గరంలోని గచ్చిబౌలిలో ఒక కారు బీభత్సం సృష్టించింది. ట్రిపుల్ ఐటీ జంక్షన్ వైపు వేగంగా దూసుకొచ్చిన హోండా కారు సిగ్నల్ జంప్ చేసి పాదాచారులను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు పాదాచారులు, అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గాయపడ్డారు. అయితే ఇవేమీ పట్టించుకోకుండా.. అందులో ఉన్న యువకులు కారు ఆపకుండా పారిపోయారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా భీతిల్లి పోయారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా విచారణ చేపట్టారు. నిర్లక్ష్యంగా కారు నడిపి ప్రమాదానికి కారణమైన వారిని అరెస్ట్ చేసి, కారును సీజ్ చేశారు.
గచ్చిబౌలిలో కారు బీభత్సం..
Published Tue, Jun 18 2019 8:58 PM | Last Updated on Fri, Mar 22 2024 10:40 AM
Advertisement
Advertisement
Advertisement