car rams
-
కారు ఢీకొట్టి గాల్లోకి ఎగిరిపడ్డా.. తగ్గేదేలే!
లక్నో: నడి రోడ్డులో కొందరు విద్యార్థులు గొడవపడుతుండగా వేగంగా దూసుకొచ్చిన ఓ కారు.. ఇద్దరిని బలంగా ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. అంత వేగంగా కారు ఢీకొట్టినా.. అక్కడ గొడవ ఆగలేదు. ఏం జరిగినా తగ్గేదేలే అన్నట్లు గొడవ మరింత ఎక్కువైంది. ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించుకున్నారు. కారు ఢీకొట్టిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాద్యమాల్లో వైరల్‌గా మారాయి. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని గాజియాబాద్ జిల్లాలో జరిగింది. వీడియో ప్రకారం.. కొందరు కళాశాల విద్యార్థులు రోడ్డుపై గొడపడుతున్నారు. అప్పుడే ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. దానిని చూసి అంతా పక్కకు పరిగెట్టారు. కాని ఓ ఇద్దరు మాత్రం గమనించకపవటంతో వారిని కారు ఢీకొట్టింది. ఓ వ్యక్తి గాల్లోకి ఎగిరిపడ్డాడు. ఆ తర్వాత గొడవ మరింత ఎక్కువైంది. అయితే, కొద్ద సేపటికి.. పోలీసులు ఎంట్రీ ఇవ్వటంతో అక్కడి నుంచి పరారయ్యారు. పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నట్లు మసూరి పోలీస్ స్టేషన్ అధికారులు తెలిపారు. కారును సైతం సీజ్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. DISTURBING Video: Speeding Car Plows Through Youths Fighting in Ghaziabad, Uttar Pradesh Brawl Continues Despite Hit; Case Registered#UttarPradesh pic.twitter.com/0gVnclbSkH — The Jamia Times (@thejamiatimes) September 21, 2022 ఇదీ చదవండి: ఎన్నికలకు ముందే బలమైన విపక్ష కూటమి: పవార్ -
తిరుపతి లీలామహాల్ సర్కిల్ దగ్గర కారు బీభత్సం
-
తిరుపతిలో బీభత్సం: టూవీలర్స్‌పైకి దూసుకెళ్లిన కొత్త కారు
సాక్షి, తిరుపతి: తిరుపతి లీలామహల్ సర్కిల్లో కారు బీభత్సం సృష్టించింది. పార్క్ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి దూసుకెళ్లింది. ఈ సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కొత్త కారు కొని.. షోరూం ఇంటికి తీసుకెళ్తుండగా టైరు పేలి ఈ ఘటన చోటు చేసుకుంది. పార్క్ చేసి ఉన్న టూవీలర్స్‌పైకి కారు దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. 8 వాహనాలు ధ్వంసం అయ్యాయి. చదవండి: వేగంగా వెళ్తూ.. చెట్టును ఢీకొట్టి.. -
గచ్చిబౌలిలో కారు బీభత్సం..
-
ఢీ కొట్టి ఆగకుండా వెళ్లిపోయాడు..
-
ఉస్మానియా ఆస్పత్రిలో కారు బీభత్సం
హైదరాబాద్ : ఉస్మానియా ఆస్పత్రి వద్ద గురువారం ఉదయం ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అదుపు తప్పిన రోగులపైకి దూసుకు వెళ్లింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. గాయపడినవారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుండెలు అదిరేలా ఐదు కార్లను ఢీ
గుజరాత్: అహ్మదాబాద్‌లో వేగంగా వెళ్తున్న ఓ వాహనం అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న ఐదు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఐదు కార్లు నుజ్జు నుజ్జయ్యాయి. క్షణాల్లో కార్లపైకి దూసుకురావడంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. సమయానికి ఘటన స్థలం వద్ద ఎవరూ లేక పోవడంతో భారీ ప్రాణ నష్టం తప్పింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఈ ఘటన అహ్మాదాబాద్‌లోని ఎస్జీ రోడ్డులోని జల్సా పార్టీ ప్లాట్‌కు సమీపంలో గురువారం మధ్యాహ్నాం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం జరిగే సమయంలో ఓ యువకుడు అక్కడే ఉండే ఆ కార్ల మధ్యలో పడినప్పటికీ స్వల్పగాయాలతో బయటపడ్డాడు. అతడిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. గాయపడిన ఆయువకుడిని ధర్మేంద్ర చందుబాయి(22)గా గుర్తించారు. ప్రమాదానికి కారణమైన కారు కచ్ ఆర్టీవో పరిధిలో ఉన్నట్లు తెలిసింది. ఆ కారులో ఓ డ్రైవర్ మరో అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. ప్రమాదం తర్వాత ఆ అమ్మాయి బయటకు వచ్చింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారభించారు. -
కారుతో డబ్బింగ్ ఆర్టిస్ట్ కుమారుడి బీభత్సం!
హైదరాబాద్ : పర్సునిండా డబ్బులు, తిరిగేందుకు ఖరీదైన కారు, పక్కనే గర్ల్‌ఫ్రెండ్, ఇక తనకు అడ్డు అదుపు లేదని భావించిన ఓ యువకుడు...కారుతో బీభత్సం స్పష్టించాడు. శుక్రవారం అర్థరాత్రి యూసుఫ్‌గూడ నుంచి అమీర్‌పేట వస్తున్న ఈ కారు అదుపు తప్పి రెండు ఆటోలను ఢీకొంది. అనంతరం పక్కనే ఉన్న ఓ ప్రయివేట్ బ్యాంకు మెట్లపైకి దూసుకెళ్లింది. కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరోవైపు కారు నడిపింది డబ్బింగ్ ఆర్టిస్ట్ రాజశేఖర్ కుమారుడు హర్షగా సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.