
గుండెలు అదిరేలా ఐదు కార్లను ఢీ
గుజరాత్: అహ్మదాబాద్‌లో వేగంగా వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదు కార్లు నుజ్జు నుజ్జయ్యాయి. క్షణాల్లో కార్లపైకి దూసుకురావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమయానికి ఘటన స్థలం వద్ద ఎవరూ లేక పోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి.
ఈ ఘటన అహ్మాదాబాద్‌లోని ఎస్జీ రోడ్డులోని జల్సా పార్టీ ప్లాట్‌కు సమీపంలో గురువారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగే సమయంలో ఓ యువకుడు అక్కడే ఉండే ఆ కార్ల మధ్యలో పడినప్పటికీ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆయువకుడిని ధర్మేంద్ర చందుబాయి(22)గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు కచ్ ఆర్టీవో పరిధిలో ఉన్నట్లు తెలిసింది. ఆ కారులో ఓ డ్రైవర్ మరో అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ప్రమాదం తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారభించారు.