
సాక్షి, విజయవాడ: బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆకతాయిల అలజడితో స్థానికులు భయాందోళన చెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగంతకులను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు.
బైకులు, కార్లకు నిప్పు
స్థానిక శ్రీనగర్ కాలనీలో బిల్డర్ శివశంకర్‌కు చెందిన కారుకు దుండగులు నిప్పుపెట్టారు. బైకుపై వచ్చిన ముగ్గురు ఆగంతకులు కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శివశంకర్ ఫిర్యాదు మేరకు సత్యనారాయణ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగ్ నగర్ శివాలయం వీధిలో జరిగిన మరో సంఘటనలో రెండు బైకులు, కారుకు దుండగులు నిప్పు పెట్టారు. బైకులు రెండు పూర్తిగా తగలబడిపోగా, కారు ముందు భాగం కాలిపోయింది. పెట్రోల్ దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment