ఛాయూచిత్రమైన బతుకవ్ము
తెలంగాణలో తొలిసారి విరబూసిన పూల పండుగ... రాష్ట్ర వ్యాప్తంగా పరిమళాలు వెదజల్లుతోంది. వైవిధ్యమైన రూపాల్లో కొలువుదీరుతున్న బతుకమ్మ... కెమెరాలను ఆపకుండా పనిచేయిస్తోంది. నగరానికి చెందిన పలువురు ఔత్సాహిక ఫొటోగ్రాఫర్లు బతుకమ్మల అరుదైన చిత్రాలను ఒడిసి పట్టుకోవడానికి పోటీపడతున్నారు. ‘‘బతుకమ్మలను రూపొందించడంలో, అద్భుతంగా డిజైన్ చేసి తమ ఆటపాటలనే అలంకారంగా మార్చే ఈ పండుగ సంబురం ఒక ఫొటోగ్రాఫర్ కు చేతినిండా పనికల్పిస్తుంది’’అంటున్నారు హైదరాబాద్ వీకెండ్ ఫొటో షూట్స్ క్లబ్‌కు చెందిన చంద్రశేఖర్ సింగ్. అప్రయత్నంగా తన కెమెరా బంధించిన అపురూపమైన బతుకమ్మల కలెక్షన్స్‌తో ఆయన మంగళవారం నుంచి ఒక ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ప్రారంభిస్తున్నారు. బేగంపేటలోని పర్యాటక భవన్‌లో రాత్రి 6.30గంటలకు ప్రారంభమయ్యే ఈ ప్రదర్శన 3 రోజుల పాటు కొనసాగుతుందని చెప్పారాయన.