Psycho
-
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
చాలామంది కార్లను భలే మెయింటెయిన్ చేస్తారు. కొందరు లగ్జరీ కార్లను ఎంచుకుంటే..మరికొందరూ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న కార్లను ఇష్టపడతారు. అయితే కొంతమంది పెద్ద సౌండ్లు వచ్చే కార్లను ఇష్టపడతారు. వాళ్లకు తమ ఇంజిన్ల నుంచి వచ్చే సౌండ్లు అదిరిపడేలా ఉంటేనే వారికి మంచి కిక్ అన్న ఫీల్‌లో ఉంటారు. అయితే తాజా అధ్యయనంలో పెద్ద శబ్దాలు వచ్చే కార్లను ఇష్టపడే వారిలో ఆ టైపు లక్షణాలు ఎక్కువగా ఉంటాయిని వెల్లడయ్యింది. అంతేగాదు దీని గురించి పరిశోధనలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు శాస్త్రవేత్తలు.కారు ఇంజిన్ల శబ్దం ఎక్కువగా ఇష్టపడే వారి జీవన విధానం చాలా విభిన్నంగా ఉంటుందట. తమ కారు శబ్దమే అధికంగా ఉండాలనుకుని మార్పులు కూడా చేసుకుంటారట కొందరు. అలాంటి వారిలో అధిక స్థాయిలో శాడిజం, సైకో మనస్తత్వం ఎక్కుగవగా ఉంటాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ మేరకు కెనడాలోని వెస్ట్రన్ అంటారియో విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త జూలీ ఐట్కెమ్ షెర్మెర్ నేతృత్వంలోని బృందం దీనిపై అధ్యయనం చేయగా..బిగ్గరగా శబ్దం వచ్చే కార్లను ఇష్టపడే వారి మనస్తత్వం చాలా వైరైటీగా ఉంటుందని తేలింది. అందుకోసం దాదాపు 500 మందికి పైగా వ్యక్తలపై అధ్యయనం నిర్వహించారు. మనుషులకు, జంతువులకు ఇబ్బంది కలిగించే పరిధిలో శబ్బాలను ఇష్టపడేవారిలో మనసు చాలా భయనకంగా ఉంటుందట. ఈ పరిశోధన పాల్గొన్న వారిలో దాదాపు 52% మంది పురుషులకు బిగ్గరగా శబ్దం వచ్చే కార్లకు ప్రాధాన్యత ఇచ్చారట. వారిలో ఇతరుల భావలకు విలువ ఇవ్వని నిర్లక్ష్య పూరిత మనస్తత్వం క్లియర్‌గా కనిపించిందట. ప్రజలు ఆ శబ్దాలను చూసి ఇబ్బందిపడుతుంటే..వారు ఆనందిస్తూ కిక్‌గా ఫీలవ్వుతారట. వారిలో ఇలాంటి సైకోపతి, శాడిజం లక్షణాలు ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు శాస్త్రవేత్తలు. పరిశోధకులు జరిపిన ఈ పరిశోధనను 'ఎ డిజైర్ ఫర్ ఎ లౌడ్ కార్ విత్ మోడిఫైడ్ మఫ్లర్ ఈజ్ ప్రిడిక్డ్ బై ఏ మ్యాన్ అండ్ హైయర్ స్కోర్ ఆన్ సైకోపతి అండ్ శాడిజం' అనే పేరుతో అంతర్జాతీయ జర్నల్ కరెంట్ ఇష్యూస్ ఇన్ పర్సనాలిటీ సైకాలజీలో ప్రచురితమయ్యింది కూడా.(చదవండి: ఉంగరంతో ఆరోగ్యం పదిలం!) -
చంద్రబాబే కదా సిసలైన సైకో!
ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తరచు ముఖ్యమంత్రి జగన్ ప్రభుత్వాన్ని సైకో పాలన అని, జగన్ సైకో అని దారుణమైన విమర్శలు చేస్తుంటారు. రాష్ట్రం నాశనం అయ్యిందని ప్రచారం చేస్తారు. వారికి డబ్బా కొట్టే ఎల్లో మీడియా ఉంది కనుక అదే పనిగా వాటిని ప్రజలలోకి తీసుకు వెళ్లడానికి ప్రయత్నిస్తున్నాయి. నిజానికి ఎవరిని సైకో అనాలి?అసలు అలాంటి పదాలు వాడడమే తప్పు కదా!. అందులోను పద్నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఇలా దిగజారుడుగా మాట్లాడడం అంటే తనను తాను కించపరచుకోవడమే. ఆయన(నారా చంద్రబాబు నాయుడు) పాలనను, జగన్ పాలనను విశ్లేషిస్తే ఎవరిది సైకో పాలనో అర్దం అవుతుంది. చంద్రబాబు 1995 నుంచి 2004 వరకు , 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2004 కి ముందు పలు ఎన్ కౌంటర్లు జరిగాయి. బెంగుళూరులో పట్టుబడిన కొందరు నక్సల్ ప్రముఖులను జగిత్యాల ప్రాంతంలో ఎన్ కౌంటర్ చేశారన్న ఆరోపణ కూడా వచ్చింది. ప్రజా గాయకుడు గద్దర్ పై కాల్పులు జరిగాయి. ఈ మధ్య గద్దర్ సంతాప సభలో సోమన్న అనే గాయకుడు పాట పాడుతూ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. నయీం, నాగరాజు, సమ్మిరెడ్డి వంటి మాఫియాలను తయారు చేసింది చంద్రబాబేనని అతను ఆ పాటలో విమర్శించాడు. ఆ వీడియో వైరల్ అయింది.ఇలా పాలన చేసినవారిని కదా సైకో అనాల్సింది. విశేషం ఏమిటంటే ఆ తర్వాత గద్దర్ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లిన చంద్రబాబు తన లక్ష్యం, గద్దర్ లక్ష్యం ఒకటే అని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచారు. మరి అలాగైతే ఆయన హయాంలో అన్ని ఫేక్ ఎన్ కౌంటర్లు ఎందుకు జరిగాయన్నదానికి జవాబు దొరకదు. ✍️ అంతేకాదు.. 2014 తర్వాత చంద్రబాబు పాలనలో తిరుమలలో ఎర్రచందనం స్మగ్లర్ ల పేరుతో తమిళ కూలీలు ఇరవై మందిని ఎన్ కౌంటర్ చేసిన చరిత్ర కూడా ఉంది. అప్పుడు తమిళనాడు ప్రభుత్వం ఇవి నకిలీ ఎన్ కౌంటర్లని ప్రకటించి, సంబంధిత కూలీల కుటుంబాలకు పరిహారం ఇచ్చింది. ఇంతమందిని ఒకేసారి ఎన్ కౌంటర్ చేసినా ఒక్క పోలీసు అదికారిపై చర్య తీసుకోలేదు. వీటినే రాజ్య హింస అని గతంలో అనేవారు. ముఖ్యమంత్రిగా జగన్ బాద్యతలు చేపట్టిన తర్వాత ఒక్కటైనా ఎన్ కౌంటర్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాయా?. మరి అలాంటప్పుడు ఆయన ఎలా సైకో అవుతారు?. అంటే చంద్రబాబు తన లక్షణాన్ని ఎదుటి వారికి ఆపాదిస్తారన్నమాట. ✍️ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఆయన ఎన్ని కార్యక్రమాలకు హాజరైనా ఎక్కడా తొక్కిసలాటలు జరగలేదు. ప్రజలు ఎక్కడ ఆపినా ఆగి వారి బాధలు విని సాధ్యమైన పరిష్కారాలు చూపుతుంటారు. అయినా ఆయనది సైకో పాలన అని చంద్రబాబు ఆరోపిస్తారు. మరి ఆయన సీఎంగా ఉండి గోదావరి పుష్కరాలకు వెళ్లి, సామాన్య భక్తుల ఘాట్ లో కుటుంబంతో స్నానమాచరించి, సినిమా తీయడం కోసం సామాన్యులను నిలువరించిన వైనం కదా సైకో పాలన అని అనిపించేది. అప్పట్లో ఈ పబ్లిసిటీ పిచ్చి వల్ల 29 మంది మరణిస్తే ఆయన ఏమన్నారు? కుంభమేళాలో చనిపోవడం లేదా? రోడ్డు ప్రమాదాలలో మృతి చెందడం లేదా? అని ఏ మాత్రం దయ లేకుండా చంద్రబాబు వ్యాఖ్యానించారు. దీనిని కదా సైకో భావజాలం అని అనాల్సింది. ✍️ సచివాలయానికి వచ్చిన నాయీ బ్రాహ్మణులను ఉద్దేశించి ఎందుకు దేవాలయం వంటి ప్రదేశానికి వచ్చారని గదమాయించిన చంద్రబాబును ఏమంటారు! ప్రభుత్వం నడిపినప్పుడే కాదు.. ప్రతిపక్షంలో ఉండి కూడా తన సభకు జనం బాగా వచ్చారని చెప్పుకోవడం కోసం ఇరుకు రోడ్లపై సభలు పెడుతున్నారు. అదే క్రమంలో కందుకూరులో ఎనిమిది మంది మరణిస్తే, అది పోలీసుల బాద్యత అని ఎదురు దబాయించారు. దానిని కదా సైకో తత్వం అనవలసింది. తన సభకు కానుకలు ఇస్తామని చెప్పడం, జనం ఎగబడి తొక్కిసలాటలో ముగ్గురు మరణించడాన్ని కదా సైకో శైలి అని అనవలసింది. కాపు రిజర్వేషన్ ఉద్యమం జరుగుతుంటే, ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దారుణంగా అవమానించింది చంద్రబాబు ప్రభుత్వంలోనే కదా! ఆయనను బలవంతంగా రాజమండ్రి ఆస్పత్రికి తరలించి ఎవరిని కలవకుండా చేయలేదా?ఆయన కుటుంబాన్ని నానా బూతులు తిట్టింది ఆయన పాలనలోని పోలీసులే కదా! దానిని కదా సైకో వ్యవహార శైలి అనవలసింది. ✍️ తుని వద్ద రైలు దగ్దం అయితే దానిని ఆర్పే పని మానేసి రాయలసీమ నుంచి, కడప నుంచి గూండాలు వచ్చారని మీడియా ముందుకు వచ్చి ఆరోపించడాన్ని ఏమంటారు. పద్దతైన పాలన అని అంటారా?. ఆ తర్వాత ఆ ప్రాంతం వారిని కాకుండా ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన కాపువర్గం వారినే అరెస్టు చేశారు. తమపై అక్రమ కేసులు పెట్టారని వారు ఆరోపించేవారు. దానిని ఏ తరహా పాలన అని అంటారు. కానీ, జగన్ ప్రభుత్వం వారిపై కేసులు ఎత్తివేస్తే అది సైకో పాలన అవుతుందా? సానుభూతితో వ్యవహరించినట్లా? అమరావతి రాజధాని పేరుతో వందలాది మంది రైతుల వద్ద నుంచి బలవంతంగా భూములు తీసుకోవడం, ఇవ్వడానికి ఇష్టపడనివారిని, కోర్టులకు వెళ్లినవారిని ఎన్ని విదాలుగా కష్టాలు పెట్టింది తెలియదా?. దానిని కదా సైకో పాలన అని అనవలసింది. జగన్ పాలనలో ఆయనకు వ్యతిరేకంగా నిత్యం ఒక వంద మంది కూర్చుని ఆందోళన చేస్తున్నా ఎన్నడైనా వారిని అడ్డుకున్నారా?. రాజధానికి పొలాలు ఇవ్వనివారి పైర్లు తగులబెట్టించడమే కాకుండా, వైఎస్సార్సీపీ ప్రస్తుత ఎంపీ నందిగం సురేష్‌ను ఆ రోజుల్లో పోలీస్ స్టేషన్ కు తీసుకు వెళ్లి నానా విధాలుగా హింసలు పెట్టించింది ఎవరు?. అప్పుడు ఆయన దళితుడుగా కనిపించలేదా?జగన్ పాలనలో అలా కావాలని ఎవరైనా చేశారా?ఒకవేళ ఎక్కడైనా పోలీసులు తప్పుగా ప్రవర్తిస్తే వెంటనే చర్యలు తీసుకుంటున్నది జగన్ ప్రభుత్వం కాదా? ✍️ ఒక డాక్టర్ తాగి రోడ్డు మీద గొడవ చేస్తుంటే అడ్డుపడి చేతులు వెనక్కి కట్టేస్తేనే ఇంకేముంది ‘దళిత డాక్టర్ ను హింసించారు ..’అంటూ చంద్రబాబు బృందం గోల చేస్తే, అప్పట్లో న్యాయస్థానం వారు దానిపై ఏకంగా సీబీఐ విచారణకు ఆదేశించారు. ఆ తర్వాత రోజుల్లో అది ఏమైందో తెలియదు. కానీ, చంద్రబాబు టైమ్ లో జరిగిన ఎన్ కౌంటర్లపై న్యాయ విచారణకు, సిబిఐ విచారణకు ఎందరు డిమాండ్ చేసినా, కోర్టుకు వెళ్లినా పెద్దగా ఫలితం లేకపోవడం కూడా ఆసక్తికరమైన అంశమే.ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్ నంద్యాల ఉప ఎన్నిక సందర్భంగా ప్రచారంలో హామీలు ఇచ్చి అమలుచేయనివారిని నడిరోడ్డుపై కాల్చాలని అన్నందుకు ఎంత పెద్ద గొడవ చేశారు. ఇంకేముంది .. ముఖ్యమంత్రిని పట్టుకుని అంత మాట అంటారా?అంటూ విపరీత ప్రచారం చేశారు. అలాంటి మాటలు చంద్రబాబు అంటే మాత్రం వాటిని కప్పిపెట్టేస్తారు. జగన్ తదుపరి కాలంలో ఎన్నడూ అలాంటి మాటలుమాట్లాడలేదు. కానీ.. ఇటీవలికాలంలోచంద్రబాబు ఇష్టం వచ్చినట్లు కార్యకర్తలను రెచ్చగొట్టి ‘‘తరమండిరా? నా... ’’అంటూ బూతులు మాట్లాడడం, అంతుచూస్తా.. అంటూ బెదిరించడమే కాకుండా, టీడీపీ కార్యకర్తలు ఏకంగా పోలీసు వాహనాలను దగ్దం చేస్తే, పోలీసులపై దాడి చేస్తే, ఒక కానిస్టేబుల్ కన్ను పోతే కనీసం సానుభూతి చెప్పని చంద్రబాబును ఏమనాలి? అలాంటివారిని కాదా సైకో అని అనవలసింది. జగన్ ఎప్పుడైనా అలా దురుసుగా వ్యవహరించారా?రెచ్చగొట్టారా?రాష్ట్రం ప్రశాంతంగా ఉంటే గొడవలు సృష్టించాలనుకోవడం సైకోల పని అవుతుంది కాని, శాంతి భద్రతలు కాపాడే జగన్ ప్రభుత్వం సైకో పాలన ఎలా అవుతుంది.కేవలం ఏవో కొన్ని పిచ్చి డైలాగులు చెబుతూ ప్రజలను మభ్య పెడుతూ రాజకీయం చేయడం అన్నిటిని మించిన సైకోల పని అని చెప్పడానికి ఈ ఉదాహరణలు చాలవా?. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
బాలీవుడ్ మూవీలో విలన్‌గా కరీంనగర్ కుర్రాడు.. ట్రైలర్ విడుదల
‘‘కాలా బార్ బేరియన్’ ట్రైలర్ ఆసక్తిగా ఉంది. ప్రజ్ఞన్ బాగా నటించాడని తెలుస్తోంది. ఈ సినిమా తెలుగులోనూ మంచి సక్సెస్ కావాలి’’ అని దర్శకుడు ఎన్. శంకర్ అన్నారు. ప్రజ్ఞన్, వరుణ్ సింగ్ రాజ్‌పుత్, స్థుతి చయనిక ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘కాలా బార్ బేరియన్’(చాప్టర్ 1). జింటో చాకో శామ్యూల్ దర్శకత్వంలో పూణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ పొందిన కొందరు విద్యార్థులు హిందీ, తెలుగులో ఈ చిత్రాన్ని నిర్మించారు. పరుపాటి శ్రీనివాస రెడ్డి ఈ మూవీని తెలుగులో విడుదల చేయనున్నారు. ఈ సినిమా ట్రైలర్‌ను ఎన్. శంకర్ రిలీజ్ చేశారు ‘‘ఈ సినిమాలో ఒక సైకో, మల్టీ పర్సనాలిటీ... ఇలా చాలా వేరియషన్స్ ఉన్న పాత్రలు చేశాను’’ అన్నారు ప్రజ్ఞన్. ఇతను తెలంగాణలోని కరీంనగర్‌కు చెందిన కుర్రాడు. నటన మీద ఆసక్తితో పుణె ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో శిక్షణ పొందాడు. -
ప్రేమ పెళ్లి.. సైకో భర్త.. పెళ్లయిన ఆరు నెలలకే భార్య షాకింగ్ నిర్ణయం
కృష్ణరాజపురం: బెంగళూరు నగరంలో యువతి అనుమానాస్పద రీతిలో మృతి చెందింది. నగరంలోని పుట్టేనహళ్ళి పొలీస్ స్టేషన్ పరిధిలో నిహారిక అనే యువతి ఉరి వేసుకొని ప్రాణాలు తీసుకుంది. వివరాలు... స్థానికంగా ఉండే నిహారిక (25), కార్తీక్‌లు గత ఐదేళ్ల నుంచి ప్రేమించుకున్నారు. పెద్దలు మాట్లాడుకుని ఈ ఏడాది జూన్ 1వ తేదీన ఘనంగా పెళ్లి జరిపించారు. నిహారిక ఒక ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పని చేస్తుండగా, భర్త ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేసేవాడు. చదవండి: రెస్టారెంట్లో బిర్యానీ తింటున్నారా?.. అయితే మీకో చేదు వార్త నిత్యం వేధింపులు కోటి ఆశలతో కాపురానికి వచ్చిన నిహారికకు భర్త, అత్తమామల నిజస్వరూపం కొద్దిరోజులకే అర్థమైంది. భర్త శారీరకంగా, మానసికంగా వేధిస్తూ సైకో మాదిరిగా ప్రవర్తించేవాడు. అత్తమామలు కూడా అతనికే వంత పాడేవారు. దీంతో విరక్తి చెంది ఆదివారం తన గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. పుట్టేనహళ్ళి పోలీసులు పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. భర్త, అతని తల్లిదండ్రుల వేధింపుల వల్లనే తమ బిడ్డ చనిపోయిందని నిహారిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. -
తిరుపతిలో సైకో హల్చల్.. అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని..
సాక్షి, తిరుపతి: నగరంలో ఓ సైకో అర్ధరాత్రి హల్చల్ చేశాడు. చేతిలో గొడ్డలి పట్టుకుని అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. సైకో వీరంగం స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. కాగా, తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి పీఎస్ పరిధిలో శ్రీనగర్‌కాలనీలో ఓ సైకో అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని హల్చల్ చేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ నాలుగు ఇళ్ల తలుపులు, కిటికీలను బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన ఫుటేజీ స్థానికంగా ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు. ఇక, కొద్దిరోజులుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్న తరుణంలో ఇతను కూడా ఆ గ్యాంగ్‌కు చెందినవాడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీసుల అదుపులో కీచక ఉపాధ్యాయుడు
-
విజయవాడ పడమట లో సైకో కలకలం
-
గుంటూరులో సైకో వీరంగం
గుంటూరు ఈస్ట్: కొరిటెపాడు పార్కు ఎదురుగా ఉన్న లక్ష్మీ తిరుపతమ్మ ఆలయం వద్ద సైకో వీరంగం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అరండల్‌పేట ఎస్హెచ్ఓ నరేష్ తెలిపిన వివరాల ప్రకారం... సమీపంలో నివసించే ఆటో డ్రైవర్ శివ మద్యం మత్తులో శనివారం మధ్యాహ్నం తిరుపతమ్మ ఆలయం వద్దకు వచ్చాడు. తొలుత రెండు సీసీ కెమెరాలు పగుల కొడుతుండగా స్థానికులు గమనించి అడ్డుకోబోయారు. అయినా వారిని లెక్క చేయకుండా ఆలయం గేటు దూకి లోపలకు వెళ్లి చేతితో అద్దాలు పగులకొట్టాడు. గుడిలోని గంటలను ఊడపీకేందుకు ప్రయత్నించాడు. అడ్డు వచ్చిన వారందరినీ కొడుతూ ఉన్మాదిలా కేకలు వేస్తూ నానా రభస చేశాడు. గర్భగుడి తలుపులను సైతం పగుల కొట్టేందుకు ప్రయత్నించాడు. శివ చేతి నుంచి కారిన రక్తం గుడి గంటలకు , గోడలకు అంటుకుంది. అరండల్‌పేట ఎస్హెచ్ఓ నరేష్ సిబ్బందితో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని గర్భగుడి తలుపులు బలవంతగా తెరిచేందుకు ప్రయత్నించిన శివను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. ఇటీవల ఇదే ఆలయంలో హుండీని సైతం దొంగలు అపహరించారు. సీసీ కెమెరాలున్నా చోరీ వాటిలో రికార్డుకాకపోవడం విశేషం. చదవండి: దారుణంగా హత్య చేసి.. గుంతలో పడేసి.. ఆ కుటుంబంపై కరోనా పడగనీడ -
తండ్రిని కొట్టి చంపిన తనయుడు
సోన్ (నిర్మల్): నడిరోడ్డుపై తండ్రిని బండరాయితో కొట్టి చంపాడో కొడుకు. ఈ ఘటన నిర్మల్ జిల్లా సోన్ మండలం కూచన్‌పల్లిలో శనివారం వేకువజామున చోటుచేసుకుంది. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన సంగని పెద్ద రాజన్న, లింగవ్వ దంపతుల రెండో కుమారుడు రవి వారం క్రితం దుబాయ్ నుంచి వచ్చాడు. అప్పటి నుంచి తాను పంపిన డబ్బుల విషయమై కుటుంబ సభ్యులతో గొడవ పడుతున్నాడు. శుక్రవారం సాయంత్రం సోదరుడు రాజు ఇంటికి వెళ్లి నిద్రిస్తున్న అతడిపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు. నిందితుడు రవిని పోలీసులు స్టేషన్‌కు తరలించి.. అర్ధరాత్రి తిరిగి ఇంటికి పంపించారు. ఈ క్రమంలో ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని బయటకు లాక్కొచ్చి నడిరోడ్డుపై బండరాయితో కొట్టి చంపాడు. మృతదేహాన్ని తరలించే క్రమంలో గ్రామస్తులు ఆందోళనకు దిగారు. నిందితుడిని తమకు అప్పగించాలని, సోదరుడిపై హత్యాయత్నం చేసిన వ్యక్తిని రాత్రి వేళ పోలీస్‌స్టేషన్ నుంచి ఎందుకు పంపిచారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్సైపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వారిని డీఎస్పీ శాంతింపజేశారు. సైకోగా మారిన రవి రవి సైకో మారాడని గ్రామస్తులు పేర్కొన్నారు. వేధింపులు భరించలేక నాలుగేళ్ల క్రితం భార్య విడాకులు తీసుకుంది. మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లిన రవి.. అక్కడా సహచరులతో గొడవ పడేవాడని తెలిసింది. వారి ఫిర్యాదుతో రవిని వారం క్రితం కంపెనీ ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది. అప్పటి నుంచి తల్లిదండ్రులు, సోదరుడితో గొడవ పడుతున్నాడు. మూడు రోజుల క్రితం తల్లి లింగవ్వపై కొడవలితో దాడి చేయగా.. చేతికి గాయమైంది. -
మద్యం మత్తులో సైకో వీరంగం
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మధురవాడ, కొమ్మాదిలో గల అమరావతి కాలనీలో సైకో వీరంగం చేశాడు. స్థానిక మహిళ మీద కత్తితో దాడి చేశాడు. ఈ సంఘటన చుట్టుపక్కల వారిని భయాందోళనకు గురి చేసింది. వారు తెలిపిన వివరాల ప్రకారం బీ బ్లాక్ 19 లో ఒరిస్సాకు చెందిన ఒక వ్యక్తి నివాసం ఉంటున్నాడు. సోమవారం ఉదయం 10:30 గంటలకి అతడు, అతని స్నేహితునితో కలిసి మందు పార్టీ చేసుకున్నారు. ఈ క్రమంలో వారిలో వారికే గొడవలు మొదలయ్యాయి. అరుపులు రావడంతో ఆ బ్లాక్ లోని వారు తలుపులు బిగించుకుని భయం భయంగా గడిపారు. ఈలోగా ఆ ఇంటికి వచ్చిన వ్యక్తి మరొక మిత్రుడితో కలిసి కారులో పారిపోయాడు. మరో వ్యక్తి పూర్తిగా మద్యం మత్తులో సైకోలా ప్రవర్తించాడు. నాలుగు సంవత్సరాల చిన్నారిపై దాడి చేయబోయాడు. (చదవండి: బ్యాంక్‌లో సైకో వీరంగం) అటువైపు వెళ్తున్న టీ షాప్ యజమానురాలు లక్ష్మి ఆ దాడిని అడ్డుకోబోయింది. దాంతో సైకో ఆమెపై కూడా దాడి చేసి, మెడపై గాయాలు చేశాడు. ఒంటి మీద ఏవి లేకుండా, వింత వింతగా ప్రవర్తిస్తున్న వ్యక్తిని స్థానికులు పట్టుకొని, దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. స్థానిక ఏసీపీ రవిశంకర్ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి పరిశిలించారు. పీఎం పాలెం సీఐని కేసు దర్యాప్తు చెయ్యాలని ఆదేశించారు -
సైకో సందేశం
కార్తీక్ సాయి హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సైకో’. అటు హీరోగా, ఇటు డైరెక్టర్‌గా ఇదే ఆయనకు తొలి చిత్రం. లావణ్య సమర్పణలో యాదవ్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై ఆవుల రాజు యాదవ్, వాసు సంకినేని నిర్మిస్తున్న ఈ చిత్రం మొదటి షెడ్యూల్ పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ –‘‘ఓ కొత్త పాయింట్‌కి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ జోడించి దర్శకుడు చిత్రీకరిస్తున్న విధానం బాగుంది. మా చిత్రం సమాజానికి ఓ కొత్త సందేశం ఇస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘మా చిత్రానికి కథ, కథనమే ప్రధాన బలం’’ అన్నారు కార్తీక్ సాయి. డాలి షా, నేహా దేశ్‌పాండే కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్యన్, సంగీతం: సిద్దార్ వాట్కిన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: తోట సతీష్, లైన్ ప్రొడ్యూసర్స్: ప్రియా, సంతోష్ కుమార్. -
సైకో స్వైర విహారం
పశ్చిమగోదావరి, పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లులో ఒక వ్యక్తి సైకోలా వీరంగం చేసి స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. విచక్షణారహితంగా పలువురిపై దాడికి పాల్పడటంతో స్థానికులు కర్రలతో అతడిని కట్టడి చేసి పోలీసులకు అప్పగించారు. వివరాలిలా ఉన్నాయి.. తమిళనాడు తంజావూరు నుంచి వచ్చిన కొందరు యువకులు పాలకొల్లులో జ్యూస్ సెంటర్ నడుపుతున్నారు. వారిలో ఒకడైన సులేన్ అనే వ్యక్తి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో ఆదివారం మిత్రులతో గొడవ పడి జ్యూస్ సెంటర్ నుంచి బయటకు వచ్చాడు. యడ్లబజారు సెంటర్లోని కనకదుర్గమ్మ ఆలయంలోకి వెళ్లి శంభోశంకర అంటూ అరుచుకుంటూ అమ్మవారి విగ్రహం వద్దకు వెళ్లి అక్కడున్న వస్తువులను గిరాటు వేశాడు. ఇద్దరు భక్తులు, అర్చకునిపై దాడికి పాల్పడ్డాడు. అక్క డి నుంచి బయటకు వచ్చిన సులేన్ రోడ్డుపై వెళుతున్న పలువురిపై దాడులకు దిగాడు. అటుగా వచ్చిన కానిస్టేబుల్‌పై కూడా దాడి చేశాడు. రోడ్డుపై కనిపించిన వ్యక్తులను ఇష్టమొచ్చినట్లు కొడుతూ తన చేతులను కత్తితో చీరేసుకున్నాడు. ఎంఎంకేఎన్ఎం హైస్కూల్ వద్ద మరో వ్యక్తిపై పైసాచికంగా దాడి చేస్తుండగా స్థానికులు సులేన్‌ను కర్రలతో కట్టడి చేశారు. అనంతరం అతడిని తాళ్లతో నిర్బంధించి పోలీసుల సహకారంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సులేన్ మానసిక స్థితి సరిగా లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స చేయించిన అనంతరం సులేన్‌ను మిత్రులకు అప్పగించామని పోలీసులు చెప్పారు. -
బ్యాంక్‌లో సైకో వీరంగం
చాంద్రాయణగుట్ట: బ్యాంక్‌లోకి ప్రవేశించిన ఓ సైకో వీరంగం సృష్టించాడు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వివరాలు.. శంషీర్‌గంజ్‌లోని భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) లోకి గురువారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో సిక్చావునీకి అల్లావుద్దీన్(40) ప్రవేశించి ఒక్కసారిగా కేకలు వేస్తూ తనకు తాను బ్లేడ్‌తో గాయపరుచుకున్నాడు. ఒక చేతిలో బ్లేడ్, మరో చేతిలో రాయి పట్టుకొని బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులను తీవ్ర భయాందోళనలకు గురిచేశాడు. సమాచారం అందుకున్న శాలిబండ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని అల్లావుద్దీన్‌ను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. పోలీసులను కూడా దగ్గర రానివ్వకుండా హంగామా సృష్టించాడు. చివరకు పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకొని ఎర్రగడ్డలోని మానసిక వైద్యశాలకు తరలించాడు. వారం రోజుల నుంచి ఇతడు వైట్నర్ సేవించి అలియాబాద్ ప్రధాన రహదారిపై తిరుగుతూ బ్లేడ్‌తో గాయం చేసుకోవడం, రోడ్డుపై బైఠాయించి న్యూసెన్స్ చేస్తున్నాడని ఈ సందర్భంగా స్థానిక ప్రజలు పేర్కొన్నారు. బ్యాంక్‌లోకి కూడా తరచూ వస్తుండడంతో డబ్బులు విత్‌డ్రా చేసుకోవద్దని, అతడు లాక్కెలుతాడని ఏకంగా బ్యాంక్ అధికారులే తమకు సూచిస్తున్నారని ఖాతాదారులు వాపోయారు. -
సికింద్రాబాద్‌లో సైకో ఉన్మాదం
-
నగరంలో సైకో ఉన్మాదం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సైకో వీరంగ సృష్టించాడు. సిక్రింద్రాబాద్‌లో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తిపై బలమైన కర్రతో దాడికి దిగాడు. తలపై బలంగా కొట్టడంతో ఆయన అక్కడే రోడ్డుపై పడిపోయాడు. రోడ్డుపై కిందపడ్డా ఇష్టమొచ్చినట్టు చితకబాదాడు. సైకో దాడిని గమనించిన అక్కడివారు అతడ్నిపట్టుకునే ప్రయత్నం చేసే లోపు పరారయ్యాడు. సీసీ కెమెరా దృశ్యాల ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేశారు. కొద్దిసేపటి క్రితం సైకోను అదుపులోకి తీసుకున్నారు. గాయపడ్డ వ్యక్తిని నర్సిరెడ్డిగా గుర్తించారు. ప్రస్తుతం నర్సిరెడ్డి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
‘ఇళయరాజా నాకు తల్లి,తండ్రి’
తన చిత్రాలు కత్తిపై నడకలానే ఉంటాయి అని దర్శకుడు మిష్కిన్ పేర్కొన్నారు. నిజం చెప్పాలంటే ఇతర దర్శకులు చిత్రాలకు భిన్నంగానే ఈయన చిత్రాలు ఉంటాయి. అంతేకాదు మిష్కన్ మాటలు, చేతలు అలానే ఉంటాయి. తొలి నుంచి తనదైన శైలితోనే చిత్రాలు తెరకెకిక్కస్తున్న ఈయన ఆ మధ్య పిశాచు, తుప్పరివాలన్ వంటి చిత్రాలు సక్సెస్ అయ్యాయి. తాజాగా ఉదయనిధి స్టాలిన్ కథానాయకుడిగా నటి నిత్యామీనన్, అదితిరావ్ నాయికలుగా తెరకెక్కించిన చిత్రం సైకో. ఈ చిత్రం ప్రారంభం నుంచి విడుదలకు ముందు, ఆ తరువాత కూడా సంచలనంగా మారింది. సైకో చిత్రం గత నెల 24న తెరపైకి వచ్చింది. అయితే చిత్రానికి మాత్రం మిశ్రమ స్పందననే వస్తోంది. ఉదయనిది స్టాలిన్‌తో మిష్కిన్ కానీ టాక్‌కు సంబంధం లేకుండా థియేటర్లలో రెండో వారంలోకి చేరుకుంది. సాధారణంగా ఒక వారం పూర్తిగా చిత్రం థియేటర్లలో ఉంటేనే సక్సెస్ అనుకుంటున్న రోజులివి. కాబట్టి సైకో చిత్ర యూనిట్ సక్సెస్ సంతోషంలో ఉన్నారు. ఈ ఆనందాన్ని శుక్రవారం మీడియాతో పంచుకున్నారు కూడా. స్థానిక ప్రసాద్‌ల్యాబ్‌లో సైకో చిత్ర సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దర్శకుడు మిష్కిన్ మాట్లాడుతూ సంగీతదర్శకుడు ఇళయరాజా తనకు తల్లిదండ్రులు మాదిరని అన్నారు. ఆయన అందించిన సంగీతం, పాటలు సైకో చిత్ర విజయానికి కారణంగా పేర్కొన్నారు. అందుకే ఈ చిత్ర విజయాన్ని ఆయనకు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇకపోతే సైకో చిత్ర షూటింగ్ పూర్తి అయిన తరువాత నటుడు ఉదయనిదిస్టాలిన్ను తన తల్లి కడుపున పుట్టిన తన తమ్ముడుగా భావిస్తున్నానని చెప్పారు. నిజం చెప్పాలంటే తాను ఆయన చిత్రాలేవీ చూడలేదన్నారు. సైకో 2 చిత్రం చేస్తారా? అని అడుగుతున్నారని, తన జీవిత కాలంలో ఎప్పుడైనా ఉదయనిధిస్టాలిన్ తనతో చిత్రం చేయమని కోరితే చేయడానికి సిద్ధం అని అన్నారు. ఇకపోతే సైకో చిత్రం గురించి రకరకాల విమర్శలు వస్తున్నాయని, అయితే ఇది చెడ్డ చిత్రం కాదని అన్నారు. తన చిత్రాలన్నీ కత్తిపై నడిచినట్లే ఉంటాయన్నారు. చదవండి: అమ్మకు కీర్తి తెచ్చిన పాత్రలో కీర్తి ‘అమలాపాల్-విజయ్ విడిపోడానికి ధనుషే కారణం!’ -
సైకో వీరంగం.. గాజు ముక్కలతో..
సాక్షి, అనంతపురం : జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ఓ సైకో వీరంగం సృష్టించారు. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకుంటూ హల్ చల్ చేశాడు. బస్టాండ్‌లో సెల్ఫోన్లు చోరీ చేస్తూ పట్టుబడ్డ నాని అనే సైకోను పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతన్ని ఆర్టీసీ బస్టాండ్‌లోని అవుట్ పోస్ట్‌కు తరలించారు. దీంతో కోపోద్రిక్తుడైన నాని.. అవుట్ పోస్ట్‌లోని ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. పోలీసులను దుర్భాషలాడుతూ.. గాజు ముక్కలతో తనకు తానే గాయాలు చేసుకున్నాడు. గట్టిగా అరుస్తూ పోలీసులపై దాడి చేయబోయాడు. అప్రమత్తమైన పోలీసులు.. అతన్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. -
ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : ఆర్టీసీ బస్సులో సైకో వీరంగం సృష్టించాడు. బస్సులోని మహిళ కండక్టర్‌పై దాడికి యత్నించడమే కాకుండా, ఒక ప్రయణికున్ని కూడా గాయపరిచాడు. జిల్లాలోని దమ్మపేట మండలం మండలపల్లి, ముష్టిబండా మధ్య ఈ ఘటన చోటుచేసకుంది. వివరాల్లోకి వెళితే.. అశ్వారావుపేట రింగ్‌రోడ్డు వద్ద బస్సు ఎక్కిన సైకో.. సత్తుపల్లికి టికెట్ ఇవ్వమని కండక్టర్‌ను అడిగాడు. అందుకు కండక్టర్ డబ్బులు అడగ్గా.. డబ్బులు లేవని చెప్పి దాడికి యత్నించాడని ప్రయాణికులు చెబుతున్నారు. పైగా కత్తితో బెదిరిస్తూ హల్చల్ చేసిన సైకో.. కొద్దిసేపటికే బస్సు దిగి పారిపోయాడు. తర్వాత సైకోను వెంబడించిన ప్రయాణికులు అక్కడికి దగ్గర్లోని మామిడి తోటలో సైకోను అదుపులోకి తీసుకుని దమ్మపేట పోలీసులకు అప్పగించారు. కాగా, ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న రాజుకు స్వల్ప గాయలైనట్టు గా తెలుస్తోంది. -
విజయవాడలో సైకో వీరంగం
సాక్షి, విజయవాడ : నగరంలోని పంజా సెంటర్ వద్ద సైకో వీరంగం సృష్టించాడు. ఆ ప్రాంతంలో రెచ్చిపోయిన సైకో మనుషులపై కర్రలతో, సీసాలతో దాడికి యత్నించారు. దీంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సైకోను నిలువరించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసుల రాకను చూసిన సైకో అక్కడే ఎదురుగా ఉన్న అండర్ డ్రైనేజీలోకి వెళ్లి దాక్కున్నాడు. దీంతో సైకోను బయటకు తీసుకురావడానికి పోలీసులు నానా కష్టాలు పడుతున్నారు. -
హత్య చేశా..దమ్ముంటే పట్టుకో
కర్ణాటక, కృష్ణరాజపురం: పోలీస్‌స్టేషన్‌లోని ల్యాండ్‌లైన్ ఫోన్‌కు కాల్ చేసి మహిళా కానిస్టేబుల్ ను వేధిస్తున్న వ్యక్తిని సోమవారం బాగలకుంటె పోలీసులు అరెస్ట్ చేశారు. ఉపాధి కోసం బెంగళూరుకు వచ్చిన రమేశ్ అనే వ్య క్తి చాలాకాలంగా బాగల్‌కుంటెలో ఉం టున్నాడు. మూడు నెలలుగా అక్కడి ల్యాండ్‌లైన్‌కు ఫోన్ చేయడం, ఫోన్ తీసిన మహిళా కానిస్టేబుల్‌తో అసభ్యంగా మాట్లాడడం పనిగా పెట్టుకున్నారు. హత్య చేశాను, వచ్చి అరెస్ట్ చేయం డి, అత్యాచారం చేశాను, దమ్మంటే పట్టుకోండి, ఒక్కోసారి నాకు సహక రించు..అని అతడు సైకో మాదిరిగా మహిళా పోలీస్‌ను సతాయిస్తున్నా డు.రోజురోజుకు వేధింపులు తీవ్రతరం కావడంతో పోలీసులు అతని ఫో న్ నంబర్, టవర్ లొకేషన్ ఆధారంగా రమేశ్‌ను గుర్తించి అరెస్ట్ చేశారు. -
ప్రేమించలేదని టెన్త్ బాలిక నరికివేత
అభంశుభం తెలియని పదో తరగతి బాలిక ప్రేమోన్మాది కొడవలికి బలైంది. బాలిక తనతో మాట్లాడడం లేదని, ఆమె తల్లిదండ్రులు పెళ్లికి ఒప్పుకోలేదని పగ పెంచుకున్న ఓ యువకుడు వెంటాడి ప్రాణాలు తీశాడు. ఇంటి నుంచి పాఠశాలకు వెళ్తుండగా దాడి చోటుచేసుకుంది. కర్ణాటక, దొడ్డబళ్లాపురం: బాలికను ఓ సైకో పట్టపగలు నడిరోడ్డుమీద తెగనరికి చంపాడు. తన ప్రేమను కాదన్నందుకు అమాయకపు బాలికను నిర్దాక్షిణ్యంగా బలితీసుకున్నాడు. బ్యాగ్ తగిలించుకుని ఉత్సాహంగా పాఠశాలకు బయలుదేరిన ముద్దుల కూతురు దారుణ హత్యకు గురైందని తెలియడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. ఈ ఘోర విషాదం దొడ్డ పట్టణంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. ఎలా జరిగిందంటే.. పట్టణ శివారులోని బసవేశ్వర నగర్లో నివసిస్తున్న నందీశ, లలిత దంపతుల రెండవ కూతురు కీర్తన (15) హత్యకు గురైన చిన్నారి. ఇదే ప్రాంతంలో నివసిస్తున్న గార పని చేసే నవీన్ (28) ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. కీర్తన పట్టణంలోని బీఎస్ఏ పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. తండ్రి ఇంటికి సమీపంలోనే టీకొట్టు నడుపుకుంటూ ముగ్గురు కూతుర్లను చదివిస్తున్నాడు. బుధవారం ఉదయం 8–30 సమయంలోకీర్తన పాఠశాలకు బయలుదేరింది. అక్కడే కాపు కాసిన నవీన్.. కొడవలితో బాలికను తీవ్రంగా నరికాడు. కీర్తన అక్కడే కుప్పకూలి ప్రాణం వదిలింది. దుండగున్ని అడ్డుకోబోయిన స్థానికులను నవీన్ కొడవలితో బెదిరించాడట. పెళ్లి చేయాలని ఒత్తిళ్లు కీర్తన అక్క వైశాలి, హంతకుడు నవీన్ తమ్ముడు ప్రవీణ్‌కుమార్ ఏడాది క్రితం ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నారు. అలా ఇరు కుటుంబాలకు బంధుత్వం ఏర్పడింది. తరచూ కీర్తన ఇంటికి వచ్చే నవీన్ బాలికలను తనకిచ్చి వివాహం చేయాలని వారిని ఒత్తిడి చేసేవాడు. అతడు చెడు వ్యసనాలకు అలవాటుపడి జులాయిగా తిరుగుతుండడంతో కీర్తన తల్లిదండ్రులు ససేమిరా అన్నారు. అయినా అతడు బాలికను పాఠశాలకు వెళ్లేసమ యంలో వెంటాడి వేధించేవాడు. ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని స్థానికులు కొన్నిసార్లు దేహశుద్ధి చేశారు. ఒకసారి పోలీస్‌స్టేషన్‌కు కూడా పిలిపించి వార్నింగ్‌లు ఇప్పించారు. అతని వ్యవహారాలు తెలిసి బాలిక కూడా ఇష్టపడేది కాదు. దీంతో కసి పెంచుకున్నారు. విషం తాగినట్టు డ్రామా హత్య చేసిన నవీన్ బసవ భవనం వద్దకు వెళ్లి (ఇంటికి సమీపంలోనే) విషం తాగినట్టు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పాడు.కుటుంబ సభ్యులు వచ్చేసరికి నవీన్ సొమ్మసిల్లి పడిపోయినట్టు నటించాడు. తక్షణం అతడ్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా పోలీసులు చికిత్స చేసి ప్రమాదమేమీ లేదని తేల్చిచెప్పారు. పోలీసులు ఆ మృగాన్ని కస్టడీలోకి తీసుకున్నారు. గ్రామీణ పోలీసులు కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీకాకుళంలో సైకో వీరంగం
సాక్షి, శ్రీకాకుళం : పట్టణంలోని డీసీసీబీ కాలనీలో సైకో వీరంగం సృష్టించాడు. విజయ విహారి అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న కె. సత్యనారాయణ అనే వ్యక్తి ఇరుగుపొరుగు వారిని కత్తులతో బెదిరిస్తూ ఉన్మాదిలా ప్రవర్తించాడు. దీంతో కొంతమంది స్థానిక యువకులు అతడిని పట్టుకుని చేతులు కట్టేశారు. అనంతరం రూరల్ పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అక్కడికి చేరుకున్న పోలీసులు సత్యనారాయణ నుంచి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. కాగా భార్యా, తల్లిదండ్రులు తనను విడిచి పెట్టారన్న మనస్తాపంతో మద్యం మత్తులో అలా ప్రవర్తించానని సత్యనారాయణ పోలీసులకు తెలిపాడు. -
అదితీ సైకో!
ఈ రోజు ఓ ముగ్గరి కొత్త జర్నీ స్టార్ట్ అయ్యింది. అందులో ఒకరు ‘సైకో’. మరి ఆ సైకో పర్సన్ నుంచి మిగతా వారు ఎలా తప్పించుకున్నారు అనేది తెలియాలంటే బోలెడంత టైమ్ ఉంది. ‘డిటñ క్టివ్’ ఫేమ్ మిస్కిన్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సైకో’. ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీరావ్ హైదరీ ముఖ్యతారలుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. పీసీ శ్రీరామ్ ఛాయాగ్రాహకుడు. ‘‘తమిళంలో ‘సైకో’ చిత్రంలో నటిస్తున్నాను అని చెప్పడానికి ఆనందంగా ఉంది. మంచి టీమ్ కుదిరింది’’ అని పేర్కొన్నారు అదితి. ‘‘సైకో’ టైటిల్ లోగో రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. శుక్రవారం నుంచి షూటింగ్ మొదలవుతుంది’’ అన్నారు ఉదయ్. ఇందులో సైకో ఎవరంటే అదితీరావ్ అని కోలీవుడ్ టాక్. ఇదిలా ఉంటే ప్రస్తుతం తెలుగులో అదితీ రావ్ చేస్తోన్న ‘అంతరిక్షం 9000 కీమీ’ డిసెంబర్ 21 రిలీజ్ కానుంది. -
ఇద్దరు అందాల భామలతో ‘సైకో’
సాక్షి, తమిళ సినిమా : ఇద్దరు అందాలభామలతో కలిసి ఆడిపాడేందుకు ‘సైకో’ సిద్ధమవుతున్నడు. ఉదయనిధి స్టాలిన్ ప్రధాన పాత్రలో దర్శకుడు మిష్కిన్ ‘సైకో’ తెరకెక్కిస్తుండగా.. దీనికి మేస్ట్రా ఇళయరాజా సంగీతమందిస్తున్నారు. ఈ చిత్రంలో ఉదయనిధికి జోడీగా ఇద్దరు నటించబోతున్నారు. మణిరత్నం కంపెనీ హీరోయిన్గా ముద్రపడిన అదితిరావ్ హైదరి, సంచలన నటి నిత్యామీనన్‌లే ఉదయనిధితో రొమాన్స్ చేయనున్నారు. వైవిధ్యభరిత కథా చిత్రాల దర్శకుడు మిష్కిన్. ఇటీవల తుప్పరివాలన్ చిత్రంతో విజయాన్ని అందుకున్న ఈ దర్శకుడు ఆ మధ్య పిశాచి అనే థ్రిల్లర్ కథను సక్సెస్‌ఫుల్‌గా తెరకెక్కించారు. సవరకత్తి అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఇతివృత్తంతో సినిమా రూపొందించి ప్రశంసలు అందుకున్నారు. తాజాగా సైకో అంటూ భయ పెట్టడానికి మిష్కిన్ రెడీ అవుతున్నారు. ఇందులో ఉదయనిధిస్టాలిన్ జంటగా అదితిరావ్ హైదరి, నిత్యామీనన్‌ను ఎంచుకున్నారు. మరో దర్శకుడు రామ్ ప్రధాన పాత్ర పోషించనున్న ఈ చిత్రానికి ప్రముఖ ఛాయాగ్రాహకుడు పీసీ. శ్రీరామ్, ఇళయరాజా పనితనాన్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ చిత్రాన్ని డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుళ్‌మొళి మాణిక్యం నిర్మించనున్నారు. నిర్మాత మాట్లాడుతూ సాధారణ చిత్రాలకు భిన్నంగా మంచి క్లాసికల్ చిత్రాలు చేయడంలో దర్శకుడు మిష్కిన్ దిట్ట అన్నారు. అదే సమయంలో ప్రేక్షకులను థియేటర్లకు ఎలా రప్పించాలన్నది తెలిసిన దర్శకుడాయన అని పేర్కొన్నారు. సైకో చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని నిర్మాత అరుణ్మొళి మాణిక్యం తెలిపారు. చిత్రం త్వరలో సెట్‌పైకి వెళ్లనుందని చెప్పారు. -
డేంజరస్ మ్యాన్ ఎట్టకేలకు దొరికాడు!
టిరానా : తన బంధువుల కుటుంబంలోని 8 మందిని దారుణహత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. అయితే అతడు సైకోలా మారి ఎందుకు ఈ హత్యలకు పాల్పడ్డాడో తెలుసుకునేందుకు పోలీసులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. హత్యల ఉదంతం అల్బేనియాలో ఇటీవల చోటుచేసుకుంది. రిడ్వాన్ జైకాజ్ అనే 24 ఏళ్ల వ్యక్తి తన బంధువుల కుటుంబంపై పగతో రగిలిపోయాడు. ఈ క్రమంలో రాజధాని టిరానాకు 90 కిలోమీటర్ల దూరంలోని రెస్యూలాజ్ అనే గ్రామంలో ఉన్న బంధువుల ఇంటికి ఏకే-47తో వెళ్లాడు. ఒక్కసారిగా ఉన్మాదిగా మారిపోయి తన తాతను ఆపై ఆమె భార్యను తుపాకీతో కాల్చేశాడు. ఆ ఫ్యామిలోని మరో ఆరుగురు సభ్యులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారు చనిపోయారని నిర్దారించుకున్న తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. ఆ నిందితుడి చేతిలో హత్యకు గురైన వారిలో 9 ఏళ్ల చిన్నారి, ఓ టీనేజీ బాలిక సహా ముగ్గురు మహిళలు ఉన్నారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన పోలీసులు కొన్ని బృందాలుగా ఏర్పడి నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. రిడ్వాన్ జైకాజ్ ఫొటోను చుట్టుపక్కల ప్రాంతాల్లోని పోలీస్ స్టేషన్లకు పంపించారు. అతడు చాలా ప్రమాదకరమైన వ్యక్తి అని అతడు ఎక్కడైనా కనిపిస్తే కచ్చితంగా తమకు సమాచారం అందించాలని పోలీసులు ప్రకటన విడుదల చేశారు. దాదాపు 24 గంటలపాటు సెర్చ్ ఆపరేషన్ కొనసాగించిన పోలీసులు ఎట్టకేలకు ఆ కరడుగట్టిన నిందితుడిని శనివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఈ దారుణానికి ఎందుకు పాల్పడ్డాడన్న దానిపై ప్రశ్నిస్తున్నారు.