Srinagar Colony
-
తిరుపతిలో సైకో హల్చల్.. అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని..
సాక్షి, తిరుపతి: నగరంలో ఓ సైకో అర్ధరాత్రి హల్చల్ చేశాడు. చేతిలో గొడ్డలి పట్టుకుని అర్ధనగ్నంగా వీధుల్లో తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేశాడు. సైకో వీరంగం స్థానికంగా ఉన్న సీసీ టీవీలో రికార్డు అయ్యింది. కాగా, తిరుపతిలోని ఎం.ఆర్.పల్లి పీఎస్ పరిధిలో శ్రీనగర్‌కాలనీలో ఓ సైకో అర్ధరాత్రి ఇనుప రాడ్డు పట్టుకుని హల్చల్ చేశాడు. అర్ధనగ్నంగా తిరుగుతూ నాలుగు ఇళ్ల తలుపులు, కిటికీలను బద్దలు కొట్టాడు. దీనికి సంబంధించిన ఫుటేజీ స్థానికంగా ఉన్న సీసీ టీవీల్లో రికార్డు అయ్యింది. దీంతో, రంగంలోకి దిగిన పోలీసులు.. అతడి కోసం గాలిస్తున్నారు. ఇక, కొద్దిరోజులుగా తిరుపతి పరిసర ప్రాంతాల్లో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేస్తున్న తరుణంలో ఇతను కూడా ఆ గ్యాంగ్‌కు చెందినవాడేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
రూ.500 డ్రా చేస్తే రూ.1100 ఇస్తున్న ఎటిఎం
-
ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు
సాక్షి, బంజారాహిల్స్ (హైదరాబాద్): ఆ జంటకు కాలనీవాసులే కళ్లయ్యారు.. స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు కాళ్లు కడిగి కన్యాదానం చేశారు.. మేం నడిపిస్తాం.. మీరు నడవండంటూ ఏడడుగులు నడిపించారు.. కళ్లు లేని వారంటే సమాజంలో చిన్న చూపుందనేది నాటిమాట.. కానీ నేటి సమాజానిది పెద్దచూపు.. ఆ కాలనీవాసులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల ముందు చూపు, పెద్ద మనసుతో కళ్లు లేని జంట పెళ్లిని కనులపండువగా నిర్వహించారు. పుట్టుకతోనే కళ్లులేని వారిని చేరదీసి వారిని పెంచి, పెద్ద చేసి చదివించి వారికి నచ్చిన రంగాల్లో శిక్షణ ఇప్పించి ఓ ఇంటివారిని చేస్తే అంతకు మించిన తృప్తి, ఆనందం ఇంకేముంటుంది చెప్పండి.. శ్రీనగర్‌కాలనీలోని కేశవనగర్ సరస్వతి విద్యామందిర్‌లో ఆకాశమంత పందిరిలో వేద మంత్రాల సాక్షిగా, కాలనీవాసుల ఆనందోత్సాహాల మధ్య ఆదివారం ఉదయం ఓ అంధ జంట ఒక్కటయ్యారు.. చిలుకూరు బాలాజీ టెంపుల్ అర్చకులు రంగరాజన్ చేతులమీదుగా జరిగిన ఈ వివాహానికి స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. చదవండి: గన్నీ బ్యాగులో మృతదేహం.. ఇంకా మిస్టరీలే! ► నిఖిల్, రాణి ఇద్దరూ పుట్టుకతోనే కళ్లు లేని వారు.. వారిని ఇట్రాయిడ్ అనే సంస్థ చేరదీసి ఇంటర్ వరకు చదివించింది. వీరికి వ్రిశాంక ఫైన్ ఆర్ట్స్ సంస్థ మ్యూజిక్‌లో, పాటలు పాడటంలో శిక్షణనిచ్చారు. నిఖిల్ సింగర్‌గా స్థిరపడ్డాడు. రాణి డిగ్రీ వరకు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతోంది. ► ఇద్దరూ చిన్నప్పటి నుంచి ఒకే స్కూల్లో ఒకే కాలేజీలో చదువుకుంటూ ఒకరిని ఒకరు ఇష్టపడటంతో పాటు పెళ్లి చేసుకునేందుకు నిశ్చయించారు. ఇదే విషయాన్ని ఇట్రాయిడ్ సంస్థ ఫౌండర్ మధుకర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ► వెంటనే వ్రిశాంక ఫైన్ ఆర్ట్స్ సంస్థ బంగారు లక్ష్మణ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీరిద్దరిని ఆదివారం రోజు ఒక్కటి చేశారు. వీరి పెళ్లి కేశవ్‌నగర్ కాలనీవాసులతో పాటు చాలామంది రకరకాలుగా సహాయ సహకారాలు అందించారని వ్రిశాంక ఫైన్ ఆర్ట్స్ సంస్థ ఫౌండర్ బంగారు కవిత తెలిపారు. ► పెళ్లి కోసం సుమారు రూ.4 లక్షల వరకు ఖర్చు చేసినట్లు వారు తెలిపారు. అంధుల పెళ్లి విషయాన్ని తెలుసుకొని తానే స్వయంగా వచ్చినట్లు చిలుకూరి బాలాజీ ప్రధాన అర్చకుడు రంగరాజన్ తెలిపారు. ► మ కాలనీలో జరుగుతున్న వివాహం గురించి తెలుసుకున్న ఆ కాలనీవాసులు తమ ఇంట్లో వారి వివాహంలో చేసినట్లుగా పెళ్లిలో కోలాహలంగా గడిపారు. వివాహం తర్వాత వారికి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. -
బెజవాడలో అర్ధరాత్రి అలజడి
సాక్షి, విజయవాడ: బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆకతాయిల అలజడితో స్థానికులు భయాందోళన చెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగంతకులను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. బైకులు, కార్లకు నిప్పు స్థానిక శ్రీనగర్ కాలనీలో బిల్డర్ శివశంకర్‌కు చెందిన కారుకు దుండగులు నిప్పుపెట్టారు. బైకుపై వచ్చిన ముగ్గురు ఆగంతకులు కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శివశంకర్ ఫిర్యాదు మేరకు సత్యనారాయణ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగ్ నగర్ శివాలయం వీధిలో జరిగిన మరో సంఘటనలో రెండు బైకులు, కారుకు దుండగులు నిప్పు పెట్టారు. బైకులు రెండు పూర్తిగా తగలబడిపోగా, కారు ముందు భాగం కాలిపోయింది. పెట్రోల్ దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
‘నీతో ఉండాలని మనసు కోరుకుంటోంది’
సాక్షి, హైదరాబాద్: సాఫ్ట్వేర్ ఇంజినీర్ తిరునగరి ప్రశాంత్ ఆత్మహత్యకు అతడి భార్య పావని కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు పావనిని అరెస్ట్ చేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్ 306 కింద (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కేసు నమోదు చేశారు. పైళ్లైన కొద్ది రోజుల తర్వాత తన భార్య వేముల ప్రణయ్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్రశాంత్ గుర్తించాడని పోలీసులు తెలిపారు. వారిని విడదీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు. కాగా, ప్రశాంత్, పావని మధ్య గతంలో జరిగిన ఫోన్ సంభాషణల ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రశాంత్ అంటే ఏమాత్రం, తనను వదిలేయాలని పావని చెబుతున్నట్టు ఆడియోలో స్పష్టంగా ఉంది. ప్రేమగా చూసుకుంటానని భర్త ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. చచ్చిపోతానని బెదిరించిన ఆమె భయపడలేదు. తనకు ప్రణయ్ ముఖ్యమని, భర్త కాదని తేల్చిచెప్పింది. (పరువుపోయింది.. చచ్చిపోతున్నా..) ఆడియోలో ఏముంది..? ‘నువ్వో పనికిరానివాడివి. నన్ను సరిగా చూసుకోలేదు. నీతో కలిసుండాలని నాకు లేదు. నన్ను డిస్టర్బ్ చేయకు. నువ్వు నాతో ఉండలేవు. నీ మీద నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నిన్ను వదిలి వెళ్లిపోతా. వెళ్లేటప్పుడు నీకు చెప్పే వెళ్లిపోతాను. పెళ్లికి ముందు ఎలా ఉన్నానో అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. అతడిని ఏమీ అనొద్దు. తప్పంతా నాదే. ఏదన్నా ఉంటే నన్ను అను. లేదంటే నిన్ను నువ్వు అనుకో. నన్ను నువ్వు పూర్తిగా అంగీకరించలేద’ని పావని పేర్కొంది. ‘నీతో ఉండాలని మనసు కోరుకుంటోంది. నువ్వంటే చచ్చేంత ప్రేమ నాకు. పెళ్లైన కొత్తలో ఎలా ఉన్నావో అలాగే ఉండు. ప్రణయ్‌ను నీ లైఫ్‌లోంచి తీసేయ్. అదొక్కటే కోరుకుంటున్నా. ప్రణయ్ మన మధ్య రావడం వల్లే నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతానంటున్నావు. ప్రణయ్ మన జీవితాన్ని నాశనం చేశాడు. దయచేసి వాడిని వదిలేయ్. నువ్వు కాదంటే చచ్చిపోతాన’ని ప్రశాంత్ భార్యను బతిమాలుకున్నట్టు ఆడియోలో రికార్డైంది. -
పరువుపోయింది.. చచ్చిపోతున్నా..
సాక్షి, హైదరాబాద్: వారిద్దరూ ప్రేమించి, పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వారి కాపురంలో అనుమానం చిచ్చు రేపింది. భార్యాభర్తల మధ్య దూరం పెరిగింది. అవమానం భరించలేక భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్‌లోని పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కామారెడ్డికి చెందిన తిరునగరి ప్రశాంత్ (34) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు. వరంగల్‌కు చెందిన పావనితో అతడికి 2014లో వివాహం జరిగింది. వీరు శ్రీనగర్‌కాలనీలోని పద్మజ మెన్షన్ అపార్ట్మెంట్ ఉంటున్నారు. ప్రశాంత్ గత కొద్ది రోజులుగా భార్యపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు జరిగినట్లు సమాచారం. ఆమె వైఖరిలో మార్పు రానందున ఆత్మహత్య చేసుకుటున్నట్లు సూసైడ్‌నోట్ రాసిన ప్రశాంత్ ఆదివారం బెడ్రూంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని తండ్రి లక్ష్మినర్సయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరువుపోయింది.. చచ్చిపోతున్నా.. ఆత్మహత్యకు వారం రోజుల ముందు తన బావతో ప్రశాంత్ ఫోన్లో మాట్లాడాడు. భార్య కారణంగా పరువుపోయిందని, ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నట్టు తన బావతో చెప్పాడు. తనకు మనశ్సాంతి లేకుండాపోయిందని, చచ్చిపోతేనే తనకు విముక్తి లభిస్తుందన్నాడు. ఆత్మహత్యకు పాల్పడవద్దని, చచ్చిపోయి సాధించేది ఏమి ఉండదని ప్రశాంత్ బావ నచ్చజెప్పారు. కావాలంటే విడాకులు తీసుకోవాలని సూచించారు. కోడలిని కఠినంగా శిక్షించాలి తమ కోడలు పావని కారణంగానే తమ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రశాంత్ తల్లిదండ్రులు ఆరోపించారు. అవమానాలు భరించలేక ప్రాణాలు తీసుకున్నాడని కన్నీరుమున్నీరయ్యారు. తమ కోడలిని చట్టప్రకారం కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. తోటి ఉద్యోగితో పావని వివాహేతరం సంబంధం పెట్టుకుందని, పద్ధతి మార్చుకోవాలని ప్రశాంత్ హితవు పలికినా ఆమె పట్టించుకోలేదని ఆరోపించారు. ఇక్కడి పంపిస్తే భార్య మనసు మారుతుందన్న ఉద్దేశంతో భార్యను మూడు రోజుల క్రితమే బెంగళూరులో ఉద్యోగంలో చేర్పించినట్టు వెల్లడించారు. అనుమానంతో హింసించాడు లేనిపోని అనుమానంతో ప్రశాంత్ తనను నిత్యం మానసికంగా, శారీరకంగా హింసించేవాడని పావని అంటోంది. అతడి చావుకు తాను కారణం కాదని తెలిపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
సెలూన్ పేరుతో వ్యభిచారం
హైదరాబాద్ : శ్రీనగర్ కాలనీలో వ్యభిచార స్థావరంపై వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మికదాడులు నిర్వహించారు. వి2 సెలూన్ పేరుతో నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు అమ్మాయిలను, నిర్వాహకుడు వెంకట్ రావు, కస్టమర్ లోకేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతులను కౌన్సెలింగ్ నిమిత్తం స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు స్థానిక సీఐ గట్టుమల్లు తెలిపారు. -
హైదరాబాద్‌లో కారు బీభత్సం.
-
హైదరాబాద్ లో రోడ్డు ప్రమాదం
హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీలో శనివారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఆర్టీసీ బస్సు నుంచి దిగుతున్న ఓ యువకుడు జారిపడి ప్రాణాలు విడిచాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్బీఐ క్వార్టర్స్ వద్ద వేగంగా వెళ్తున్న సిటీ బస్సు నుంచి రాజు అనే యువకుడు దిగడానికి ప్రయత్నించాడు. అదుపు తప్పి కిందపడిన అతని మీదుగా బస్సు చక్రం వెళ్లింది. దీంతో తీవ్రగాయాలపాలైన రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనాస్ధలికి చేరుకున్న పోలీసులు యువకుడి మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. -
శ్రీనగర్ కాలనీలో ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం
హైదరాబాద్: శ్రీనగర్ కాలనీలోని రత్నదీప్ సూపర్‌మార్కెట్ చౌరస్తాలో ట్రాఫిక్ జామ్‌లను నివారించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గురువారం పంజగుట్ట ట్రాఫిక్ ఏసీపీ మాసుంబాషా, బంజారాహిల్స్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ విద్యాసాగర్ రావు అక్కడ పర్యటించారు. నాలుగువైపులా కూడలి ఉండటంతో వాహనాలు ఇష్టమొచ్చినట్లు మళ్లుతున్నాయని దీని వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నట్లు గుర్తించారు. ఇందుకు పరిష్కారంగా ఇక్కడ టూ వే చేయాలని నిర్ణయించారు. శ్రీనగర్ కాలనీ వైపు నుంచి టీవీ 9 వైపు బంజారాహిల్స్‌కు వెళ్లే వాహనదారులు నేరుగా వెళ్లిపోవాల్సి ఉంటుంది. అలాగే, టీవీ9 వైపు నుంచి పెట్రోల్ బంక్ మీదుగా రత్నదీప్ సూపర్‌మార్కెట్ వైపు వెళ్లేందుకు వీలుపడదు. ఇటు వైపు వాహనాలను అనుమతించకుండా మధ్యలో డివైడర్‌ను ఏర్పాటు చేస్తారు. రత్నదీప్ వైపు వెళ్లేవారు శ్రీనగర్‌కాలనీ పార్కు వైపు నుంచి యూ టర్న్ తీసుకోవాల్సి ఉంటుంది. నాలుగు వైపులా వాహనాలను అనుమతించకుండా కేవలం రాకపోకలు మాత్రమే అనుమతించేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇలా చేస్తే ఇక్కడ ట్రాఫిక్ సమస్య పూర్తిగా తగ్గుముఖం పడుతుందని అధికారులు తెలిపారు. -
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
- బూర్గంపాడులో 20 సెం.మీ., భద్రాచలంలో 9 సెం.మీ. వర్షం సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా నగరంలో ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. రాత్రి 7 గంటల వరకు బాలానగర్‌లో 8.25 మిల్లీమీటర్లు, షేక్‌పేట్‌లో 7, రామచంద్రాపురంలో 6, జూబ్లీహిల్స్‌లో 6, గచ్చిబౌలిలో 5.5, మల్కాపూర్‌లో 5.5, నారాయణగూడలో 4.5, మాదాపూర్‌లో 5.5, శ్రీనగర్‌కాలనీలో 3.7, గోల్కొండలో 3 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అసలే గతుకుల మయంగా మారిన రహదారులపై వర్షపునీరు నిలిచి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. రాగల 24 గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది. బూర్గంపాడులో కుండపోత.. ఒడిశా నుంచి దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కదులుతుండటంతో గత 24 గంటల్లో రాష్ట్రంలోని అనేక చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా బూర్గంపాడులో అత్యధికంగా 20 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. అదే జిల్లా భద్రాచలంలో 9 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా బీర్కూర్‌లో డోర్నకల్, వర్నిలో 7, టేకులపల్లి, కోటగిరి, పాల్వంచ, గోవిందరావుపేట, దుమ్ముగూడెం, రంజల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. సోమవారం నుంచి నాలుగు రోజులపాటు ఒక మోస్తరు నుంచి సాధారణ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. -
త్రీడీ స్కానర్‌తో ఏటీఎం చోరీ చేస్తూ..
-
త్రీడీ స్కానర్‌తో ఏటీఎం చోరీ చేస్తూ..
బంజారాహిల్స్: శ్రీనగర్‌కాలనీలోని పంజాబ్ నేషనల్ బ్యాంకు ఏటీఎంలోని డాటాను దొంగిలించేందుకు యత్నిస్తూ ఇద్దరు ఉన్నత విద్యావంతులు పోలీసులకు చిక్కారు. బంజారాహిల్స్ పోలీసుల కథనం ప్రకారం... విజయవాడ గాయత్రినగర్‌కు చెందిన యండ్రపల్లి ఆదిత్య(24) బీబీఏ.., విజయవాడ నెహ్రూనగర్‌కు చెందిన తెల్లా సతీష్(29) బీటెక్ పూర్తి చేశారు. బేగంపేట కుందన్ బాగ్‌లో ఫ్లాట్ అద్దెకు తీసుకొని ఉంటున్న వీరిద్దరూ ఈనెల 4న శాలివాహననగర్ ఆర్బీఐ క్వార్టర్స్ దగ్గర ఉన్న పంజాబ్ నేషనల్ బ్యాంకులోకి ప్రవేశించి తమ వద్దనున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఏటీఎంలోని డాటాను సేకరించేందుకు యత్నిస్తుండగా సెక్యూరిటీ గార్డ్ గమనించడంతో పరారయ్యారు. సీసీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఆదిత్య, సతీష్‌లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి ల్యాప్‌టాప్, ఐపాడ్, త్రీడీ స్కానర్,రిఫ్లెక్టివ్ షీట్, మొబైల్ ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీరిద్దరూ ఏటీఎం సెంటర్లోకి ప్రవేశించి క్లోన్డ్ ఏటీఎం కార్డులు వినియోగించి డబ్బు డ్రా చేశారు. ఈ కేసులో 2014 జూన్ లో పోలీసులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. జైలు నుంచి బయటకు వచ్చాక వీరు మళ్లీ పాత దందానే కొనసాగిస్తున్నారు. ఏటీఎం కార్డులు క్లోనింగ్ చేస్తూ త్రీడీ స్కానర్‌తో డాటా క్యాప్చర్ చేసి డబ్బు డ్రా చేస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంకులో కూడా ఈ తరహాలోనే డాటా చోరీకి యత్నిస్తూ పట్టుబడ్డారు. గతంలో వీరిపై చైతన్యపురి, బేగంపేట, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. -
నిశ్చితార్థం తర్వాత మోసం చేసిన ఎన్ఆర్ఐ
బంజారాహిల్స్: నిశ్చితార్థం చేసుకొని.. పెళ్లి ముహూర్తం పెట్టుకున్న ఓ ఎన్ఆర్ఐ ఇంతలో తనకు ఈ వివాహం ఇష్టం లేదని ప్లేటు ఫిరాయిం చాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆ ప్రబుద్ధుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో నివాసముండే యువతికి ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేస్తున్న వరుణ్‌తో పెళ్లి నిశ్చితార్థం జరిగింది. ఈ ఏడాది నవంబర్ 26న పెళ్లి జరిపించేందుకు ముహూర్తం కూడా పెట్టుకున్నారు. అయితే గతేడాది డిసెంబర్ 27 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 6వ తేదీ వరకు వరుణ్ కాబోయే భార్యతో చాటింగ్ చేసేవాడు. ఫొటోలు కూడా షేర్ చేసేవాడు. అయితే ఇటీవలే అకస్మాత్తుగా వరుణ్ ఆమెతో మాటలు బంద్ చేశాడు. ఎన్నోసార్లు ఆమె ఫోన్లో మాట్లాడేందుకు ప్రయత్నించగా.. ‘‘నీ ప్రవర్తన మం చిది కాదని ఓ వ్యక్తి ఫోన్ చేసి చెప్పాడు. రూ.20 లక్షలు అదనపు కట్నం కావాలి’’ అని షరతు పెట్టాడు. చివరకు తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని, అంతేకాకుండా అమ్మాయి చాలా అడ్వాన్స్‌గా ఉందంటూ మరో ప్రచా రం మొదలుపెట్టాడు. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా వరుణ్‌తో పాటు తల్లి పూర్ణిమ, తండ్రి వినోద్‌కుమార్‌లపై ఐపీసీ సెక్షన్ 417 కింద క్రిమినల్ కేసు నమోదు చేశారు. -
బొటిక్ ప్రారంభించిన సీనీ తారలు
-
మంత్రి చెబితే మాకేంటి?
కేటీఆర్ స్వయంగా పరిశీలించినా.. మారని శ్రీనగర్ కాలనీ రహదారి దుస్థితి మంత్రి అయితే మాకేంటి? అనుకున్నారో...ఇది మా పని కాదనుకున్నారో...మళ్లీ వచ్చి మంత్రి చూడరులే అనుకున్నారో గానీ శ్రీనగర్‌కాలనీ రోడ్డు దుస్థితి, పారిశుధ్య లోపంలో ఏమాత్రం మార్పు రాలేదు. ఈ నెల 13న మంత్రి కేటీర్ ఈ ప్రాంతంలో పర్యటించి స్వయంగా అధికారులకు చివాట్లు పెట్టారు. అడ్డగోలుగా తవ్విన రోడ్లు.. మట్టి, బురదతో నిండిపోయిన ఫుట్‌పాత్‌లు, డ్రెయినేజీల దుర్గంధం, మ్యాన్‌హోళ్ల లీకేజీలతో దుర్వాసనతో అధ్వానంగా మారిన శ్రీనగర్ కాలనీ ప్రధాన రోడ్డును ఎందుకు పట్టించుకోవడం లేదని మంత్రి నిలదీశారు. ప్రతి సమస్య గురించి కమిషనర్, మేయర్, మంత్రి వచ్చి చెప్పాలా అంటూ సంబంధిత అధికారులు, కాంట్రాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో స్థానికులు ఆనందపడ్డారు. స్వయంగా మంత్రిగారే పర్యటించారు కాబట్టి ఇక శ్రీనగర్ కాలనీ రోడ్ల దుస్థితి మారుతుందని ఆశించారు. వెంటనే పనులు మొదలవుతాయని భావించారు. కానీ మంత్రి పర్యటించి రెండు వారాలు దాటినా ఇక్కడ పరిస్థితి ఏమాత్రం మారలేదు కదా..వర్షాల కారణంగా మరింత అధ్వానంగా మారింది. కనీసం నడవడానికి కూడా వీల్లేని స్థితిలో రోడ్డంతా బురదమయం అయింది. డ్రైనేజీ మురుగునీరు కంపుకొడుతున్నది. వరద, మురుగునీరు తిష్టవేసి దుర్గంధం పేరుకుపోయి స్థానికులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. మేయర్, కమిషనర్, సెంట్రల్ జోనల్ కమిషనర్, డీఎంసీలు... ఇలా అంతా ఆ రోజు మంత్రి వెంట వచ్చారు. మంత్రి ఆదేశించిన తర్వాత రోడ్డు బాగు పడిందా లేదా అన్నదానిపై ఇప్పటిదాకా వారూ సమీక్షజరిపిన పాపాన పోలేదు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని మంత్రి ఒక వైపు ప్రకటనలు చేస్తుంటే అధికారులు, ప్రజాప్రతినిధులు మాత్రం నిర్లక్ష్యం వహిస్తున్నారన్న విమర్శలు విన్పిస్తున్నాయి. - బంజారాహిల్స్ -
రోడ్ల నిర్మాణంలో సమూల మార్పులు
నగర రోడ్ల విషయంలో మూస పద్ధతులు మానాలి: కేటీఆర్ అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలి ముఖ్య శాఖలతో 16న జరిగే వర్క్‌షాప్‌లో కీలక నిర్ణయాలు సాక్షి, హైదరాబాద్: నగర రోడ్లు ప్రపంచస్థాయిలో ఉండాలంటే మూస పద్ధతులు మాని విప్లవాత్మక చర్యలు తీసుకోవాల్సి ఉందని మున్సిపల్ మంత్రి కేటీ రామారావు అన్నారు. దీనికోసం అవసరమైతే జీహెచ్ఎంసీ బైలాస్, రహదారుల నిర్వహణ మార్గదర్శకాలు మార్చేందుకైనా సిద్ధమన్నారు. శ్రీనగర్‌కాలనీ, యూసుఫ్‌గూడ, గాజులరామారం, షాపూర్, బాలానగర్ తదితర ప్రాంతాల్లో పర్యటించిన ఆయన రహదారుల పరిస్థితిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఆదివారం స్వయంగా కారు నడుపుకుంటూ రెండు గంటలపాటు ఆయా రోడ్లపై తిరిగిన తాను రోడ్లు బాగాలేనందునే ఇవాళ(సోమవారం) అధికారులతో కలసి పర్యటించానని చెప్పారు. రోడ్ల పరిస్థితిపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ.. పనితీరు ఇంకా మెరుగు పడాలని అన్నారు. కీలక విభాగాల మధ్య సమన్వయ లోపం ఉండకూడదని అన్నారు. నాలుగు వర్షపు చినుకులకే రోడ్లు గుంతలు పడటం, వాటిని పూడ్చేందుకు ప్యాచ్‌వర్క్‌లకు కోట్లు ఖర్చవుతున్నప్పటికీ ఎగుడుదిగుళ్లు ఏర్పడుతున్నాయన్నారు. కొన్ని మ్యాన్‌హోళ్లు రోడ్లకంటే పైకి, కొన్ని దిగువకు వెళ్లడం జరుగుతున్నాయన్నారు. రోడ్ల నిర్మాణంలో మూస పద్ధతులు మాని సమూల మార్పులు తేవాల్సి ఉందన్నారు. సమన్వయం పెరగాలి.. వివిధ విభాగాల మధ్య సమన్వయం కోసం జాయింట్ వర్కింగ్ గ్రూపులు పనిచేయాలని గతంలోనే చెప్పానని, జోనల్‌స్థాయి వరకు అవి ఏర్పాటైనప్పటికీ, సర్కిల్ స్థాయిలో ఇంకా ఏర్పాటు కాలేదన్నారు. విద్యుత్ , జలమండలి, రహదారులు తదితర విభాగాలన్నీ కలసి పనిచేయాలన్నారు. అన్ని శాఖలు, సర్వీస్ ప్రొవైడర్లు సమన్వయంతో పనిచేస్తే సమస్యలు రావంటూ అందుకుగాను ఈనెల 16న అన్ని ముఖ్య శాఖలతో వర్క్‌షాప్ నిర్వహించనున్నామని, అందులో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలిపారు. మంచి రహదారుల కోసం అవసరమైతే చట్ట సవరణ చేస్తామన్నారు. అక్రమార్కులను వదిలి పెట్టం.... బీఆర్ఎస్ గడువు తర్వాత అక్రమ నిర్మాణాలు జరిపేవారిని వదిలిపెట్టబోమని, క్రిమిన ల్ కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. గుర్తించిన భవనాల కూల్చివేతలూ జరుగుతున్నాయన్నారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేయకుంటే అధికారులపైనా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వంద రోజుల ప్రణాళిక పనుల్ని 15న వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో మేయర్ రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సీసీలతోనే శాశ్వత పరిష్కారం.. రోడ్ల సమస్యలకు వైట్ టాపింగ్, సీసీలతోనే శాశ్వత పరిష్కారమైనప్పటికీ, వ్యయం, ఇతరత్రా కొన్ని ఇబ్బందుల వల్ల చేపట్టలేదని చెబుతూ, మున్ముందు ప్రయత్నిస్తామన్నారు. రహదారులు బాగుండేందుకు నగరాన్ని కొన్ని భాగాలుగా విభజించి రోడ్ల పనులు చేసే కాంట్రాక్టర్లకే వార్షిక నిర్వహణ కూడా అప్పగించే ఆలోచన చేస్తున్నామన్నారు. 15 రోజుల్లో రోడ్ల మధ్య ఉన్న విద్యుత్ స్తంభాల సమస్యకు పరిష్కార మార్గాలు చేపడతామన్నారు. -
శ్రీనగర్ కాలనీలో డ్రంకెన్‌డ్రైవ్
హైదరాబాద్ : మద్యం సేవించి వాహనాలను నడుపుతున్న వారిపై పోలీసులు నిఘా పెంచారు. శనివారం రాత్రి నగరంలోని బంజారాహిల్స్ శ్రీనగర్ కాలనీ ప్రాంతంలో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. మద్యం మత్తులో వాహనాలను నడుపుతున్న 21 మంది మందుబాబులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ దాడుల్లో 6 కార్లు, 15 బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. దూద్‌బావిలో కార్డెన్ సెర్చ్ దక్షిణ మండల డీసీపీ ప్రకాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం రాత్రి చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూద్‌బావిలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. సుమారు 200 మంది పోలీసులు పాల్గొన్న ఈ సెర్చ్‌లో నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. సరైన పత్రాలు లేని 7 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. -
నేత్రపర్వం.. గజారోహణం
-
హైదరాబాద్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్
-
శ్రీనగర్ కాలనీలో అగ్నిప్రమాదం..
హైదరాబాద్: నగరంలోని శ్రీనగర్ కాలనీ ఉషా ఎన్‌క్లేవ్‌లో సోమవారం అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు భారీ ఎత్తున ఎగసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పుతున్నట్టు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
అక్రమ నిర్మాణాలు తొలగింపు
హైదరాబాద్: నగరంలో శ్రీనగర్ కాలనీ ప్రధాన రహదారిలో దేవాదాయశాఖ స్థలంలో ఉన్న అక్రమ నిర్మాణాలను మంగళవారం దేవాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పోలీసు బందోబస్తు మధ్య నేలమట్టం చేశారు. గత 35 సంవత్సరాలుగా ఓ వ్యాపారి ఈ ఆలయ స్థలాన్ని కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టి సంబంధిత అధికారులకు కొరక రాని కొయ్యగా తయారయ్యాడు. కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న దేవాదాయ శాఖ అధికారులు బంజారాహిల్స్ పోలీసుల సహాయంతో అక్రమంగా నిర్మించిన కూరగాయల దుకాణాన్ని తొలగించారు. ఆక్రమణను కూల్చివేసే సమయంలో కబ్జాదారులు తీవ్రంగా ప్రతిఘటించారు. పలువురు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. ఈ స్థలం ఆలయానికి సంబంధించినదని, అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్నామని శ్రీనగర్ కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఈవో బాలాజీ తెలిపారు. మూడు గంటల పాటు ఈ కూల్చివేత పనులు చేపట్టారు. కూరగాయల దుకాణం తొలగించిన ప్రాంతంలో వెంటనే సెక్యూరిటీ గార్డును ఏర్పాటు చేస్తామని ఈవో బాలాజీ తెలిపారు. ఈ స్థలం దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇక నుంచి ఇక్కడ తమ పర్యవేక్షణ ఉంటుందని, కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ స్థలాన్ని ప్రజాపయోజన కార్యక్రమాలకు వినియోగించాలని శ్రీనగర్ కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు. -
ఆశ్రయ్ ఆకృతి ఆధ్వర్యంలో..
-
హైదరాబాద్‌వాసికి ఎబోలా లక్షణాలు?
-
మగువ అందానికి మోడరన్ లుక్
మగువ అందానికి మరిన్ని వన్నెలద్దే విభిన్న వస్త్రాభరణాల కలెక్షన్ ‘ఎలిగెన్స్ షాపి’ శ్రీనగర్‌కాలనీ సత్యసాయి నిగమాగమంలో సోమవారం ప్రారంభమైంది. టాలీవుడ్ భామ అలేఖ్య మోడరన్ డ్రెస్‌లో మురిపించింది.ఆధునిక, సంప్రదాయ ఉత్పత్తుల మేళవింపుతో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనలో దేశంలోని ప్రముఖ నగరాల లేటెస్ట్ ఫ్యాషన్స్ ఆకట్టుకొంటున్నాయి. దీపావళి స్పెషల్ ఐటెమ్స్ స్పెషల్ ఎట్రాక్షన్. మంగళవారం కూడా ప్రదర్శన కొనసాగుతుంది. సాక్షి, సిటీప్లస్ -
వస్త్రవిభ
మహిళలకు చీరకట్టే అసలైన అందాన్నిస్తుంద ంటున్నారు నటి జయసుధ. శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో వస్త్రవిభ పేరిట శనివారం ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. సోమవారం వరకు సాగే ఈ ఎక్స్‌పోలో దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన 80 మంది మాస్టర్‌వీవర్స్ ఉత్పత్తులు కొలువుదీరాయి. పట్టు, కాటన్, సిల్క్, డిజైనరీ డ్రెస్ మెటీరియల్స్, యాక్ససరీస్ అందరినీ ఆకర్షిస్తున్నాయి. త్వరలోనే బోటిక్.. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బతుకమ్మ ఆడానన్నారు జయసుధ. తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఆటపాటల్లో ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు. అన్ని రకాల చీరలను ఇష్టపడతానన్న ఈ సహజనటి.. మనసుకు నచ్చిన చీర దొరికితే వెంటనే కొనేస్తానంటున్నారు. త్వరలో నగరంలో ఓ బోటిక్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. దసరా కానుకగా రానున్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో మంచి పాత్ర పోషించానని తెలిపారు. తను నటిస్తున్న మరిన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయని చెప్పుకొచ్చారు జయసుధ. -
ఫెయిరీ టేల్.. అర్చన
అర్చన, వేద.. పేరేదైనా ఆ అందం వెండితెరకు సుపరిచితమే. ఒకప్పుడు పచ్చదనంతో నిండుగా ఉన్న నగరం ఆమెకు పరిచితమే. గతంలో శ్రీనగర్ కాలనీలోని గుట్టలు, పూలు, పండ్ల బుట్టలు చూసిన వేద మనసు ఇప్పుడు అక్కడి కాంక్రీట్ జంగిల్‌ను చూసి దిగులు పడుతుంటుంది. తాతయ్య ఇంటికి వె ళ్లేదారిలో కూలిన హవేలీని చూసి గుండె గాయం చేసుకుంటుంది. మసక వెలుతురులో బుర్ఖాలో వెళ్లి చార్మినార్ అందాన్ని చూసి ఆనందిస్తుంది. హైదరాబాద్‌లో తన జీవితం ఫెయిరీ టేల్ లాంటిదంటున్న అర్చనకు నగరంతో ఉన్న అనుబంధం.. నా చిన్నతనంలో సిటీ ఎంతో బ్యూటీగా ఉండేది. నా స్కూలింగ్ అంతా జూబ్లీహిల్స్ భారతీయ విద్యా భవన్‌లోనే సాగింది. అమ్మ క్లాసికల్ డ్యాన్సర్. నాకు డ్యాన్ ్స అంటే ఇష్టం ఉండేది కాదు. ఏడో తరగతిలో అనుకుంటా.. స్కూల్ కల్చరల్ ఈవెంట్స్ కోసం అమ్మ డ్యాన్స్ నేర్పిస్తే ఏదో చేశాను. అందరూ మెచ్చుకున్నారు. ఆ ప్రశంసలే నాలో డ్యాన్స్‌పై ఆసక్తి కలిగించాయి. అప్పుడు పట్టుకున్న డ్యాన్స్‌ను ఇప్పటికీ వదల్లేదు.. ఎప్పటికీ వదలను. కూలిన కోట మా తాతయ్య వాళ్ల ఇల్లు బషీర్‌బాగ్‌లో ఉండేది. అక్కడికి శ్రీనగర్ కాలనీ మీదుగా తరచూ వెళ్లేదాన్ని. అప్పటి శ్రీనగర్ కాలనీ అంటే పెద్దపెద్ద బండరాళ్లు, మట్టి రోడ్డు, అక్కడక్కడా ఫ్రూట్ జ్యూస్ బండ్లు, జాంపళ్లు, పూల బుట్టలు ఉండేవి. ఇప్పుడు బిల్డింగ్స్ తప్ప ఏమీ లేవు. అపార్ట్మెంట్స్ బాగా పెరిగిపోయాయి. అపార్ట్మెంట్ కల్చర్ అస్సలు నచ్చని విషయం. బషీర్‌బాగ్‌లో పెద్ద హవేలీ ఉండేది. అది రాజుల కథల్లో పెద్ద కోటలాగా అనిపించేది. ఇప్పుడటు వెళ్తే కూలిన ఆ జ్ఞాపకం బాధిస్తుంటుంది. నిజామీ రిచ్‌నెస్... హైదరాబాద్‌లో షాపింగ్ చాలా ఇష్టం. చార్మినార్ దగ్గర కొత్తగా వచ్చిన ఏ బ్యాంగిల్నూ వదిలిపెట్టను. నా దగ్గర బ్యాంగిల్ ్స కలె క్షన్ చాలా ఉంది. ఇక కాశ్మీరీ శాలువాలు అంటే చాలా ఇష్టం. నిజామీ కల్చర్‌లో ఓ రిచ్‌నెస్ ఉంది. అందుకే ట్రెడిషనల్ హైదరాబాదీ ఆభరణాలన్నీ ఇష్టమే. చిన్నప్పుడు ఇంట్లో చెప్పకుండా ఫ్రెండ్స్‌తో కలసి చార్మినార్ వెళ్లేదాన్ని. ఇప్పుడు జనం గుర్తు పట్టకుండా బుర్ఖా వేసుకుని వెళ్తుంటాను. ఫుడ్ అదుర్స్.. హైదరాబాదీ ఫుడ్ అంటే లొట్టలేసుకుంటూ తింటా. చార్మినార్ దగ్గర స్ట్రీట్ ఫుడ్ చాలా ఇష్టం. చార్మినార్ ఎదురుగా బండిపై దొరికే చీజ్ దోశ సూపర్బ్‌గా ఉంటుంది. వర్షాకాలంలో పానీ పూరీ, మహారాజా చాట్ చాలా ఇష్టం. పూర్ణ టిఫిన్ సెంటర్లో పూరీ, దోశ చాలా టేస్టీగా ఉంటాయి. అందుకే ఇప్పటికీ.. నగరం నిద్ర లేవకముందే.. అక్కడికి వెళ్లిపోయి కారులో కూర్చునే టిఫిన్ చేస్తుంటాను. ప్రత్యామ్నాయాలు వెతుకుతాను కానీ.., ఇష్టాన్ని వదులుకోను. నుమాయిష్‌లో కర్రీపప్స్.. నాంపల్లి ఎగ్జిబిషన్ చాలా ఇష్టం. చిన్నప్పుడు ఫ్రెండ్స్‌తో వెళ్లేదాన్ని. అక్కడ కర్రీపప్స్ స్పెషల్. అవి ఇక్కడ దొరకవు. వాటి టేస్ట్ సూపర్. ఇప్పటికీ దొంగచాటుగా వెళ్లి టేస్ట్ చేస్తుంటా. అక్కడ చెరకు రసం కూడా చాలా బాగుంటుంది. చరిత్రాత్మక ప్రాంతాల్లో ట్రావెలింగ్ ఇష్టం. అడుగడుగునా చరిత్రాత్మకత నింపుకున్న హైదరాబాద్ అంటే మరీ ఇష్టం. అనుకోని మలుపు.. డిగ్రీ చదువుతున్నప్పుడు ‘నేను’ సినిమాకు హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నట్టు ఓ ఫ్రెండ్ ద్వారా తెలిసింది. ఫొటోస్ అయితే పంపించాను. ఎలాంటి అంచనాలు లేవు. హీరోయిన్ అయిపోయాను. చదువు, ఫ్రెండ్స్, ఫ్యామిలీ తప్ప ఓ ల క్ష్యం అంటూ లేని నా జీవితంలో అనుకోని మలుపు అది. నాకు అమ్మానాన్న ఇద్దరి సపోర్ట్ ఉంది. మూవీ హిట్టయినా, ఫ్లాప్ అయినా.. నేను స్థిరంగా ఉండటానికి పేరెంట్సే కారణం. చారిటీ కాదు.. బాధ వచ్చినా, సంతోషం వచ్చినా.. బసవతారకం హాస్పిటల్ దగ్గర చికిత్స కోసం వచ్చిన రోగుల బంధువులకు, అమీర్‌పేట్ దుర్గ గుడి దగ్గర ఉన్న పేదలకు అన్నదానం చేయడం అలవాటు. ఇదేదో చారిటీ అనుకోవట్లేదు. నా ఆత్మ సంతృప్తి కోసం.. అంతే. - శిరీష చల్లపల్లి -
మనసంతా వ్యధే!
=కలచివేసిన ఉదయ్‌కిరణ్ ఉదంతం =వెండితెర మాటున చీకటి కోణాలు =సక్సెస్ అయితే ఓకే.. లేదంటే షాక్ =రంగుల కలలు కల్లలై విషాదాంతాలు సాక్షి, సిటీబ్యూరో: సినీ నటుడు ఉదయ్‌కిరణ్ అర్ధంతరంగా తనువు చాలించిన వైనం దిగ్భ్రాంతికి గురిచేసింది. నగరంలోని వెస్లీ కాలేజీలో చదువుకున్న ఆయనకు నగరంతో విడదీయరాని అనుబంధం ఉంది. సోమవారం ఉదయం అటు ఉస్మానియా మార్చరీ వద్ద, ఇటు నివాసం ఉన్న శ్రీనగర్ కాలనీ లోనూ, మృతదేహాన్ని ఉంచిన నిమ్స్ వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. ఉదయ్‌కిరణ్ తక్కువ కాలంలోనే ‘తార’స్థాయికి ఎదిగి, అంతలోనే జీవితాన్ని అర్ధాంతరంగా ముగించిన తీరు అభిమానుల్ని షాక్‌కు గురిచేసింది. వెలుగులు విరజిమ్మే వెండితెర మాటున దాగిన మరో కోణాన్ని ఈ ఉదంతం వెలుగులోకి తెచ్చింది. ఊహించని విధంగా తారస్థాయికి చేర్చిన స్టార్డమ్.. ఒక ట్రెండు కుదుపులతో కుదేలైన కెరీర్.. దీంతో దారుణమైన క్షోభ నటులను ఎలా వెంటాడుతుందో అనేందుకు ఉదయ్‌కిరణ్ ఉదంతమే నిదర్శనం. సినిమాల్లో నటించినా, సాంకేతిక ఇతర విభాగంలో పని చేసినా.. అందులో సక్సెస్ అయితే స్టార్ స్టేటస్ వచ్చిపడుతోంది. దీంతోపాటే విలాసవంతమైన జీవితం, ప్రత్యేకమైన ఇమేజ్, హంగూ ఆర్బాటాలు, పేజ్-3 పార్టీలు.. ఇలా ఖరీదైన జీవనశైలి అలవడుతోంది. మరో లోకంలో విహరింపచేస్తున్న ఈ తరహా ఇమేజ్ నుంచి బయటకు రావడం కష్టమే. ఇదిలాగే కొనసాగినంత కాలం ఏ సమస్యా లేదు.. ఎటొచ్చీ సినీ రంగంలో సక్సెస్ రేట్లో తేడా వస్తే ఒక్కసారిగా వర్ధమాన తారల కలలన్నీ కల్లలవుతున్నాయి. తీవ్ర డిప్రెషన్‌కు లోనై అందులోంచి బయటపడలేక పోతున్నారు. ఫలితంగా విషాదంతో తమ వెండితెర జీవితానికి వీడ్కోలు పలుకుతున్నారు. ఇమేజ్ నుంచి బయటపడలేక.. సినీ ప్రపంచంలో ఓసారి ఓ వెలుగు వెలిగిన వారెవరైనా ఫేమ్‌కు బానిసలుగా మారతారు. అది లేకుంటే బతకలేమన్న స్థితికి వచ్చేస్తారు. అందుకోసం దేనికైనా సిద్ధపడతారు. సినీ పరిశ్రమ కొందరి చేతుల్లో ఉందనే వాదన బలంగా ఉంది. వీరి ‘ఆశీర్వాదం’ ఉంటేనే ఆ రంగంలో రాణించడం, లేదంటే అవకాశాల కోసం వెతుక్కోవడం పరిపాటిగా మారింది. ఈ కారణాలతోనూ పలువురు నటులు సర్వం కోల్పోయి తీవ్రమైన నిరాశకు లోనవుతున్నారు. ఈ పరిస్థితుల్లోనే అయితే అర్ధంతరంగా తనువు చాలించడం.. లేదంటే పెడదార్లు పట్టడం చేస్తున్నారు. అవకాశాల కోసం విసిగి వేసారి ఆవేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. మొన్నటికి మొన్న ఇష్టం దర్శకుడు రాజ్ ఆదిత్య, తాజాగా సినీ హీరో ఉదయ్‌కిరణ్ అర్ధంతరంగా తనువు చాలించిన తీరు అభిమానుల్ని కలచివేసింది. పరిస్థితులు తల్లకిందులైతే.. వృత్తి నిబద్ధత, నిరాడంబరత, క్రమశిక్షణ... ఇవన్నీ ఒకప్పుడు సినీ రంగ ప్రముఖులకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవి. ఇది రంగుల ప్రపంచంలోని ఒక కోణం. మరో కోణం చూస్తే... పరిశ్రమలో మనుగడ నీటి మీద బుడగలా మారింది. క్లిక్ అయితే స్టార్డమ్, ఇబ్బడి ముబ్బడి సంపాదన.. ఈక్రమంలో తీసుకునే నిర్ణయమే విషాదాలకు కారణమవుతోంది. కొందరు కుటుంబ పోషణతో పాటు బతుకు బండిని ఈడ్చడం సైతం భారంగా మారి, ఆ రంగాన్ని పూర్తిగా వదిలి బయటకు రాలేక జీవితానికి తెర వేసుకుంటుంటే, ఇంకొందరు పెడదారులు పడుతున్నారు. ఉదాహరణలెన్నో... నియంత్రణ పదార్థాల జాబితాలో ఉన్న ఎఫిడ్రిన్‌ను అక్రమ రవాణా చేస్తూ సినీ నిర్మాత కామిని వెంకటేశ్వరరావు సైబరాబాద్ పోలీసులకు పట్టుబడ్డారు. కురియన్ టోనీ జాకబ్ అసిస్టెంట్ కెమెరామన్‌గా జీవితం ప్రారంభించి 2006లో హఠాత్తుగా ఫిల్మ్ ఫైనాన్షియర్ అవతారం ఎత్తాడు. ‘ఆప్తుడు’ చిత్రానికి పెట్టుబడి పెట్టి నిండా మునిగాడు. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడటానికి హైటెక్ సెక్స్ రాకెట్ నిర్వహించడం ప్రారంభించి పోలీసులకు చిక్కాడు. తలనొప్పి మందుల తయారీకి వినియోగించే రసాయనమైన నారాథ్రెఫ్టాన్ను బ్రౌన్షుగర్గా నమ్మించి విక్రయించడానికి ప్రయత్నించిన సినీ నిర్మాత హేమంత్ రామకృష్ణతో సహా ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయన ‘యువత’ అనే చిత్రాన్ని నిర్మించి దాదాపు రూ.1.5 కోట్లు నష్టపోయి ఈ బాట పట్టాడు. పబ్ కల్చర్‌తో విలాసాలకు అలవాటు పడి కొకైన్కు బానిసగా మారిన సినీ నటుడు రఘు, భరత్‌లు నైజీరియన్ నుంచి ఆ డ్రగ్ కొనుగోలు చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కారు. టాస్క్‌ఫోర్స్ పోలీసులు పట్టుకున్న ఓ వ్యభిచార ముఠాలోని వర్ధమాన తారలు, నిర్వాహకులు సినిమా అవకాశాలు లేకో, నష్టాలతో ఈ బాటలోకి వచ్చిన వారే. ఇష్టం చిత్ర దర్శకుడు రాజ్ ఆదిత్య సైతం తీవ్ర మానసిక వేదనతోనే సికింద్రాబాద్‌లోని హోటల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. -
శ్రీనగర్‌లో కురుస్తున్న మంచువాన
-
కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం
-
కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం
హైదరాబాద్ : హైదరాబాద్ ఎస్ఆర్ నగర్లో రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబం ఆత్మహత్యాయత్నం కేసులో కొత్త కోణం వెలుగు చూసింది. ఆర్థిక ఇబ్బందులే కారణమని మొదట అందరూ భావించినా.. ఆత్మహత్యల యత్నానికి మరో కారణం ఉందని ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లాడ్జ్‌లో దొరికిన సూసైడ్‌నోట్‌లో ఆత్మహత్యలకు నలుగురు వ్యక్తులు కారణమని.. తమ కుటుంబాన్ని మోసం చేసి ఆర్ధిక ఇబ్బందులకు గురిచేశారని ఉంది. దీంతో ఎస్ఆర్నగర్ పోలీసులు కుమార్ చౌదరి, మంజీలాల్ గాంధీలతో పాటు రవి, లలిత అనే మరో ఇద్దరు దంపతులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం లావణ్య, ఆమె ముగ్గురు పిల్లలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనగర్ కాలనీకి చెందిన అనిల్‌కుమార్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి తన కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేసిన విషయం తెలిసిందే. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నిద్ర మాత్రలు మింగాడు. ఆయన మృతి చెందగా, భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. -
రియల్టర్ కుటుంబం ఆత్మహత్యాయత్నం
= యాజమాని అక్కడికక్కడే మృతి = భార్య పరిస్థితి విషమం =నిలకడగా చిన్నారుల ఆరోగ్యం సంజీవరెడ్డినగర్, న్యూస్‌లైన్ : రియల్ ఎస్టేట్ వ్యాపారి కుటుంబ సభ్యులతో కలిసి లాడ్జిలో ఆత్మహత్యాయత్నం చేశాడు. భార్య, ముగ్గురు పిల్లలతో కలిసి నిద్ర మాత్రలు మింగాడు. ఆయన మృతి చెందగా, భార్య పరిస్థితి ఆందోళన కరంగా ఉంది. పిల్లల ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. సంజీవరెడ్డినగర్ నగర్‌పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం ఈ ఘటన వెలుగుచూసింది. ఎస్సై సుదర్శణ్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. శ్రీనగర్ కాలనీలో నివసించే అనిల్‌కుమార్(45)భార్య లావణ్య దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. అలేఖ్య,అకిల, ఆకాశలు. స్థానికంగా ఉన్న ప్రైవేటు సంస్థల్లో చదువుకుంటున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసే అనిల్‌కుమార్‌కు స్థానికంగా సొంత ఇల్లు ఉంది. రియల్ ఎస్టేట్ వ్యాపారం భాగా నడిచిన సమయంలో తెలిసిన వ్యక్తుల వద్ద డబ్బులు తీసుకుని చాలావరకు పెట్టుబడులు పెట్టినట్లు తెలిసింది .ఇటీవల ఈ రం గం నిలకడగా సాగడంతో పెట్టిన పెట్టుబడు లు అలాగే ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. అంతేకాకుండా డబ్బులు ఇచ్చిన వ్యక్తులు డబ్బులు తిరిగి ఇవ్వాలని వెంటపడుతున్నారు. ఈ క్రమంలో అనిల్ కొద్దిరోజులనుండి ఇబ్బందులు పడ్డాడు. ఇక భరించలేక జీవితంపై విరక్తిచెంది ఉండవచ్చు. ఈ క్రమంలో నవంబరు 25న కుటుంబ సభ్యులతో కలిసి యూసుఫ్‌గూడలో ఉన్న హోటల్ మార్గిలో దిగాడు. రూం నంబర్ 308లో ఉంటున్న అనిల్ కుటుంబం 28 తేదీ ఉదయం టిఫిన్ తెప్పించుకుని తిన్నారు. మధ్యాహ్నం రూంబాయ్ ప్రసాద్‌తో వాటర్ బాటిల్ తెప్పించుకున్న అనిల్ ఆ తరువాత ఎలాంటి ఆడర్ చేయలేదు. మధ్యాహ్న భోజనం కూడాచేయకపోవడంతో అనుమానం వచ్చిన రూంబాయ్ సాయంత్రం 6 గంటలకు గది వద్దకు వచ్చాడు. బెల్‌కొట్టినా లోపలినుంచి ఎలాంటి సమాధానం రాలేదు. డోరు తట్టిచూడగా లోపలి నుంచి గడియ పెట్టకపోవడంతో తలుపులు తెరుచుకున్నాయి. గదిలో అందరూ ఎక్కడికక్కడ అపస్మారక స్థితిలో పడిఉండటాన్ని గమనించిన ప్రసాద్ హోటల్ యజమానులకు సమాచారం అందించాడు. పోలీసులకు సమాచారం అందించగా లాడ్జీకి వచ్చిన పోలీసులు లోపలికి వెళ్లి చూడగా అనిల్ అప్పటికే మృతిచెంది ఉన్నట్లు గుర్తించారు. ప్రాణాలతో ఉన్న భార్య, ముగ్గురు పిల్లలను చికిత్సనిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎస్ఆర్నగర్ యాక్సన్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న భార్య లావణ్య ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉండగా, పిల్లలు వికేర్ ఆసుపత్రిలో చికిత్సపొందుతున్నారు. పరిస్థితి బాగానేఉందని పోలీసులు తెలిపారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. హోటల్లో లభించిన స్లీపింగ్ ట్యాబ్లెట్ డబ్బాను, సూసైడ్ నోట్ స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తుచేస్తున్నారు. -
శ్రీనగర్ కాలనీలో 13 మంది పేకాటరాయుళ్లు అరెస్ట్
అమీర్‌పేటలోని శ్రీనగర్ కాలనీలో పలు పేకాట శిబిరాలపై పోలీసులు గత అర్థరాత్రి దాడులు నిర్వహించారు. ఆ దాడిలో 13 మంది పేకటరాయుళ్లను అరెస్ట్ చేశారు. పేకాట రాయుళ్ల నుంచి రూ.50 వేలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని ఎస్ఆర్ నగర్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. వారిపై కేసు నమోదు చేశారు. -
కొవ్వొత్తుల ప్రదర్శన
కల్లూరు రూరల్, న్యూస్‌లైన్: కర్నూలులోని నంద్యాల రోడ్డులో ఆదివారం భారీగా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. ఒకటి కాదు రెండు కాదు.. అనేక కాలనీలు, అపార్టుమెంట్ల నివాసితులు స్వచ్ఛందంగా సమైక్య నినాదాన్ని హోరెత్తించారు. నగరంలోని సాయివసంత నిలయం, విశ్వసాయి, శ్రీశైల నివాస్, కృష్ణకాంత్, జంపాల అపార్టుమెంట్లతోపాటు మాధవనగర్, డాక్టర్స్ కాలనీ, లెక్చరర్స్ కాలనీ, కిసాన్‌నగర్, టెలికాంనగర్, శ్రీనగర్‌కాలనీ, గఫూర్కాలనీ, కమలానగర్, చంద్రశేఖర్‌నగర్, జయరాంనగర్, రెవెన్యూకాలనీ, గణేశ్‌నగర్, సాయిబాబాకాలనీ, సోమిశెట్టినగర్, సిండికేట్‌బ్యాంక్ కాలనీల ప్రజలు, మాస్టర్‌మైండ్స్ కాలేజీ సిబ్బంది, విద్యార్థులు, జి.పుల్లారెడ్డి ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజీల సిబ్బంది, విద్యార్థులు, గంగాభవానీ రజక సంఘం, ఐరన్ అండ్ స్టీల్ షాపుల యజమానులు ఒక చోటికి చేరి కొవ్వొతుల ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా విభజనపై ప్రజలు తమ గళం వినిపించారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకుడు పెరుగు పురుషోత్తంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 5 రాజీనామా చేయండి: ఎస్వీ పిలుపు కర్నూలు, న్యూస్‌లైన్: ‘‘విభజనపై వెనక్కి తగ్గేది లేదు. తెలంగాణ ఏర్పాటుపై నోట్ తయారవుతోంది. పదవులకు రాజీనామా చేసుకోండి’’ అని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్‌సింగ్ అవమానకరంగా మాట్లాడుతున్నాడని.. వాటిని భరించే కంటే రాజీనామాలు చేసి ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు నియోజకవర్గ సమన్వయకర్త ఎస్.వి.మోహన్‌రెడ్డి కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేశారు. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక జేఏసీ పిలుపులో భాగంగా 24న చేపట్టనున్న బంద్ నేపథ్యంలో ఆదివారం ఆయన స్థానిక కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశమయ్యారు. పార్టీ ఉద్యమ కార్యాచరణతో పాటు సమైక్య వేదిక కార్యక్రమాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు విరివిగా పాల్గొనాలని కోరారు. బంద్‌కు మద్దతుగా భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎత్తుగడలు చూస్తుంటే సమైక్య ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ బాధ్యత వైఎస్సార్‌సీపీపైనే అధికంగా ఉందని గుర్తు చేశారు. రాష్ట్ర విభజన విషయంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం వైఖరిని ఎండగట్టాలని, ఆ రెండు పార్టీల నాటకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖర్‌రెడ్డి తన హయాంలో ఏనాడు ప్రజలపై ఒక్క పైసా భారం వేయకుండా పాలన సాగించారన్నారు. ఒక ప్రాంతానికి మంచి చేయడం కోసం మరో ప్రాంతానికి హాని చేసే పనులు ఆయన ఏనాడూ చేయలేదన్నారు. తెలుగువారి ఆత్మగౌరవాన్ని సోనియా కాళ్ల వద్ద తాకట్టు పెట్టి రాష్ట్ర ప్రజలను అవమానపర్చొదని కాంగ్రెస్ నేతలనుద్దేశించి అన్నారు. కేంద్రంలోని కొందరు మంత్రులు, ఎంపీలు రాజీనామాల విషయంలో ఇప్పటికీ మాయమాటలతో తప్పించుకోవడం శోచనీయమన్నారు. ఉద్యమ తీవ్రత పెరుగుతున్నా కాంగ్రెస్ పార్టీ నాయకులకు చీమ కుట్టినట్లయినా లేదని.. వీరికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. -
అమ్మ... గురు-బ్రహ్మ
బొమ్మను చేసి, ప్రాణం పోస్తే చాలు. బ్రహ్మ బాధ్యత తీరిపోతుంది. అమ్మ ప్రేమబంధం అలా తీరేది కాదు. కన్నపేగులా తెగిపోయేదీ కాదు. నవమాసాల బరువును మళ్లీ చేతుల్లోకి ఎత్తుకుంటుంది. బిడ్డ నీడను కూడా మోసుకు తిరుగుతుంది. కొన్నిసార్లు బ్రహ్మదేవుడు అన్నీ చెక్ చేసుకోకుండా డెలివరీ ఇచ్చేస్తాడు! అప్పుడు అమ్మే బ్రహ్మ అవుతుంది. బిడ్డను ‘కంప్లీట్’ గా తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మలతో నడుస్తున్న బధిరుల పాఠశాలే... ఈవారం మన ‘ప్రజాంశం’. అన్నీ బాగున్న పిల్లలక్కూడా అమ్మ ఎప్పుడూ పక్కనే ఉండాలి. అలాంటిది పుట్టుకతోనే వినికిడి శక్తి లేక మాటకు దూరమైన చిన్నారులకు అమ్మ ఇంకెంత తోడుగా ఉండాలి?! మళ్లీ కడుపున పెట్టుకున్నంతగా! ఇక్కడ అమ్మలతో కలిసి ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే దేవుడు పెట్టిన లోపాన్ని సవరించే శక్తి అమ్మకు మాత్రమే ఉంటుందనిపిస్తుంది. అవును... తమ కడుపునకాసిన కాయకు తొడిమగా తోడుంటున్న ఈ తల్లులు తమ బిడ్డల కోసం పాఠాలు చెప్పే గురువులుగా కూడా మారి వారికి కొత్త జన్మ ఇస్తున్నారు. అదేమిటో చూద్దాం! హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ‘ఆశ్రయ ఆకృతి’ పాఠశాలలోని బధిర పిల్లల సక్సెస్ స్టోరీల గురించి చాలామందికి తెలుసు. అయితే వారి విజయాల వెనకున్న అమ్మల గురించి తెలుసుకున్నప్పుడు కళ్లు చెమరుస్తాయి. అమ్మల్ని గురువులుగా మార్చిన ఆ సొసైటీ నిర్వాహకుల గురించి వింటున్నప్పుడు చెవులు ఇంత అవుతాయి! ఆ బాధ తెలుసు... ‘ఆశ్రయ ఆకృతి’ పాఠశాల నెలకొల్పి పదిహేడేళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 270 మంది విద్యార్థులున్నారు. వీరిలో కాశ్మీర్, బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ‘‘మా తమ్ముడు కుళయప్ప పుట్టుకతోనే మూగవాడు. అయినా కూడా మా అమ్మానాన్నలు ఎంతో పట్టుదలతో వాడిని బధిరుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాడి బాధలు చూశాను. దాంతో నా చదువు పూర్తవగానే హైదరాబాద్‌లోని ఓ బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. అక్కడ కొంత అనుభవం గడించాక 1996లో ‘ఆశ్రయ ఆకృతి’ పాఠశాల నెలకొల్పాను. ఐదుగురు పిల్లలకు పాఠాలు చెప్పడంతో మొదలుపెట్టాను. ప్రస్తుతం మా పాఠశాలకు మూడు బ్రాంచ్‌లున్నాయి. మూడువందలమంది విద్యార్థులున్నారు. యాభైమంది టీచర్లున్నారు. వీరిలో చాలామంది ఆ పిల్లల తల్లులే కావడం మా పాఠశాల ప్రత్యేకత’’ అంటూ పరిచయం చేసుకున్నారు ఆ పాఠశాల వ్యవస్థాపకులు డి.పి.కె బాబు. తల్లితండ్రుల ఆర్థికస్తోమతని బట్టి ఫీజుల్ని నిర్ణయించే ఈ పాఠశాల యాజమాన్యం... రెండేళ్ల క్రితం చార్మినార్ ప్రాంతంలో నెలకొల్పిన బ్రాంచ్‌లో డెబ్భైమంది విద్యార్థులను ఉచితంగా చేర్పించుకున్నారు. బిడ్డల కోసం... పుట్టిన బిడ్డ కొంచెం బరువు తక్కువుంటేనే బెంబేలెత్తిపోయే తల్లి... తన బిడ్డకు వినికిడి శక్తి లేదని తెలిస్తే ఎంతగా తల్లడిల్లుతుందో ఊహించగలం. బతికినంతకాలం తన బిడ్డ మరొకరికి భారం కాకుండా ఉండడానికి ఏం చెయ్యడానికైనా సిద్ధపడే తల్లుల్ని చేరదీసింది ఆశ్రయ ఆకృతి. ఇక్కడే తన కొడుకుని చదివిస్తూ... బిడ్డకోసం స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఎమ్‌ఎడ్ చేసి మరీ, ఇక్కడ పాఠాలు బోధిస్తున్న శశికళతో మాట్లాడితే మాతృత్వం వెనకున్న శక్తి గురించి అర్థమవుతుంది. ‘‘మా బిడ్డ బధిరుడు అని తెలియగానే ఈ స్కూల్లో చేర్పించాను. స్కూల్లో ఉన్న వసతులు, ఉపాధ్యాయుల సంఖ్య చూసి నా బిడ్డకు నాతో పనిలేదు... వాళ్లే అన్నీ నేర్పించేస్తారనుకున్నాను. అయితే, ఇక్కడ పిల్లలకు చెప్పిన విషయాల్ని ఇంటికెళ్లాక కూడా ప్రాక్టీస్ చేయించాలన్నారు. దానికోసం నేను కూడా బాబుతో ఉండాలన్నారు. మొదట్లో నాకు అర్థం కాలేదు... తర్వాత తెలిసింది. టీచర్స్‌తో పాటు నేను కూడా వాడికి చెప్పిన విషయాల్నే చెబుతూ పునశ్చరణ చేయిస్తూ ఉండాలని. అప్పటికి నేను డిగ్రీ చదువుకున్నాను. నేను బాబుకి బోధించే తీరుని చూసి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఎడ్, ఎమ్‌ఎడ్ చేస్తే బాగుంటుందని, ఆ తర్వాత ఇక్కడే జాబ్ ఇస్తామని సార్ చెప్పడంతో నేను ఎమ్‌ఎడ్ పూర్తిచేశాను. చెప్పినట్లుగానే ఇక్కడే జాబ్ ఇచ్చారు. నా బిడ్డకే కాకుండా వాడిలాంటి మరికొందరికి పాఠాలు చెప్పే అవకాశం వచ్చింది’’ అని చెప్పారు శశికళ. ఈమెలాంటి తల్లులు ఇంకో పదిమంది ఉన్నారు. అన్ని శాఖల్లో... అందరి పిల్లల తల్లులు టీచర్లే కాలేరు కదా... ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్‌కుమార్ తల్లి సునీత ఆయాగా పనిచేస్తోంది. అలాగే ఏడోతరగతి చదువుతున్న కార్తిక్ తల్లి మాధవి స్కూల్ అడ్మినిస్ట్రేన్ సెక్షన్లో పనిచేస్తున్నారు. శ్రీమేథా కాలేజీలో ఇంటర్ చదువుతున్న శామిత తల్లి కల్పన కూడా ఇక్కడ టీచర్‌గా పనిచేస్తున్నారు. ‘‘మా అమ్మాయి శామిత ఇక్కడ పదో తరగతి వరకు చదివి ఇప్పుడు మామూలు పిల్లలతో కలిసి ఇంటర్ చదువుతోంది. ఆమెతోపాటు గాయత్రి అనే అమ్మాయి కూడా అక్కడే ఇంటర్ చదువుతోంది. ఇద్దరూ ఫస్ట్‌క్లాస్ మార్కులతో ముందుకెళుతున్నారు. కంప్యూటర్లో కూడా ఫస్టే. ఎందుకంటే మా ఆశ్రయ ఆకృతిలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లలోనే పిల్లలు ఎక్కువ గడుపుతారు. వారికుండే జ్ఞాపకశక్తి వృథా కాకుండా వారి దృష్టిని ఎక్కువగా కంప్యూటర్ పైనే పెడుతున్నాం. బధిరబిడ్డలు సాధించిన చిన్నిచిన్న విజయాలు కూడా మమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తాయి. మా అమ్మాయి పదోతరగతి పాసైనపుడు నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది’’ అంటూ కల్పన తన కూతురి గురించి గర్వంగా చెప్పారు. అదే నా విజయరహస్యం... మొక్కుబడిగా చెప్పే పాఠాలకు, తల్లి చెప్పే పాఠాలకు చాలా తేడా ఉంటుంది. తన పాఠశాల విజయానికి అదే కారణమంటారు డి.పి.కె బాబు. ‘‘ఈ పాఠశాలలో చదువుకున్న ఓ ఏడుగురు విద్యార్థులు ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్నారు. మరో ఇద్దరు పాలిటెక్నిక్, ఓ పదిమంది ఇంటర్ చదువుతున్నారు. అమృతరత్న, మాధవి, ప్రీతి అని మరో ముగ్గురు ప్రముఖ గ్రాఫిక్ కంపెనీలో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఈ మధ్యనే ‘మల్టీమీడియా అండ్ యానిమేషన్ ట్రైనింగ్ సెంటర్’ ని కూడా నెలకొల్పాం’’ అని చెప్పారు బాబు. భవిష్యత్తులో ఇ-లెర్నింగ్... స్పీచ్ థెరపీ, లిప్ రీడింగ్ వంటివాటికి తోడు భవిష్యత్తులో ఇ-లెర్నింగ్ కంటెంట్‌ని పరిచయం చేయాలనుకుంటున్నారు ఈ పాఠశాల వ్యవస్థాపకులు. క్లాస్‌రూమ్‌లో టీచర్ చెప్పే పాఠాలు అందరికీ వినిపించవు. మిషన్లు పెట్టుకున్నా చాలా తక్కువమంది మాత్రమే పాఠాలు అర్థం చేసుకుంటారు. ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఇ-లెర్నింగ్ చాలా సాయపడుతుందంటారు బాబు. ‘‘ప్రొజెక్టర్ (స్క్రీన్) ద్వారా గోడపై అక్షరాలు, దానికి సంబంధించిన బొమ్మలు కనిపిస్తాయి. ఆ పక్కనే బాక్సులో టీచర్ సైగలతో చెబుతుంటారన్నమాట. దీనివల్ల పిల్లలు పాఠం చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని పాఠాలను చిత్రీకరించి సీడీలు తయారుచేశాం. త్వరలో ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ తయారుచేస్తాం. ఇవి రెండూ మార్కెట్లోకి వస్తే ప్రభుత్వపాఠశాలలో చదువుకుంటున్న బధిర విద్యార్థులకు కూడా ఉపయోగం ఉంటుంది’’ అని ముగించారాయన. తన తమ్ముడి లాంటి ఎందరో పిల్లలకు బంగారు భవిష్యత్తునివ్వడానికి నడుం బిగించిన ఈ ఉపాధ్యాయుడికి ఆ స్కూలు విద్యార్థులు విజయకెరటాలయ్యారు. ఆ కెరటాల ధ్వనులు బధిరుల చెవుల్లోనే కాదు, మన చెవుల్లో కూడా మారుమోగేలా చేసిన వారందరికీ అభినందనలు చెప్పితీరాల్సిందే. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి భారం కాదు... వరం మామూలు పిల్లలతో పోలిస్తే బధిరులకు విపరీతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. మా కంప్యూటర్ ల్యాబ్‌లో వారు చేసే అద్భుతాలు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వారిలో ఉన్న ఈ ప్రత్యేకమైన శక్తికి పనిచెబితే వారి భవిష్యత్తుకి అదే ఆధారమవుతుందనే ఉద్దేశ్యంతో ఈ సెంటర్‌ని నెలకొల్పాను. అక్కడ శిక్షణ తీసుకున్న ఓ ముగ్గురు అమ్మాయిలకు డ్రీమ్ అనే గ్రాఫిక్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా విద్యార్థులతో పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. వారికి అర్థమయ్యేలా చెప్పలేకపోతే ఒక పేపర్‌పై మీకు కావలసిన వర్క్ డీటెయిల్స్ ఇచ్చేస్తే నిమిషాల్లో చేసి మీ ముందుంచుతారు. కాకపోతే మా వాళ్లని వారు అర్థం చేసుకునేవరకూ మా సెంటర్ నుంచి ఒక ఉద్యోగి వెళ్లి ఓ పదిరోజులు తోడుగా ఉంటారు. మొన్నీమధ్యే ఆ కంపెనీవారు నాతో మా పిల్లల గురించి గొప్పగా చెప్పారు. అనవసరంగా సమయం వృధా చేయరు, కొద్దిపాటి అనుభవం వచ్చిందని చెప్పాపెట్టకుండా మరో కంపెనీకి వెళ్లిపోరు. కొత్తప్రయోగాలు చేస్తారు... అంటూ పొగుడుతుంటే బధిరులు భారం కాదు వరం అనిపించింది. - డి.పి.కె బాబు వ్యవస్థాపకులు, ఆశ్రయఆకృతి పాఠశాల