ఇటీవల ఓటీటీ ప్రభావం చాలా పెరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే అది నిర్మాతలకు ఓ వరంగా మారింది. నయనతార ప్రధాన పాత్రలో నటించిన ఓ2 చిత్రం, కమలహాసన్ కథానాయకుడుగా నటించిన విక్రమ్ చిత్రాలు ఇటీవల డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతూ విశేష ఆదరణ పొందుతున్నాయి. అదే బాటలో ఇప్పుడు వట్టం చిత్రం కూడా ఓటీటీ ఎంట్రీకి సిద్ధమవుతోంది.
నటుడు శిబిరాజ్ కథానాయకుడుగా నటించిన ఇందులో ఆండ్రియా, అతుల్యరవి నాయికలుగా నటించారు. శ్రీనివాసన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్ పతాకంపై ఎస్‌ఆర్ ప్రభు, ఎస్‌ఆర్ ప్రకాశ్‌బాబు నిర్మించారు.
దీని గురించి దర్శకుడు మాట్లాడుతూ వట్టం విభిన్న అంశాలతో కూడిన థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. 24 గంటలలో ముగ్గురు వ్యక్తులు ఎదుర్కొన్న సమస్యలు, వాటి వల్ల వారి జీవితాలు ఎలా మారాయి..? అనే అంశాలతో చిత్రాన్ని తెరకెక్కించినట్లు చెప్పారు.
అందరిని అలరించేలా తెరకెక్కించినట్లు తెలిపారు. నటుడు శిబిరాజ్ మాట్లాడుతూ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. వైవిధ్య భరిత కథా చిత్రాలు నిర్మించే డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థలో చిత్రం చేయడం ఆనందంగా ఉందన్నారు. ఒక సామాన్యుడి పాత్రలో నటించాలని చాలా కాలంగా అనుకుంటున్నానని, ఈ చిత్రంతో ఆ కల నెరవేరిందని తెలిపారు. చిత్రంలో నటి ఆండ్రియ, అతుల్య రవి పాత్రలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment