
ఈ శుక్రవారం డిటెక్టివ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న విశాల్, ఆ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన సెన్సార్ సర్టిఫికేషన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమా సెన్సార్ ను ముంబైకి మార్చేయటంతో సెన్సార్ సర్టిఫికేట్ సాధించటం డిగ్రీ సర్టిఫికేట్ సాధించడమంత కష్టంగా మారిందన్నారు. అదే సమయంలో తమిళ్ తెలుగు భాషల్లో తమ సినిమాను ఒకేసారి రిలీజ్‌చేయలేకపోవటానికి కారణాలు కూడా తెలిపారు. తమిళ్ లో తమ సినిమా రిలీజ్ అయ్యే సమయంలో తెలుగులో పెద్ద హీరోల సినిమాలు బరిలో ఉంటున్నాయని అందుకే ఒకేసారి రెండు భాషల్లో రిలీజ్ చేయటం కుదరటం లేదని తెలిపారు.
సెన్సార్ అయిన సినిమా విషయంలో కొంత మంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం పై కూడా విశాల్ స్పందించారు. సినిమాకు సెన్సార్ సెంట్రల్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిన తరువాత కొంత మంది సినిమాలోని డైలాగ్స్‌ను కట్ చేయమనటం అన్యాయం అన్నారు. అలా కట్ చేసుకుంటూ వెళితే సెన్సార్ సర‍్టిఫికేట్ తప్ప చూపించడానికి ఏమి మిగలదని ఆవేదన వ్యక్తం చేశారు. జి హరి దర్శకత్వంలో తెరకెక్కిన డిటెక్టివ్ సినిమాలో ఆండ్రియా హీరోయిన్ గా నటించింది. తమిళ నటుడు ప్రసన్న మరో కీలక పాత్రలో నటించారు. ఈ సినిమాకు సీక్వల్ తెరకెక్కించే ఆలోచన ఉన్నట్టుగా వెల్లడించారు విశాల్.
Comments
Please login to add a commentAdd a comment