వస్త్రవిభ | Textile exhibition starts by jaya sudha | Sakshi
Sakshi News home page

వస్త్రవిభ

Published Sun, Sep 28 2014 1:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:01 PM

వస్త్రవిభ

వస్త్రవిభ

మహిళలకు చీరకట్టే అసలైన అందాన్నిస్తుంద ంటున్నారు నటి జయసుధ. శ్రీనగర్‌కాలనీలోని సత్యసాయి నిగమాగమంలో వస్త్రవిభ పేరిట శనివారం ఏర్పాటు చేసిన వస్త్ర ప్రదర్శనను ఆమె ప్రారంభించారు. సోమవారం వరకు సాగే ఈ ఎక్స్‌పోలో దేశంలోని ప్రముఖ నగరాలకు చెందిన 80 మంది మాస్టర్‌వీవర్స్ ఉత్పత్తులు కొలువుదీరాయి. పట్టు, కాటన్, సిల్క్, డిజైనరీ డ్రెస్ మెటీరియల్స్, యాక్ససరీస్ అందరినీ ఆకర్షిస్తున్నాయి.

త్వరలోనే బోటిక్..
ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు బతుకమ్మ ఆడానన్నారు జయసుధ. తెలంగాణ సంస్కృతి బతుకమ్మ ఆటపాటల్లో ప్రతిబింబిస్తుందని చెప్పుకొచ్చారు. అన్ని రకాల చీరలను ఇష్టపడతానన్న ఈ సహజనటి.. మనసుకు నచ్చిన చీర దొరికితే వెంటనే కొనేస్తానంటున్నారు. త్వరలో నగరంలో ఓ బోటిక్ ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొన్నారు. దసరా కానుకగా రానున్న ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రంలో మంచి పాత్ర పోషించానని తెలిపారు. తను నటిస్తున్న మరిన్ని సినిమాలు సెట్స్‌పై ఉన్నాయని చెప్పుకొచ్చారు జయసుధ.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement