
ముగ్గురు స్నేహితుల సరదా
‘‘నిజానికి ‘ఆనందం’ చిత్రానికి సీక్వెల్ చేయాలని ఎప్పట్నుంచో అనుకుంటున్నాం. అయితే శ్రీను వైట్లగారికి కుదరకపోవడంతో, నేనే దర్శకత్వం చేస్తున్నాను’’ అని జై ఆకాష్ చెప్పారు. దేవి మూవీస్, సిరి వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై గణేష్ దొండి సమర్పణలో ఎస్.జె. రత్నావత్ నిర్మిస్తున్న చిత్రం ‘ఆనందం మళ్లీ మొదలైంది’. జైఆకాష్ నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సుమన్ జూపూడి స్వరాలందించారు.
ఆడియో సీడీని వేణుస్వామి ఆవిష్కరించి, బసిరెడ్డికి ఇచ్చారు. ఈ వేడుకలో ప్రసన్నకుమార్, ఖాదర్‌వల్లి, దినేష్, ఆకాష్ సతీమణి నిషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆకాష్ మాట్లాడుతూ -‘‘ముగ్గురు స్నేహితుల మధ్య సరదా సరదాగా సాగే సినిమా ఇది’’ అని చెప్పారు. ఈ చిత్రంలో కథానాయికలుగా నటిస్తుండటంపట్ల ఏంజిల్, అలేఖ్య, జియా, సందీప్తి, అలీషా ఆనందం వ్యక్తం చేశారు.