
సత్యరాజ్, వశిష్ఠ ఎన్. సింహ, సాంచీ రాయ్, ఉదయ భాను, ‘సత్యం’ రాజేశ్, క్రాంతి కిరణ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘త్రిబాణధారి బార్భరిక్’. మోహన్ శ్రీవత్స దర్శకత్వంలో దర్శకుడు మారుతి సమర్పణలో వానర సెల్యూలాయిడ్ బ్యానర్ పై విజయపాల్ రెడ్డి నిర్మించారు.
ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రోడక్షన్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ‘‘ఓ సరికొత్త పాయింట్‌తో ‘త్రిబాణధారి బార్భరిక్’ ప్రేక్షకులను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఇన్‌ఫ్యూజన్ బ్యాండ్.