Miskin directed
-
ఆ దెబ్బ ఇప్పటికీ మరిచిపోలేను.. డైరెక్టర్‌పై విశాల్ షాకింగ్ కామెంట్స్!
తమిళ స్టార్ హీరో విశాల్ తాజాగా నటించిన చిత్రం మార్క్ ఆంటోనీ. ఈ చిత్రంలో ఎస్జే సూర్య విలన్‌గా నటించారు. ఈ చిత్రంలో విశాల్, సూర్య.. ద్విపాత్రాభినయం చేయడం మరో విశేషం. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఎస్.వినోద్ కుమార్ నిర్మించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. సెప్టెంబర్ 15న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానుంది. ప్రస్తుతం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న విశాల్ పలు ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఓ ఇంటర్వ్యూకు హాజరైన హీరో ఆయనకు సూపర్ హిట్ అందించిన డైరెక్టర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. (ఇది చదవండి: ఓటీటీలో సినిమాల సందడి.. భోళాశంకర్, రామబాణం కూడా!) విశాల్ హీరోగా నటించిన చిత్రం ‘తుప్పరివాలన్’. 2017లో వచ్చిన ఈ చిత్రాన్ని దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించారు. తెలుగులోనూ ఈ చిత్రాన్ని డిటెక్టివ్ పేరుతో రిలీజ్ చేశారు. అయితే తాజా ఇంటర్వ్యూలో ఈ మూవీ డైరెక్టర్‌పై విశాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అతని ప్రవర్తన మూలంగా తాను ఎంతో ఇబ్బందిపడినట్లు వెల్లడించారు. భవిష్యత్తులో ఆయనతో మరోసారి పనిచేసే ఉద్దేశం లేదని తేల్చిచెప్పారు. మిస్కిన్ పెట్టిన బాధకు నేను కాకుండా.. వేరే వాళ్లు అయితే ఇప్పటికే చనిపోయేవారంటూ విశాల్ తీవ్ర ఆరోపణలు చేశారు. విశాల్ మాట్లాడుతూ..' మిస్కిన్‌తో మరోసారి సినిమా చేయడం జరగని పని. తుప్పరివాలన్ -2 విషయంలో నన్ను చాలా ఇబ్బందులకు గురిచేశాడు. లండన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఒంటరిగా కూర్చుని బాధపడ్డా. ఆ క్షణాలను ఎప్పటికీ మర్చిపోలేను. నా ప్లేస్‌లో ఇంకెవరైనా ఉండుంటే కచ్చితంగా గుండెపోటుతో చనిపోయేవారు. నేను కాబట్టి ఆ నష్టాన్ని తట్టుకున్నా. ఒకవేళ మిస్కిన్‌తో ‘తుప్పరివాలన్ 2’ షూట్ చేసినా అది పూర్తి కాదని తెలుసు. అందుకే ఆ మూవీని ఆపేశా. వచ్చే ఏడాదిలో స్వయంగా నేనే తెరకెక్కించాలనుకుంటున్నా. ఆ ప్రాజెక్ట్ నాకు బిడ్డ లాంటిది.' అంటూ ఫైరయ్యారు. (ఇది చదవండి: 14 ఏళ్లకే పెళ్లి.. ఆపై వేధింపులు.. అర్ధాంతరంగా ముగిసిన నటి జీవితం!) 2017లో తెలుగులో ‘డిటెక్టివ్’ పేరుతో రిలీజైన ఈ చిత్రం కోలీవుడ్, టాలీవుడ్లో హిట్ టాక్‌ను అందుకుంది. ఈ చిత్రానికి సీక్వెల్‌గా ‘తుప్పరివాలన్ 2’ తెరకెక్కించాలనుకున్నారు. కానీ చిత్రీకరణ సమయంలో వీరిద్దరి వివాదాలు తలెత్తాయి. దీంతో ఆ ప్రాజెక్ట్ అర్ధాంతరంగా ఆగిపోయింది. ప్రస్తుతం విశాల్ స్వయంగానే ‘తుప్పరివాలన్ 2’ తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. -
దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది: పూజా హెగ్డే
దాదాపు ఎనిమిదేళ్లు అవుతోంది హీరోయిన్ పూజా హెగ్డే తమిళ సినిమా చేసి. మిస్కిన్ దర్శకత్వంలో జీవా హీరోగా నటించిన తమిళ చిత్రం ‘ముగముడి’ (2018) (తెలుగులో ‘మాస్క్’గా అనువాదమైంది) తర్వాత పూజా మరో తమిళ సినిమాలో నటించలేదు. ఇప్పుడు ఓ సినిమాకి సైన్ చేశారు. నెల్సన్ కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించనున్న సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించనున్నారు. ‘స్వాగతం పూజా’ అంటూ బుధవారం ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మార్చి రెండో వారంలో పూజా ఈ సినిమా చిత్రీకరణలో పాల్గొననున్నారు. ఇక పూజా హెగ్డే తెలుగులో నటించిన ప్రభాస్ ‘రాధేశ్యామ్’, అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. హిందీలో రణ్‌వీర్‌సింగ్ ‘సర్కస్’, సల్మాన్ ఖాన్ ‘కబీ ఈద్ కబీ దీవాళి’ సినిమాల్లో పూజ నటిస్తోంది. ఇలా ఉత్తర, దక్షిణ సినీ పరిశ్రమలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్ గ్రాఫ్‌ను పెంచేసుకుంటున్నారు పూజా హెగ్డే. -
పిశాచిగా మారతారా?
తమిళ హీరోయిన్ ఆండ్రియా త్వరలోనే పిశాచిగా మారనున్నారట. దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన సూపర్ హిట్ తమిళ చిత్రం ‘పిశాచి’. ఈ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ సిద్ధం చేస్తున్నారట ఆయన. ఇందులో లీడ్ రోల్లో ఆండ్రియా నటించనున్నారని సమాచారం. ఆమెది పిశాచి పాత్ర అని కోలీవుడ్ టాక్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే.. విజయ్ నటించిన ‘మాస్టర్’లో ఓ కీలక పాత్ర చేశారు ఆండ్రియా. సూర్య హీరోగా ఆరంభం కానున్న ఓ చిత్రంలో హీరోయిన్గా నటిస్తారామె. -
జోడీ కుదిరింది
శింబు, శ్రుతీహాసన్ జంటగా ఓ సినిమాలో నటించబోతున్నారా? అంటే, అవుననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం రవితేజ సరసన ‘క్రాక్’, పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలు చేస్తున్నారు శ్రుతీహాసన్. తమిళంలో ‘లాభం’ అనే సినిమా చేస్తున్నారు. తాజాగా శింబు సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ప్రస్తుతం శింబు ‘మహా’, ‘మానాడు’ అనే రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ రెండు చిత్రాల తర్వాత మిస్కిన్ దర్శకత్వంలో ఆయన ఓ సినిమా చేయనున్నారని. ఇందులోనే శింబు సరసన శ్రుతీహాసన్ కథానాయికగా నటించనున్నారట. కరోనా కారణంగా షూటింగ్స్ పెద్దగా జరగడంలేదు. పరిస్థితులు అనుకూలంగా మారాక ఈ చిత్రం షూటింగ్‌ని ఆరంభించాలనుకుంటున్నారని సమాచారం. -
త్రిపాత్రాభినయం చేయబోతున్నా
హీరో విశాల్– దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్లో ‘తుప్పారివాలన్’ (తెలుగులో డిటెక్టివ్) అనే చిత్రం వచ్చింది. మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కుతుంది. మిస్కి దర్శకత్వంలోనే విశాల్ హీరోగా నటిస్తూ, ఈ సీక్వెల్‌ను నిర్మిస్తున్నారు. బడ్జెట్ సమస్యల కారణంగా సినిమా నుంచి తప్పుకున్నారు దర్శకుడు మిస్కిన్. దాంతో దర్శకత్వ బాధ్యతలను చేపట్టారు విశాల్. ‘‘దర్శకత్వం చేయాలనే ఆలోచన నాకు ఎప్పుట్నుంచో ఉంది. కానీ ఇలా వస్తుందని ఊహించలేదు. ఇది మారువేషంలో వచ్చిన అదృష్టంలా భావిస్తున్నాను. సినిమా మేకింగ్‌లో అన్ని బాధ్యతలు దర్శకుడి మీదే ఉంటాయి. డైరెక్షన్ చేయడానికి ఎగ్జయిటింగ్‌గా ఉన్నాను. ఈ సినిమాకు త్రిపాత్రాభినయం (నటన–నిర్మాణం– దర్శకత్వం) చేయబోతున్నాను’’ అన్నారు విశాల్. -
నాలుగేళ్లకు మళ్లీ!
నాలుగేళ్లు కావొస్తోంది నటి గౌతమి తమిళ స్క్రీన్‌పై కనిపించి. 2015లో వచ్చిన ‘పాపనాశం’ సినిమాలో చివరిసారి కనిపించారు గౌతమి. ఈ మధ్యకాలంలో తెలుగులో ‘మనమంతా’, మలయాళంలో ‘ఈ’ అనే సినిమాల్లో కనిపించారామె. నాలుగేళ్ల బ్రేక్ తర్వాత తమిళంలో ఓ సినిమా అంగీరించారట గౌతమి. హీరో విశాల్, దర్శకుడు మిస్కిన్ కాంబినేషన్లో ‘తుప్పరివాలన్ 2’ చిత్రం తెరకెక్కుతోంది. ‘తుప్పరివాలన్’ చిత్రానికి ఇది సీక్వెల్. ఆశ్య కథానాయిక. ఈ సినిమాలో గౌతమి కీలక పాత్రలో నటించనున్నారట. త్వరలోనే ఈ చిత్రం షూటింగ్లో జాయిన్ అవుతారు గౌతమి. ‘తు ప్పరివాలన్’ ఫస్ట్ పార్ట్‌లో సిమ్రాన్ అతిథి పాత్రలో కనిపించారు. బహుశా ఇప్పుడు గౌతమి అతిథి అయ్యుండొచ్చు. -
డిటెక్టివ్ రిటర్న్స్
విశాల్ మళ్లీ డిటెక్టివ్ అయ్యారు. 2017లో ఓసారి ‘డిటెక్టివ్’గా మనకు కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘డిటెక్టివ్’ సినిమా సీక్వెల్ చేస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్ దర్శకత్వంలోనే మలి భాగం కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ లండన్‌లోని బ్రిస్టల్‌లో ప్రారంభమైంది. అక్కడ దాదాపు 40 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ఈ సినిమాతో ఆశ్య హీరోయిన్గా పరిచయం కాబోతున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. విశాల్ ‘యాక్షన్’ సుందర్. సి దర్శకత్వంలో విశాల్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్’. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించారు. ‘యాక్షన్’ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. -
యస్ 25
ఇండియన్ స్క్రీన్‌పై టెక్నాల జీని, భారీ హంగును చూపించిన దర్శకుడు శంకర్. భారీ ఖర్చుతో భారీ చిత్రాలను తెరకెక్కిస్తాడని పేరు. ఆయన ఇండస్ట్రీలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దర్శకుడు మిస్కిన్ సర్ప్రైజ్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో కోలీవుడ్ దర్శకులు మణిరత్నం, కరుణాకరన్, గౌతమ్ మీనన్, లింగుస్వామి, బాలాజీ శక్తివేల్, పాండీరాజ్, అట్లీ, వసంత్ బాలన్, పా. రంజిత్ పాల్గొన్నారు. అందరూ ‘యస్ 25’ అనే లోగో ముద్రించి ఉన్న బ్లూ కలర్ టీ షర్ట్స్‌ను ధరించారు. స్పెషల్‌గా డిజైన్ చేయించిన కేక్‌ను శంకర్ కట్ చేశారు. ∙మణిరత్నం, మిస్కిన్, శంకర్ -
బాలీవుడ్ బ్యూటీకి మరో ఛాన్స్
విశాల్ హీరోగా మిస్కిన్ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘తుప్పరివాళన్’ (తెలుగులో డిటెక్టివ్) ఎంత హిట్ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా తర్వాత డైరెక్షన్‌కి కొంచెం గ్యాప్ ఇచ్చి, నటుడిగా బిజీ అయ్యారు మిస్కిన్. ఇప్పుడు మళ్లీ ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ చిత్ర కథానాయిక కోసం పలువుర్ని సంప్రదించిన చిత్రబృందం ఫైనల్‌గా తెలుగు మూలాలున్న బాలీవుడ్ బ్యూటీ అదితీరావ్ హైదరీని ఓకే చేశారట. ఈ మధ్య విడుదలైన ‘సమ్మోహనం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచారు అదితి. మిస్కిన్ చెప్పిన కథ బాగుండటం, పాత్ర నచ్చడంతో నటించేందుకు వెంటనే పచ్చజెండా ఊపేశారట ఈ బ్యూటీ. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా పూర్తి చేశారట అదితి. కాట్రు వెలియిడై, చెక్క చివంద వానమ్ తర్వాత కోలీవుడ్ నుంచి వచ్చిన మరో ఆఫర్ ఇది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్. -
ఈ సినిమాలో మంచి దెయ్యం ఉంది!
- పూరి జగన్నాథ్ ‘‘మామూలుగా నేను దెయ్యం సినిమాలు చూడను. కానీ, ఈ చిత్రంలో మంచి దెయ్యం ఉందంటున్నారు. అందుకని చూడాలనుకుంటున్నా’’ అని దర్శకుడు పూరి జగన్నాథ్ చెప్పారు. మిస్కిన్ దర్శకత్వంలో దర్శకుడు బాల నిర్మించిన తమిళ చిత్రం ‘పిశాచి’ అదే పేరుతో తెలుగు తెరకు రానుంది. బాల సమర్పణలో ఈ చిత్రాన్ని సి. కల్యాణ్, కల్పన విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ప్రచార చిత్రాలను దర్శకుడు పూరి జగన్నాథ్, నిర్మాత కాట్రగడ్డ ప్రసాద్ ఆవిష్కరించారు. ఈ వేడుకలో నిర్మాతలు కేయస్ రామారావు, అశోక్‌కుమార్, సీవీ రావు, ఎగ్జిబిటర్ అలంకార్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సి. కల్యాణ్ మాట్లాడుతూ -‘‘ఓ అందమైన దెయ్యం కథ ఇది. నిర్మాత శింగనమల రమేశ్ కుమారుడు హీరోగా నటించాడు. తమిళ ‘పిశాచి’ విడుదలైన రోజునే ఆమిర్‌ఖాన్ హిందీ చిత్రం ‘పీకే’ విడుదలైంది. హిందీ చిత్రం మీద అంచనాలతో మల్టీప్లెక్స్‌లో రోజుకి ఒక్క షో మాత్రమే ‘పిశాచి’కి ఇచ్చారు. మొదటి రోజే సినిమా బాగుందనే టాక్ రావడంతో వారం తిరిగేసరికి ఏడెనిమిది షోస్‌కి పెరిగింది. అది ఈ సినిమా స్థాయి. ఈ నెల 27న తెలుగు ప్రేక్షకుల ముందుకు ‘పిశాచి’ వస్తుంది’’ అన్నారు.