![Megastar Chiranjeevi Interesting Comments About His Grand Father](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/chirnjeevi.jpg.webp?itok=9AMV4r6T)
మెగాస్టార్ చిరంజీవి ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు హాజరైన తన తాతయ్య గురించి మాట్లాడారు. మా కుటుంబంలో ఆయనకు ఓ ప్రత్యేకమైన అలవాటు ఉండేదని అన్నారు. ఆయన మంచి కళా పోషణ కలిగిన వ్యక్తి అని నవ్వుతూ మాట్లాడారు. బ్రహ్మనందం ఆయన కుమారుడు రాజా గౌతమ్ కీలక పాత్రల్లో నటించిన బ్రహ్మా ఆనందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తన కుటుంబం గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు మెగాస్టార్.
చిరంజీవి మాట్లాడుతూ..'మా తాతయ్య పేరు రాధాకృష్ణ నాయుడు. ఆయన స్వస్థలం నెల్లూరు అయితే మొగల్తూరు వచ్చి స్థిరపడ్డారు. అక్కడే స్టేట్ ఎక్సైడ్ ఇన్‌స్పెక్టర్‌గా రిటైరయ్యారు. నీకు ఎవరి బుద్ది అయినా రావొచ్చు కానీ.. ఆయన బుద్ధి మాత్రం రాకూడదనేవారు. ఎందుకంటే ఆయన మంచి రసికుడు. మా ఇంట్లో ఇద్దరు అమ్మమ్మలు ఉండేవారు. వాళ్లద్దరిపై అలిగితే మూడో ఆమె దగ్గరికి వెళ్లేవారు. నాకు తెలిసి ముగ్గురే.. అలా నాలుగు, ఐదు ఉన్నారేమో నాకు తెలియదు. నువ్వు సినిమా ఇండస్ట్రీకి వెళ్తున్నావ్ కదా జాగ్రత్త. అసలే అక్కడ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆయనను మాత్రం ఆదర్శంగా తీసుకొవద్దని చెప్పారు.' అని నవ్వుతూ సరదాగా అన్నారు మెగాస్టార్. ఇంకేముంది ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇదే ఈవెంట్‌లో బ్రహ్మానందం తన తల్లిదండ్రుల గురించి మాట్లాడారు.
బ్రహ్మనందం మాట్లాడుతూ..'మా అమ్మానాన్నల గురించి చెప్పడం అంటే దేవుడి గురించి చెప్పడమే. నా తల్లిదండ్రులు చాలా గొప్పవారు. ఒకవైపు పేదరికం.. మరోవైపు పెద్దరికంతో బతికారు. నా తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఎప్పుడు గర్వపడుతుంటా. మా నాన్న నాకు ఒక మాట చెబుతుండేవారు.. ఒక మనిషి 18 రోజులు భోజనం చేయకపోతే చనిపోతాడు. 17 రోజుల వరకు ఎవరి దగ్గర చేయి చాచి అడగొద్దు. 18వ రోజు తప్పనిసరి అయితేనే ఎవరినైనా సాయం అడుగు అనేవారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తా. నా జీవితంలో అప్పు అనే మాట తావులేదు' అని అన్నారు.
![మా తాతయ్యను ఆదర్శంగా తీసుకోవద్దని చెప్పారు: చిరంజీవి ఆ](https://www.sakshi.com/s3fs-public/inline-images/ma_10.jpg)
కాగా.. బ్రహ్మానందం తన కుమారుడు రాజా గౌతమ్‌తో కలిసి బ్రహ్మానందం కలిసి నటించిన చిత్రం ‘బ్రహ్మా ఆనందం’. ఈ సినిమా ట్రైలర్‌ను ఇటీవలే ప్రభాస్ విడుదల చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం వాలెంటైన్స్ డే కానుకగా థియేటర్లలో సందడి చేయనుంది. ఈ చిత్రాన్ని స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌లో రాహుల్ యాదవ్ నక్కా నిర్మించగా.. ఆర్వీఎస్ నిఖిల్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో బ్రహ్మానందం, ఆయన కుమారుడు తాత మనవళ్లుగా అభిమానులను అలరించనున్నారు. ఇందులో ప్రియ వడ్లమాని ఐశ్వర్య హోలక్కల్, వెన్నెల కిశోర్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి శాండిల్య సంగీతమందించారు.
Comments
Please login to add a commentAdd a comment