షూటింగ్ మొదలైన రోజే వివాదం! | Pooja for Sibi Sathyaraj Walter Held | Sakshi
Sakshi News home page

షూటింగ్ మొదలైన రోజే వివాదం!

Published Sat, Jun 15 2019 11:38 AM | Last Updated on Sat, Jun 15 2019 11:38 AM

Pooja for Sibi Sathyaraj Walter Held - Sakshi

వాల్టర్‌ పేరు వినగానే నటుడు సత్యరాజ్‌ పవర్‌ఫుల్‌ పోలీస్‌ అధికారిగా నటించిన సూపర్‌హిట్‌ చిత్రం వాల్టర్‌ వెట్రివేల్‌ గుర్తుకు వస్తుంది. సత్యరాజ్‌ వారసుడు శిబిరాజ్‌ వాల్టర్‌లో హీరోగా నటిస్తున్నారు. 11–11 సినిమా సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా అన్బు అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నారు. కాగా నెంజముండు నేర్మైయుండు ఓడు రాజా చిత్రం ఫేమ్‌ నటి శిరిన్‌ కాంచ్వాలా సిబిరాజ్‌తో రొమాన్స్‌ చేయనున్నారు. మరో ముఖ్య పాత్రలో దర్శకుడు సముద్రకని నటిస్తున్నారు.

కుంభకోణం నేపథ్యంలో యాక్షన్, థ్రిల్లర్‌ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం శుక్రవారం చెన్నైలో ప్రారంభం అయింది. కాగా ఇదే రోజున ప్రముఖ ఫైనాన్సియర్, నిర్మాత శింగారవేలన్‌ వాల్టర్‌ పేరుతో విక్రమ్‌ప్రభు, అర్జున్‌లను నటింపజేస్తూ చిత్రాన్ని నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ చిత్రానికి అన్బరసన్‌ దర్శకత్వం వహించనున్నారని పేర్కొన్నారు. వాల్టర్‌ చిత్ర కథ, టైటిల్‌ తనకు చెందినవని, వాటిని తన అనుమతి లేకుండా వాడితే సంబంధిత దర్శక, నిర్మాతలపై చట్టప్రకారం చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. ఇలా వాల్టర్‌ చిత్రం ఆదిలోనే  వివాదాంశంగా మారడం ఇప్పుడు కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement