ముమైత్ స్పెషల్ సాంగ్ | Special song for Mumaith | Sakshi
Sakshi News home page

ముమైత్ స్పెషల్ సాంగ్

Published Tue, Mar 11 2014 11:13 PM | Last Updated on Sat, Sep 2 2017 4:35 AM

ముమైత్ స్పెషల్ సాంగ్

ముమైత్ స్పెషల్ సాంగ్

జై ఆకాష్ హీరోగా తెలుగులో ‘ఆదివారం అమావాస్య’ పేరుతోనూ, తమిళంలో ‘అమావాస్య’ గానూ ఓ చిత్రం రూపొందుతోంది. బాలీవుడ్ సెక్స్ బాంబ్ రాఖీసావంత్ సోదరుడు రాకేష్ సావంత్ స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కోసం ఇటీవలే జై ఆకాష్, ముమైత్‌ఖాన్‌పై ఓ ఐటమ్ సాంగ్ చిత్రీకరించారు. ఈ సాంగ్‌లో 40 మంది డ్యాన్సర్లు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు. ఈ పాట చాలా మెస్మరైజింగ్‌గా ఉంటుందని, ముమైత్‌ఖాన్ పేరు మళ్లీ మార్మోగడం ఖాయమని రాకేష్ సావంత్ చెప్పారు. కోట శ్రీనివాసరావు, జీవ ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సయ్యద్ అహ్మద్. ఎడిటింగ్: అనిల్ బొంతు, రచన: దిలీప్ మిశ్ర, రాకేష్ సావంత్, సహనిర్మాత: కె.కె. అగర్వాల్.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement