అదితీరావ్ హైదరీ
ఈ రోజు ఓ ముగ్గరి కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది. అందులో ఒకరు ‘సైకో’. మరి ఆ సైకో పర్సన్ నుంచి మిగతా వారు ఎలా తప్పించుకున్నారు అనేది తెలియాలంటే బోలెడంత టైమ్ ఉంది. ‘డిటñ క్టివ్’ ఫేమ్ మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సైకో’. ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీరావ్ హైదరీ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.
పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ‘‘తమిళంలో ‘సైకో’ చిత్రంలో నటిస్తున్నాను అని చెప్పడానికి ఆనందంగా ఉంది. మంచి టీమ్ కుదిరింది’’ అని పేర్కొన్నారు అదితి. ‘‘సైకో’ టైటిల్ లోగో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శుక్రవారం నుంచి షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు ఉదయ్. ఇందులో సైకో ఎవరంటే అదితీరావ్ అని కోలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో అదితీ రావ్ చేస్తోన్న ‘అంతరిక్షం 9000 కీమీ’ డిసెంబర్ 21 రిలీజ్ కానుంది.
Comments
Please login to add a commentAdd a comment