
కారుతో డబ్బింగ్ ఆర్టిస్ట్ కుమారుడి బీభత్సం!
హైదరాబాద్ : పర్సునిండా డబ్బులు, తిరిగేందుకు ఖరీదైన కారు, పక్కనే గర్ల్ఫ్రెండ్, ఇక తనకు అడ్డు అదుపు లేదని భావించిన ఓ యువకుడు...కారుతో బీభత్సం స్పష్టించాడు. శుక్రవారం అర్థరాత్రి యూసుఫ్గూడ నుంచి అమీర్పేట వస్తున్న ఈ కారు అదుపు తప్పి రెండు ఆటోలను ఢీకొంది.
అనంతరం పక్కనే ఉన్న ఓ ప్రయివేట్ బ్యాంకు మెట్లపైకి దూసుకెళ్లింది. కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మరోవైపు కారు నడిపింది డబ్బింగ్ ఆర్టిస్ట్ రాజశేఖర్ కుమారుడు హర్షగా సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.