![Director Mysskin Emotional Speech At Psycho Movie Success Meet - Sakshi](/styles/webp/s3/article_images/2020/02/2/ilayaraja.jpg.webp?itok=esVLYecA)
తన చిత్రాలు కత్తిపై నడకలానే ఉంటాయి అని దర్శకుడు మిష్కిన్ పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇతర దర్శకులు చిత్రాలకు భిన్నంగానే ఈయన చిత్రాలు ఉంటాయి. అంతేకాదు మిష్కన్ మాటలు, చేతలు అలానే ఉంటాయి. తొలి నుంచి తనదైన శైలితోనే చిత్రాలు తెరకెకిక్కస్తున్న ఈయన ఆ మధ్య పిశాచు, తుప్పరివాలన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటి నిత్యామీనన్, అదితిరావ్ నాయికలుగా తెరకెక్కించిన చిత్రం సైకో. ఈ చిత్రం ప్రారంభం నుంచి విడుదలకు ముందు, ఆ తరువాత కూడా సంచలనంగా మారింది. సైకో చిత్రం గత నెల 24న తెరపైకి వచ్చింది. అయితే చిత్రానికి మాత్రం మిశ్రమ స్పందననే వస్తోంది.
ఉదయనిది స్టాలిన్‌తో మిష్కిన్
కానీ టాక్‌కు సంబంధం లేకుండా థియేటర్లలో రెండో వారంలోకి చేరుకుంది. సాధారణంగా ఒక వారం పూర్తిగా చిత్రం థియేటర్లలో ఉంటేనే సక్సెస్ అనుకుంటున్న రోజులివి. కాబట్టి సైకో చిత్ర యూనిట్ సక్సెస్ సంతోషంలో ఉన్నారు. ఈ ఆనందాన్ని శుక్రవారం మీడియాతో పంచుకున్నారు కూడా. స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో సైకో చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ సంగీతదర్శకుడు ఇళయరాజా తనకు తల్లిదండ్రులు మాదిరని అన్నారు. ఆయన అందించిన సంగీతం, పాటలు సైకో చిత్ర విజయానికి కారణంగా పేర్కొన్నారు. అందుకే ఈ చిత్ర విజయాన్ని ఆయనకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇకపోతే సైకో చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత నటుడు ఉదయనిదిస్టాలిన్‌ను తన తల్లి కడుపున పుట్టిన తన తమ్ముడుగా భావిస్తున్నానని చెప్పారు. నిజం చెప్పాలంటే తాను ఆయన చిత్రాలేవీ చూడలేదన్నారు. సైకో 2 చిత్రం చేస్తారా? అని అడుగుతున్నారని, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఉదయనిధిస్టాలిన్ తనతో చిత్రం చేయమని కోరితే చేయడానికి సిద్ధం అని అన్నారు. ఇకపోతే సైకో చిత్రం గురించి రకరకాల విమర్శలు వస్తున్నాయని, అయితే ఇది చెడ్డ చిత్రం కాదని అన్నారు. తన చిత్రాలన్నీ కత్తిపై నడిచినట్లే ఉంటాయన్నారు.
చదవండి:
అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి
‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం!’
Comments
Please login to add a commentAdd a comment