Sathyaraj Sister Kalpana Mandradiar Died In Coimbatore, Check Her Death Reasons - Sakshi
Sakshi News home page

Sathyaraj: బాహుబలి నటుడు సత్యరాజ్‌ ఇంట విషాదం

Published Mon, Dec 6 2021 7:06 PM | Last Updated on Mon, Dec 6 2021 8:46 PM

Sathyaraj Sister Kalpana Mandradiar Passed Away In Coimbatore, Check Her Death Reasons - Sakshi

Bahubali Actor Sathyaraj Younger Sister Kalpana Passess Away Due To Ill Health: తెలుగు, తమిళ చిత్రాల్లో నటించిన ప్రముఖ నటుడు సత్యరాజ్‌ అంటే గుర్తుపడతారో లేదో కానీ బాహుబలి సినిమాలో కట్టప్ప అంటే మాత్రం అందరూ ఇట్టే గుర్తుపడతారు. తాజాగా ఈ నటుడి ఇంట్లో విషాదం నెలకొంది. సత్యరాజ్‌ చెల్లెలు కల్పన మండ్రాదియార్‌(66) శనివారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ​

తమిళనాడులోని తిరుప్పూర్‌ జిల్లా గాంగేయంలో నివసిస్తున్న కల్పన కొద్దివారాలుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమెను కుటుంబసభ్యులు కోయంబత్తూరులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శనివారం కన్నుమూశారు. దీంతో సత్యరాజ్‌ కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. సత్యరాజ్‌ సోదరి మృతి పట్ల  టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీతారలు సంతాపం తెలియజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement