గోపీచంద్‌ యాక్షన్‌కు శ్రీను వైట్ల మార్క్‌ డైరెక్షన్‌తో 'విశ్వం' ట్రైలర్‌ | Gopichand And Srinu Vaitla Viswam Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

గోపీచంద్‌ యాక్షన్‌కు శ్రీను వైట్ల మార్క్‌ 'విశ్వం' ట్రైలర్‌

Published Sun, Oct 6 2024 1:47 PM | Last Updated on Sun, Oct 6 2024 3:20 PM

Gopichand And Srinu Vaitla Viswam Movie Trailer Out Now

గోపీచంద్‌ హీరోగా రూపొందిన హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘విశ్వం’. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రం నుంచి భారీ యాక్షన్‌ ట్రైలర్‌ విడుదలైంది. గోపీచంద్‌ మార్క్‌ యాక్షన్‌ సీన్స్‌తో పాటు మంచి కామెడీ కూడా ట్రైలర్‌లో చూపించారు. ఇందులో  కావ్యా థాపర్‌ హీరోయిన్‌గా నటించారు. దోనేపూడి చక్రపాణి సమర్పణలో టీజీ విశ్వప్రసాద్, వేణు దోనేపూడి ఈ మూవీని  నిర్మించారు.  'హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన  ‘విశ్వం’ సినిమా దసరా కానుకగా అక్టోబర్‌ 11న విడుదల కానుంది.

ట్రైలర్‌తోనే సినిమాపై అంచనాలు పెంచేశారని చెప్పవచ్చు. శ్రీను వైట్ల మార్క్‌ హ్యుమర్‌కు గోపీచంద్‌ యాక్షన్, కామెడీతో ఈ సినిమా ఉండనుంది. గోపీచంద్‌ని ఒక విభిన్నమైన పాత్రలో  దర్శకుడు చూపించారు. ఈ చిత్రంలో ‘వెన్నెల’ కిశోర్‌ కీలక పాత్రలో నటించారు. ఆయన కామెడీ టైమింగ్‌ అదిరిపోయేలా ఉంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all

Video

View all
 
Advertisement