పోకిరిరాజా టీజర్‌కు ప్రశంసలు
సాధారణంగా ఒక చిత్ర టీజర్ విడుదలైతే దాన్ని ఒకటి రెండు రోజుల్లోనే లక్షల్లో అభిమానులు తిలకిస్తున్న రోజులివి.అయితే సినీ దిగ్గజాల నుంచి యువ కళాకారుల వరకు ముక్త కంఠంతో ఎలాంటి భేషజాలు లేకుండా ప్రశంసించడం అన్నది పోకిరిరాజా చిత్ర టీజర్‌కు దక్కింది. యువ నటుడు జీవా కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం పోకిరిరాజా. హీరోగా ఇది ఆయనకు 25వ చిత్రం అన్నది గమనార్హం. అందాల భామ హన్సిక హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో సిబిరాజ్ మరో హీరోగా నటిస్తున్నారు.
పులి చిత్ర నిర్మాతలలో ఒకరైన పీటీ.సెల్వకుమార్ సమర్పణలో పీటీఎస్.ఫిలిం ఇంటర్నేషనల్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమిళుక్కు ఎన్ 1ఐ అళుత్తవుమ్ చిత్రం ఫేమ్ రామ్ ప్రకాశ్ రాయప్ప దర్శకత్వం వహిస్తున్నారు. పోకిరిరాజా చిత్ర టీజర్ ఫిబ్రవరి1న విడుదలైంది. ఈ టీజర్‌ను చూసిన ప్రముఖ దర్శకుడు కేఎస్.రవికుమార్, ఎస్‌ఏ.చంద్రశేఖర్,విక్రమ్‌ప్రభు, కేవీ.ఆనంద్ నటి కుష్భూ, బద్రి, మైఖెల్‌రాయప్పన్, విజయ్‌సేతుపతి, అట్లీ, శక్తి సౌందర్‌రాజన్, ఎల్‌రెడ్.కుమార్, మాధవన్, జయంరవి, సిద్ధార్థ్, కాజల్‌అగర్వాల్, దినేశ్, నకుల్, ఆర్‌జే.బాలాజీ,లక్ష్మీమీనన్ తదితర 25 మంది సినీ ప్రముఖులు చాలా బాగుందంటూ ప్రశంసల వర్షం కురిపించారని చిత్ర యూనిట్ వర్గాలు వెల్లడించారు.
ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని14న కోయంబత్తూర్‌లో ఘనంగా నిర్వహించనున్నట్లు చిత్ర విడుదల హక్కుల్ని పొందిన కాస్మో విలేజ్ శివ తెలిపారు.చిత్రాన్ని ఈ నెల 26న విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.