ముంబై: తన తండ్రి హత్య తర్వాత బాలీవుడ్ నటుడు, సిద్ధిఖీ కుటుంబానికి సన్నితుడైన సల్మాన్ ఖాన్ ప్రతిరోజూ నాకు ఫోన్ చేసి.. యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారని బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీ తెలిపారు. అక్టోబర్ 12న బాబా సిద్ధిఖీని కొందరు దుండగులు కాల్పులు జరిపి హత్య చేశారు. అయితే హత్యకు లారెన్స్ బిష్ణోయ్ బాధ్యత వహించిన విషయం తెలిసిందే. సల్మాన్ ఖాన్‌తో సన్నిహితంగా ఉండటం వల్లే బాబా సిద్ధిఖీని టార్గెట్ చేశామని తెలిపారు. అయితే ఇటీవల జీషన్ సిద్ధిఖీ ఓ ఇంటర్వ్యులో తన తండ్రి మరణం తర్వాత సల్మాన్ ఖాన్ ఎలా మద్దుతుగా నిలిచారో పలు విషయాలు పంచుకున్నారు.
‘‘నాన్న హత్య తర్వాత సల్మాన్ ఖాన్ ప్రతీరోజు రాత్రి క్రమం తప్పకుండా నా రాత్రి నాకు కాల్ చేసి బాగోగులు తెలుసుకుంటున్నారు. సల్మాన్ భాయ్.. మా నాన్న హత్య విషయంలో చాలా బాధపడ్డారు. మా నాన్న, సల్మాన్ భాయ్ నిజమైన అన్నదమ్ముల్లా చాలా సన్నిహితంగా ఉండేవారు. నాన్న చనిపోయిన తర్వాత సల్మాన్ భాయ్.. నేను రాత్రి సమయంలో ఎలా ఉన్నాను. నిద్ర పోతున్నానా లేదా అని ఫోన్ చేసి కనుక్కుంటున్నారు. రాత్రి నేను నిద్ర పోకపోతే.. నాతో ఫోన్‌లో మాట్లాడుతున్నారు. మా కుటుంబానికి ఆయన ఎంతో సపోర్ట్‌గా నిలిచారు’’ అని జీషన్ తెలిపారు.
మరోవైపు.. జీషన్ సిద్ధిఖీ గత వారం మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గంలో చేరారు. అంతేకాక.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వాండ్రే ఈస్ట్ నియోజకవర్గం నుంచి అభ్యర్థిగా కూడా బరిలోకి దిగుతున్నారు. మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ చేశారనే ఆరోపణలతో ఆగస్టులో ఆయన్ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. అయితే తనపై వచ్చిన ఈ అభియోగాలను జీషన్ తోసిపుచ్చారు.
చదవండి: బాబా సిద్ధిఖీ కుమారుడు జీషన్ సిద్ధిఖీపై ట్రోలింగ్ షురూ!
Comments
Please login to add a commentAdd a comment