బాలీవుడ్‌ బ్యూటీకి మరో ఛాన్స్‌ | Aditi Rao Hydari roped in for Mysskin's next with Udhayanidhi Stalin | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ బ్యూటీకి మరో ఛాన్స్‌

Published Mon, Aug 27 2018 5:48 AM | Last Updated on Mon, Aug 27 2018 9:17 AM

Aditi Rao Hydari roped in for Mysskin's next with Udhayanidhi Stalin - Sakshi

అదితీరావ్‌ హైదరీ

విశాల్‌ హీరోగా మిస్కిన్‌ దర్శకత్వంలో గత ఏడాది వచ్చిన ‘తుప్పరివాళన్‌’ (తెలుగులో డిటెక్టివ్‌) ఎంత హిట్‌ అయిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆ సినిమా తర్వాత డైరెక్షన్‌కి కొంచెం గ్యాప్‌ ఇచ్చి, నటుడిగా బిజీ అయ్యారు మిస్కిన్‌. ఇప్పుడు మళ్లీ ఉదయనిధి స్టాలిన్‌ హీరోగా ఓ సినిమాకి దర్శకత్వం వహించనున్నారు. రెడ్‌ జెయింట్‌ మూవీస్‌ పతాకంపై ఈ సినిమా తెరకెక్కనుంది.

ఈ చిత్ర కథానాయిక కోసం పలువుర్ని సంప్రదించిన చిత్రబృందం ఫైనల్‌గా తెలుగు మూలాలున్న బాలీవుడ్‌ బ్యూటీ అదితీరావ్‌ హైదరీని ఓకే చేశారట. ఈ మధ్య విడుదలైన ‘సమ్మోహనం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని సమ్మోహన పరిచారు అదితి. మిస్కిన్‌ చెప్పిన కథ బాగుండటం, పాత్ర నచ్చడంతో నటించేందుకు వెంటనే పచ్చజెండా ఊపేశారట ఈ బ్యూటీ. ఇందుకు సంబంధించి అగ్రిమెంట్‌పై సంతకాలు కూడా పూర్తి చేశారట అదితి. కాట్రు వెలియిడై, చెక్క చివంద వానమ్‌ తర్వాత కోలీవుడ్‌ నుంచి వచ్చిన మరో ఆఫర్‌ ఇది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement