
సాక్షి, తిరుపతి: నగరంలో ఓ సైకో అర్ధరాత్రి హల్‌చల్ చేశాడు. చేతిలో గొడ్డలి పట్టుకుని అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. సైకో వీరంగం స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది.
కాగా, తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి పీఎస్ పరిధిలో శ్రీనగర్‌కాలనీలో ఓ సైకో అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని హల్‌చల్ చేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ నాలుగు ఇళ్ల తలుపులు, కిటికీలను బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన ఫుటేజీ స్థానికంగా ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు. ఇక, కొద్దిరోజులుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్ చేస్తున్న తరుణంలో ఇతను కూడా ఆ గ్యాంగ్‌కు చెందినవాడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment