కశ్మీర్‌లో ఆ ఇద్దరు రొమాన్స్
యువ నటుడు సిబిరాజ్ వర్ధమాన నటి, కిడారి చిత్రం ఫేమ్ నిఖిలావిమల్‌తో చలో కశ్మీర్ అన్నా రు. కొత్తదనం కోసం తపించే యు వ నటుల్లో సిబిరాజ్ ఒకరు. అదే విధంగా నూతన దర్శకులను ప్రొత్సహించడానికి ముందుండే సిబిరాజ్ తాజాగా వినోద్ అనే మరో నవ దర్శకుడికి అవకాశం కల్పించారు. ఈయన దర్శకుడు విజెడ్.దురై శిష్యుడన్నది గమనార్హం. బాస్ మూవీస్ పతాకంపై విజయ్ కే.చల్లయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిబిరాజ్‌కు జంటగా నిఖిలావిమల్ నాయకిగా నటిస్తోంది.
ఈ జంట ప్రస్తుతం కశ్మీర్‌లో రొమాన్స్ చేస్తున్నారు. దర్శకుడు వినోద్ చిత్ర వివరాలను తెలుపుతూ ఇదొక థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతున్న చిత్రం అని చెప్పారు. ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేసే అంశాలతో కూడిన ఈ చిత్ర షూటింగ్‌ను ఇటీవలే కశ్మీర్‌లో ప్రారంభించామని తెలిపారు. కథ డిమాండ్ చేయడంతో కశ్మీర్‌లో షూటింగ్ చేయడానికి సిద్ధమైనట్లు వివరించారు. అక్కడ గుల్‌మార్గ్, పాల్‌గమ్ ప్రాంతాల్లో చిత్రంలోని కీలక సన్నివేశాలను 21 రోజుల పాటు చిత్రీకరించనున్నట్లు తెలిపారు.
కశ్మీర్‌లో పరదాలా కమ్ముకున్న మంచు కారణంగా ఆ ప్రాంత పాఠశాలకు సెలవులు ప్రకటించారన్నారు. అలాంటిది చిత్ర యూని ట్ సహకారంతో షూటింగ్ ప్రణాళిక ప్రకారం జరుగుతోందని చెప్పారు. కశ్మీర్ షెడ్యూల్ పూ ర్తి చేసుకుని తదుపరి పొల్లాచ్చిలో రెం డవ షెడ్యూల్‌ను నిర్వహించనున్నట్లు దర్శకుడు తెలిపారు.