చాలా కాలంగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఏం ఇచ్చినా నేను మీ రుణం తీర్చుకోలేను. ఇప్పటి వరకు నన్ను ఆదరించినట్లే.. మంచి కంటెంట్ ఉన్న ‘మయోన్’చిత్రం ద్వారా పరిచయమవుతున్న నా కొడుకు శిభి సత్యరాజ్‌ను కూడా ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా’అని ప్రముఖ నటుడు ‘కట్టప్ప’ సత్యరాజ్ అన్నారు. ఆయన కొడుకు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన ప్రతిష్ఠాత్మక చిత్రం “మాయోన్” ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు.
‘మాయోన్’ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా వచ్చిన రైటర్ విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్, టీజర్ చాలా బాగున్నాయి. ‘మయోన్’ చిత్రం ద్వారా హీరోగా పరిచయ మవుతున్న సిబి చాలా చక్కగా నటించాడు. దర్శక, నిర్మాతలు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడినా ఇష్టపడి చేశారు.అందుకే సినిమా బాగా వచ్చింది. ఈ నెల 7న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం గొప్ప విజయం సాదించాలి’ అన్నారు.
‘మయోన్ వంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదములు’అని హీరో శిబి సత్యరాజ్ అన్నారు . ‘మా చిత్రం గురించి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ట్వీట్ చేయడం సంతోషంగా ఉంది. పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్ ‘మాయోన్’చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు కచ్చితంగా ఆదరిస్తారు అన్నారు నిర్మాత శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో నిర్మాత ప్రసన్న కుమార్, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, తిరుపతి రెడ్డి, హ్యుమన్ రైట్స్ సభ్యురాలు రేణుక తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment