సల్మాన్ ఖాన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, ముంబై : బాలీవుడ్ కండలవీరుడు, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సల్మాన్ ఖాన్ మరోసారి వార్తల్లోకి వచ్చారు. రొమేనియా మోడల్ లులియా వాంటూర్‌తో సల్మాన్ పెళ్లి వార్తల హంగామా ఇంకా చల్లారకముందే ఓ యువతి చేసిన హడావుడి తాజాగా వెలుగు చూసింది. తమ అభిమాన హీరోను చూడాలని, ఫోటో దిగాలని ఫ్యాన్స్ అందరూ ఆరాటపడతారు. కానీ, ఈ అభిమాని ఏకంగా సల్మాన్ తన జీవిత భాగస్వామినంటూ గలాటా సృష్టించిందని ‘సియాసత్ డైలీ’ రిపోర్ట్ చేసింది.
వివరాల్లోకి వెళితే.. సెక్యూరిటీ కళ్లుగప్పి సల్మాన్ ఇంటి టెర్రస్‌పైకి వెళ్లిన ఓ యువతి ‘సల్మాన్ నా భర్త’ అంటూ నినాదాలు చేసింది. అక్కడితో ఆగకుండా.. ఎవరైనా తనను కిందకు దించాలని ప్రయత్నిస్తే ఆత్మహత్య చేసుకొని చనిపోతానని బెదిరించిందని ప్రత్యక్ష సాక్షుల కథనం. అయితే, హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది ఆమెను కిందికి దించి, చేతిలో ఉన్న ఇనుపచువ్వను స్వాధీనం చేసుకున్నారు. ఇంత జరిగినా అక్కడికి పోలీసులు రాలేదట. కాగా ప్రస్తుతం సల్మాన్ రేస్-3 మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment