parked vehicles
-
కుక్కలు వెంటపడుతున్నాయన్నా టెన్షన్లో.. స్పీడ్ పెంచిందంతే..
ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక ప్రభుత్వాస్పత్రిలో కుక్క పసిబిడ్డను నోట కరుచుకున్న ఉదంతం మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడటంతో వేగం పెంచేశారు. పాపం సమీపంలో పార్క్ చేసి ఉన్న కారుని గమనించకుండా ఢీ కొట్టారు. అంతే ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటన ఒడిశాలోని బెరహంపూర్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే.. ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు స్కూటీపై గుడికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో ఆరు కుక్కలు వారి వెంట పడ్డాయి. దీంతో ఆ మహిళ భయంతో స్పీడ్ పెంచేసింది. మరోవైపు ఆమె ముందు వైపు చూడకుండా వాటి వైపే చూస్తుండటంతో అక్కడ పార్క్ చేసి ఉన్న కారుని గమనించలేదు. దీంతో బండి ఆ కారుని నేరుగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా అంతా కింద పడిపోయారు. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ ముగ్గురులో కనీసం ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించలేదని మండిపడుతుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా బెరహంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు. వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి (చదవండి: డీజే సౌండ్ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..) -
బెజవాడలో అర్ధరాత్రి అలజడి
సాక్షి, విజయవాడ: బెజవాడలో ఆకతాయిలు రెచ్చిపోయారు. బయట పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టి ధ్వంసం చేశారు. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు ప్రాంతాల్లో ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారు. ఆకతాయిల అలజడితో స్థానికులు భయాందోళన చెందారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆగంతకులను అరెస్ట్ చేసేందుకు రంగంలోకి దిగారు. బైకులు, కార్లకు నిప్పు స్థానిక శ్రీనగర్ కాలనీలో బిల్డర్ శివశంకర్‌కు చెందిన కారుకు దుండగులు నిప్పుపెట్టారు. బైకుపై వచ్చిన ముగ్గురు ఆగంతకులు కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. శివశంకర్ ఫిర్యాదు మేరకు సత్యనారాయణ పురం పోలీసులు కేసు నమోదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. సింగ్ నగర్ శివాలయం వీధిలో జరిగిన మరో సంఘటనలో రెండు బైకులు, కారుకు దుండగులు నిప్పు పెట్టారు. బైకులు రెండు పూర్తిగా తగలబడిపోగా, కారు ముందు భాగం కాలిపోయింది. పెట్రోల్ దొంగలు ఈ దుశ్చర్యకు పాల్పడి ఉంటారని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
పొరపాటున బాంబు వేసింది షాకింగ్ వీడియో
-
పొరపాటున బాంబు వేసింది.. షాకింగ్ వీడియో
మాస్కో : శిక్షణలో భాగంగా ట్రయల్స్ వేస్తున్న ఓ సైనిక హెలికాప్టర్ అనూహ్య తప్పిదాన్ని చేసింది. ఒకేసారి రాకెట్లు వదిలి అందిరికీ షాకిచ్చింది. అది కూడా పార్కింగ్ చేసిన మిలిటరీ వాహనాలపైనే కావడంతో మరింత గందరగోళంగా నెలకొంది. రాకెట్ల దెబ్బక సైనికుల వాహనాలు ధ్వంసమయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోను కూడా సోషల్ మీడియాలో రష్యాకు చెందిన న్యూస్ చానెల్స్ పెట్టాయి. రష్యా జపాడ్ 2017 పేరిట ఓ ప్రాంతంలో ప్రత్యేక సైనిక కసరత్తుల శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. దీనిని రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ కూడా పర్యటిస్తున్నారు. అయితే, శిక్షణ ప్రాంతంలో కొన్ని మిలిటరీ వాహనాలు నిలిపి ఉంచారు. మూడు వాహనాలు పక్కపక్కన.. మరో వాహనం వాటికి కొంచెం దూరంలో ఉండగా అప్పుడే విన్యాసాలు చేస్తూ అటుగా వచ్చిన హెలికాప్టర్ ఒకటి రాకెట్లను లాంచ్ చేసింది. దీంతో భారీ పేలుడుతో ఆ వాహనం ధ్వంసం అయింది. దాని ఎదురుగా ఉన్న నడుస్తూ వెళుతున్న ఓ మిలిటరీ వ్యక్తి అక్కడ రేగిన దుమ్ములో మునిగిపోయాడు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. -
గుండెలు అదిరేలా ఐదు కార్లను ఢీ
గుజరాత్: అహ్మదాబాద్‌లో వేగంగా వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదు కార్లు నుజ్జు నుజ్జయ్యాయి. క్షణాల్లో కార్లపైకి దూసుకురావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమయానికి ఘటన స్థలం వద్ద ఎవరూ లేక పోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన అహ్మాదాబాద్‌లోని ఎస్జీ రోడ్డులోని జల్సా పార్టీ ప్లాట్‌కు సమీపంలో గురువారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగే సమయంలో ఓ యువకుడు అక్కడే ఉండే ఆ కార్ల మధ్యలో పడినప్పటికీ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆయువకుడిని ధర్మేంద్ర చందుబాయి(22)గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు కచ్ ఆర్టీవో పరిధిలో ఉన్నట్లు తెలిసింది. ఆ కారులో ఓ డ్రైవర్ మరో అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ప్రమాదం తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారభించారు.