మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య | Software engineer commits suicide | Sakshi

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

Published Tue, Jul 5 2016 7:27 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య - Sakshi

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య

మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పంజగుట్ట : మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన పంజగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ... రాజ్‌భవన్‌ రోడ్డులోని సాగర్ అపార్ట్‌మెంట్ మొదటి అంతస్థులో నివాసం ఉండే శైలజ (34) బేగంపేటలోని టాటా కన్సల్టెన్సీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తోంది. ఈమె భర్త శరత్‌బాబు విప్రోలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి ఓ పాప ఉంది. ఆమె కాకినాడలోని తన అమ్మమ్మ ఇంట్లో ఉంటుంది.

మంగళవారం మధ్యాహ్నం ఇంట్లో భర్త లేని సమయంలో శైలజ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అక్కడకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీకి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని పోలీసులు తెలిపారు. భార్య మరణవార్త తెలిసినా సాయంత్రం వరకు భర్త ఇంటికి చేరుకోలేదని సమాచారం. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement