తమిళ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ చిత్రంలో ఎస్‌జే సూర్య విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో విశాల్, సూర్య.. ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న విశాల్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరో ఆయనకు సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు.
(ఇది చదవండి: ఓటీటీలో సినిమాల సందడి.. భోళాశంకర్, రామబాణం కూడా!)
విశాల్ హీరోగా నటించిన చిత్రం ‘తుప్పరివాలన్’. 2017లో వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని డిటెక్టివ్ పేరుతో రిలీజ్ చేశారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ డైరెక్టర్‌పై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ప్రవర్తన మూలంగా తాను ఎంతో ఇబ్బందిపడినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఆయనతో మరోసారి పనిచేసే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. మిస్కిన్ పెట్టిన బాధకు నేను కాకుండా.. వేరే వాళ్లు అయితే ఇప్పటికే చనిపోయేవారంటూ విశాల్ తీవ్ర ఆరోపణలు చేశారు.
విశాల్ మాట్లాడుతూ..' మిస్కిన్‌తో మరోసారి సినిమా చేయడం జరగని పని. తుప్పరివాలన్ -2 విషయంలో నన్ను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. లండన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఒంటరిగా కూర్చుని బాధపడ్డా. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. నా ప్లేస్‌లో ఇంకెవరైనా ఉండుంటే కచ్చితంగా గుండెపోటుతో చనిపోయేవారు. నేను కాబట్టి ఆ నష్టాన్ని తట్టుకున్నా. ఒకవేళ మిస్కిన్‌తో ‘తుప్పరివాలన్ 2’ షూట్ చేసినా అది పూర్తి కాదని తెలుసు. అందుకే ఆ మూవీని ఆపేశా. వచ్చే ఏడాదిలో స్వయంగా నేనే తెరకెక్కించాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్ నాకు బిడ్డ లాంటిది.' అంటూ ఫైరయ్యారు.
(ఇది చదవండి: 14 ఏళ్లకే పెళ్లి.. ఆపై వేధింపులు.. అర్ధాంతరంగా ముగిసిన నటి జీవితం!)
2017లో తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో రిలీజైన ఈ చిత్రం కోలీవుడ్, టాలీవుడ్‌లో హిట్ టాక్‌ను అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్గా ‘తుప్పరివాలన్ 2’ తెరకెక్కించాలనుకున్నారు. కానీ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి వివాదాలు తలెత్తాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం విశాల్ స్వయంగానే ‘తుప్పరివాలన్ 2’ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment