‘నీతో ఉండాలని మనసు కోరుకుంటోంది’ | Prasanth, Pavani Audio Conversation Clip | Sakshi
Sakshi News home page

టెకీ ఆత్మహత్య.. వెలుగులోకి ఆడియో

Published Thu, Nov 1 2018 11:30 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

Prasanth, Pavani Audio Conversation Clip - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ తిరునగరి ప్రశాంత్‌ ఆత్మహత్యకు అతడి భార్య పావని కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ప్రశాంత్‌ తండ్రి ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు పావనిని అరెస్ట్‌ చేశారు. ఆమెపై ఐపీసీ సెక్షన్‌ 306 కింద (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కేసు నమోదు చేశారు. పైళ్లైన కొద్ది రోజుల తర్వాత తన భార్య వేముల ప్రణయ్‌ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ప్రశాంత్‌ గుర్తించాడని పోలీసులు తెలిపారు. వారిని విడదీసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నట్టు వెల్లడించారు.

కాగా, ప్రశాంత్‌, పావని మధ్య గతంలో జరిగిన ఫోన్‌ సంభాషణల ఆడియో ఒకటి బయటకు వచ్చింది. ప్రశాంత్‌ అంటే ఏమాత్రం, తనను వదిలేయాలని పావని చెబుతున్నట్టు ఆడియోలో స్పష్టంగా ఉంది. ప్రేమగా చూసుకుంటానని భర్త ఎంత చెప్పినా ఆమె వినిపించుకోలేదు. చచ్చిపోతానని బెదిరించిన ఆమె భయపడలేదు. తనకు ప్రణయ్‌ ముఖ్యమని, భర్త కాదని తేల్చిచెప్పింది. (పరువుపోయింది.. చచ్చిపోతున్నా..)

ఆడియోలో ఏముంది..?
‘నువ్వో పనికిరానివాడివి. నన్ను సరిగా చూసుకోలేదు. నీతో కలిసుండాలని నాకు లేదు. నన్ను డిస్టర్బ్‌ చేయకు. నువ్వు నాతో ఉండలేవు. నీ మీద నాకు కొంచెం కూడా ఇష్టం లేదు. నిన్ను వదిలి వెళ్లిపోతా. వెళ్లేటప్పుడు నీకు చెప్పే వెళ్లిపోతాను. పెళ్లికి ముందు ఎలా ఉన్నానో అలాగే ఉండాలని కోరు​కుంటున్నాను. అతడిని ఏమీ అనొద్దు. తప్పంతా నాదే. ఏదన్నా ఉంటే నన్ను అను. లేదంటే నిన్ను నువ్వు అనుకో. నన్ను నువ్వు పూర్తిగా అంగీకరించలేద’ని పావని పేర్కొంది.

‘నీతో ఉండాలని మనసు కోరుకుంటోంది. నువ్వంటే చచ్చేంత ప్రేమ నాకు. పెళ్లైన కొత్తలో ఎలా ఉన్నావో అలాగే ఉండు. ప్రణయ్‌ను నీ లైఫ్‌లోంచి తీసేయ్‌. అదొక్కటే కోరుకుంటున్నా. ప్రణయ్‌ మన మధ్య రావడం వల్లే నువ్వు నన్ను వదిలి వెళ్లిపోతానంటున్నావు. ప్రణయ్‌ మన జీవితాన్ని నాశనం చేశాడు. దయచేసి వాడిని వదిలేయ్‌. నువ్వు కాదంటే చచ్చిపోతాన’ని ప్రశాంత్‌ భార్యను బతిమాలుకున్నట్టు ఆడియోలో రికార్డైంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement