలతో పాటు మూడు వేర్వేరు సైజుల హెడ్‌బ్యాండ్‌లను విక్రయిస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తాను రూపొందిస్తున్న బంగ్లాదేశ్ జాతీయ జెండాలకు, గ్రీన్ హెడ్‌బ్యాండ్‌లు విద్యార్థులు విరివిగా కొనుగోలు చేస్తున్నారని తెలిపాడు.
సుమన్ మీడియాతో మాట్లాడుతూ ‘నేను ఢాకాలోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించాను. నా పేరు విన్నవాళ్లంతా నా తల్లిదండ్రులు వేర్వేరు మతాలకు చెందిన వారని అనుకుంటారు. అయితే అది నిజం కాదు. మా అమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు, మా ఇంటిపక్కన ఉండే ఓ హిందూ మహిళ నాకు సుమన్ అనే పేరు పెట్టింది. భారతీయ సంతతికి చెందిన నా తండ్రి 1971లో కలకత్తా నుండి ఢాకాకు వచ్చి, ఇక్కడ స్థిరపడ్డారు. నేను పెరిగి పెద్దయ్యాక జాతీయ జెండాలు రూపొందిస్తూ, వాటిని విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాను. ఇటీవలి కాలంలో తాను 1,500 జెండాలు, 500 హెడ్‌బ్యాండ్‌లను విక్రయించానని’ తెలిపారు. సుమన్ తన జీవనోపాధి కోసం 2018 నుండి జెండాలు విక్రయిస్తున్నాడు. ఢాకాలో క్రికెట్ మ్యాచ్‌ల సమయంలో కూడా సుమన్ జాతీయ జెండాలను విక్రయిస్తుంటాడు.
STORY | Meet Mohd Suman: Flag-seller who saw #Dhaka protests up, close and personal
READ: https://t.co/X303wK81Nj
(PTI Photo) pic.twitter.com/Ux18GikLbg— Press Trust of India (@PTI_News) August 27, 2024
Comments
Please login to add a commentAdd a comment