
ప్రేమించాలంటూ...యువతిపై కిరోసిన్ పోశాడు
తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పుంటించేందు ప్రయత్నించగా... అక్కడే ఉన్న స్థానికులు ఆ ప్రేమోన్మాది ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.
మెదక్: తనను ప్రేమించాలంటూ ఓ యువతిపై ప్రేమోన్మాది కిరోసిన్ పోసి నిప్పుంటించేందు ప్రయత్నించగా... అక్కడే ఉన్న స్థానికులు ఆ ప్రేమోన్మాది ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అనంతరం అతడికి దేహశుద్ధి చేసి.. పోలీసులకు అప్పగించారు. అతడిని పోలీసు స్టేషన్కు తరలించి... కేసు నమోదు చేసి... తమదైన శైలిలో విచారిస్తున్నారు.
ఈ ఘటన ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేటలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం... స్థానిక కళాశాలలో చదువుతున్న ఓ యువతిని ప్రేమిస్తున్నాంటూ ఓ యువకుడు రోజూ వెంట పడి వేధిస్తున్నాడు. అందుకు ఆమె ససేమిరా అంది. దాంతో ఆమెపై ఆగ్రహంతో ఉన్న సదరు యువకుడు ఉన్మాదిగా మారి ఆదివారం యువతిపై కిరోసిన్ పోశాడు.