- బూర్గంపాడులో 20 సెం.మీ., భద్రాచలంలో 9 సెం.మీ. వర్షం
సాక్షి, హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం కారణంగా నగరంలో ఆదివారం సాయంత్రం పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షం కురిసింది. రాత్రి 7 గంటల వరకు బాలానగర్‌లో 8.25 మిల్లీమీటర్లు, షేక్‌పేట్‌లో 7, రామచంద్రాపురంలో 6, జూబ్లీహిల్స్‌లో 6, గచ్చిబౌలిలో 5.5, మల్కాపూర్‌లో 5.5, నారాయణగూడలో 4.5, మాదాపూర్‌లో 5.5, శ్రీనగర్‌కాలనీలో 3.7, గోల్కొండలో 3 మిల్లీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. అసలే గతుకుల మయంగా మారిన రహదారులపై వర్షపునీరు నిలిచి పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లను ఎదుర్కొన్నారు. రాగల 24 గంటల్లో నగరంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు బేగంపేట్‌లోని వాతావరణ శాఖ తెలిపింది.
బూర్గంపాడులో కుండపోత..
ఒడిశా నుంచి దాని పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం నైరుతి దిశగా కదులుతుండటంతో గత 24 గంటల్లో రాష్ట్రంలోని అనేక చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఖమ్మం జిల్లా బూర్గంపాడులో అత్యధికంగా 20 సెంటీమీటర్ల కుండపోత వర్షం కురిసింది. అదే జిల్లా భద్రాచలంలో 9 సెంటీమీటర్లు, నిజామాబాద్ జిల్లా బీర్కూర్‌లో డోర్నకల్, వర్నిలో 7, టేకులపల్లి, కోటగిరి, పాల్వంచ, గోవిందరావుపేట, దుమ్ముగూడెం, రంజల్‌లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. సోమవారం నుంచి నాలుగు రోజులపాటు ఒక మోస్తరు నుంచి సాధారణ వర్షాలు నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం
Published Mon, Oct 10 2016 12:07 AM | Last Updated on Mon, Sep 4 2017 4:48 PM
Advertisement
Advertisement