ఇటీవల కాలంలో కుక్కల దాడులు ఎక్కువ అవుతున్నాయి. మొన్నటికి మొన్న ఒక ప్రభుత్వాస్పత్రిలో కుక్క పసిబిడ్డను నోట కరుచుకున్న ఉదంతం మరువక మునుపే మరో ఘటన చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తుండగా కుక్కలు వెంటపడటంతో వేగం పెంచేశారు. పాపం సమీపంలో పార్క్ చేసి ఉన్న కారుని గమనించకుండా ఢీ కొట్టారు. అంతే ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ ఘటన ఒడిశాలోని బెరహంపూర్‌లో చోటు చేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. ఒక చిన్నారితో సహా ఇద్దరు మహిళలు స్కూటీపై గుడికి వెళ్లి వస్తున్నారు. ఇంతలో ఆరు కుక్కలు వారి వెంట పడ్డాయి. దీంతో ఆ మహిళ భయంతో స్పీడ్ పెంచేసింది. మరోవైపు ఆమె ముందు వైపు చూడకుండా వాటి వైపే చూస్తుండటంతో అక్కడ పార్క్ చేసి ఉన్న కారుని గమనించలేదు. దీంతో బండి ఆ కారుని నేరుగా ఢీ కొట్టడంతో ఒక్కసారిగా అంతా కింద పడిపోయారు.
ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. దీంతో నెటిజన్లు ఆ ముగ్గురులో కనీసం ఒక్కరూ కూడా హెల్మెట్ ధరించలేదని మండిపడుతుండగా, మరికొందరు ఇలాంటి ఘటనలు తలెత్తకుండా బెరహంపూర్ మున్సిపల్ కార్పొరేషన్ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. ట్వీట్ చేశారు.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(చదవండి: డీజే సౌండ్ తగ్గించమన్నందుకు..గర్భిణి అని చూడకుండా..)
Comments
Please login to add a commentAdd a comment