ఏదో ఏదో ఏదో వెతికే నయనం.. పాట విన్నారా? | Maayon: Yedo Yedo Lyrical Video Out Now | Sakshi
Sakshi News home page

Maayon: ఏదో ఏదో ఏదో వెతికే నయనం, చేతికి అందేదాకా.. సాంగ్‌ వచ్చేసింది

Published Thu, Jun 30 2022 5:50 PM | Last Updated on Thu, Jun 30 2022 5:50 PM

Maayon: Yedo Yedo Lyrical Video Out Now - Sakshi

“కట్టప్ప” సత్యరాజ్ కుమారుడు సిబిరాజ్ హీరోగా యువ దర్శకుడు కిషోర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం “మాయోన్”. ఈ చిత్ర హక్కులను మూవీమ్యాక్స్ అధినేత ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ సొంతం చేసుకున్నారు. “మాయోన్” చిత్రాన్ని తెలుగు రాష్ట్రాలలో జూలై 7న విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. గురువారం ఈ చిత్రం నుంచి 'ఏదో ఏదో ఏదో.. వెతికే నయనం.. చేతికి అందేదాకా ఆగదు పయనం" అను పాటను విడుదల చేశారు.

ఈ సందర్బంగా చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ.. 'నాకు మాస్ట్రో ఇళయరాజా పాటలంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఇసైజ్ఞాని ఇళయరాజా స్వరపరిచిన పాటలకు సంగీత ప్రియుల నుంచి మంచి స్పందన లభించింది. ఈ చిత్రం ద్వారా ఆయనను కలుసుకున్నందుకు సంతోషంగా ఉంది. అయన అభిమానినైన నేను అయన సంగీత సారధ్యంలో సత్య ప్రకాష్ ధర్మార్, శ్రీనిషా జయశీలన్ పాడిన "ఏదో ఏదో ఏదో వెతికే నయనం చేతికి అందేదాకా ఆగదు పయనం" పాటకు విడుదల చేయడం చాలా హ్యాపీగా ఉంది.

ఈ సినిమా పురాతన దేవాలయానికి సంబంధించిన ఒక రహస్య పరిశోధన నేపథ్యంలో హై టెక్నికల్‌ వాల్యూస్‌ తో రూపొందిన మిస్టరీ థ్రిల్లర్‌. ఈ చిత్రాన్ని నిర్మాత అరుణ్ మోజి మాణికం భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఆయనే ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడం విశేషం. కిషోర్ ఎన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హీరో సిబిరాజ్ ‘అర్జున్’ అనే ఆర్కియాలజిస్ట్‌గా నటిస్తుండగా, తాన్య రవిచంద్రన్ ఎపిగ్రాఫిస్ట్ పాత్రలో కనువిందు చేయనుంది' అన్నారు.

చదవండి: ఆ వార్తలను ఖండించిన సోనాలి బింద్రె, నాకావసరం లేదు..
మిస్‌ ఇండియా పోటీ నుంచి వైదొలిగిన శివానీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement