డిటెక్టివ్‌ రిటర్న్స్‌ | Vishal Bets Big On Detective 2 | Sakshi
Sakshi News home page

డిటెక్టివ్‌ రిటర్న్స్‌

Published Wed, Nov 6 2019 1:24 AM | Last Updated on Wed, Nov 6 2019 1:24 AM

Vishal Bets Big On Detective 2 - Sakshi

విశాల్‌ మళ్లీ డిటెక్టివ్‌ అయ్యారు. 2017లో ఓసారి ‘డిటెక్టివ్‌’గా మనకు కనిపించిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ‘డిటెక్టివ్‌’ సినిమా సీక్వెల్‌ చేస్తున్నారు. తొలి భాగానికి దర్శకత్వం వహించిన మిస్కిన్‌ దర్శకత్వంలోనే మలి భాగం కూడా తెరకెక్కుతోంది. ఈ సినిమా చిత్రీకరణ లండన్‌లోని బ్రిస్టల్‌లో ప్రారంభమైంది. అక్కడ దాదాపు 40 రోజుల పాటు ఈ సినిమా చిత్రీకరణ జరుగుతుందని తెలిసింది. ఈ సినిమాతో ఆశ్య హీరోయిన్‌గా పరిచయం కాబోతున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

విశాల్‌ ‘యాక్షన్‌’
సుందర్‌. సి దర్శకత్వంలో విశాల్‌ హీరోగా నటించిన తాజా చిత్రం ‘యాక్షన్‌’. ఈ చిత్రంలో తమన్నా కథానాయికగా నటించారు. ‘యాక్షన్‌’ చిత్రాన్ని ఈ నెల 15న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement