ఆ ఒక్కడికే తెలుసు ! | Kattappa's Secret In Sathyaraj's Family | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కడికే తెలుసు !

Published Mon, Mar 14 2016 3:34 PM | Last Updated on Sun, Sep 3 2017 7:44 PM

ఆ ఒక్కడికే తెలుసు !

ఆ ఒక్కడికే తెలుసు !

2015 సంవత్సరంలో చోటుచేసుకున్న నేరాలకు సంబంధించి ఇప్పటివరకు ఏమాత్రం క్లూ దొరకని ఒకే ఒక్క కేసు.. అమరేంద్ర బాహుబలి హత్య! 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు?' ఈ ప్రశ్నకి సమాధానం కోసం ఎదురుచూడని సినీ అభిమాని ఉండడు. అసలు నిజం అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. వారిలో కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ ఒకరు. బాహుబలి రిలీజ్ అయినప్పటి నుంచి సత్యరాజ్ సుపుత్రుడు, తమిళ నటుడు శిబిరాజ్ ఈ ప్రశ్న అడుగుతూనే ఉన్నాడట.

సత్యరాజ్ కుటుంబసభ్యులు కూడా బాహుబలి హత్య వెనుక ఉన్న సీక్రెట్ కోసం శతవిధాలా ప్రయత్నించి విసుగుచెంది ఊరుకున్నారట. ఎవరెంత బతిమిలాడినా సత్యరాజ్ మాత్రం కథలోని సస్పెన్స్ ని బయటపెట్టలేదు. 'మా నాన్నకు పని పట్ల ఉన్న నిబద్ధత అటువంటిది' అంటూ తండ్రి గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు శిబిరాజ్. అయితే కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే విషయం సత్యరాజ్ కుటుంబంలో ఒకే ఒక్కరికి తెలుసట.. సత్యరాజ్ రెండున్నరేళ్ల మనవడికి!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement