అనుమానంతో అమానుషం | Suspected nothing | Sakshi
Sakshi News home page

అనుమానంతో అమానుషం

Published Thu, May 22 2014 12:53 AM | Last Updated on Mon, Jul 30 2018 8:27 PM

అనుమానంతో అమానుషం - Sakshi

అనుమానంతో అమానుషం

  • గొంతుకోసి భార్యను చంపిన సైకో
  •  ఉప్పల్, న్యూస్‌లైన్: భార్యపై అనుమానంతో సైకోగా మారిన భర్త పట్టపగలు ఆమెను అతికిరాతకంగా గొంతుకోసి చంపేశాడు. ఉప్పల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో బుధవారం ఈ దారుణం జరిగింది. పోలీసులు, బంధువు శంకర్ కథనం ప్రకారం... కరీంనగర్ జిల్లా ఇరుకుల్లా గ్రామానికి చెందిన తంగల్లపల్లి వాసు(33)కు మేనమామ కూతురు శ్రీలత (26)తో పదేళ్ల క్రితం పెళ్లైంది. వీరికి కుమారుడు సాయి పార్దు(7), కుతూరు సింధూ (5) సంతానం.  వాసు కుటుంబం మూడేళ్లుగా రామంతాపూర్ కామాక్షిపురంలో నివాసముంటోంది.

    భర్త వాక్యూం క్లీనర్ల రిపేరర్ కాగా... శ్రీలత చిక్కడపల్లిలో బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. గత కొంతకాలంగా వాసు భార్యపై అనుమానం పెంచుకొని రోజూ గొడవపడేవాడు.  మతిస్థిమితం లేనట్టు ప్రవర్తించేవాడు. ఈ క్రమంలో ఆసుపత్రుల్లో కూడా చూపించుకున్నాడు. ఇదిలా ఉండగా... భార్య శ్రీలతను హత్య చేయాలని నిర్ణయించుకున్న వాసు కూతురిని తన తల్లి వద్దకు పంపాడు.

    బుధవారం మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వాసు.. కొడుకుకు రూ. 10 ఇచ్చి చాక్లెట్లు కొనుక్కోమని బయటకు పంపాడు.  తర్వాత భార్య కళ్లల్లో కారం కొట్టి.. కూరగాయల కత్తితో గొంతుకోసి చంపేశాడు. తర్వాత ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్టు నమ్మించడానికి యత్నించాడు. వీలు కాకపోవడంతో హత్యకు ఉపయోగించిన కత్తి, కారం ప్యాకెట్‌ను చేత్తో  పట్టుకొని బయటకు వచ్చాడు.

    అతడిని చూసిన స్థానికులు తీవ్రభయాందోళనకు గురయ్యారు. స్థానికులు అతడిని పట్టుకొని నిలదీయగా.. అసలు  విషయం బయట పెట్టాడు. స్థానికుల సమాచారం మేరకు ఉప్పల్ సీఐ బాలకృష్ణారెడ్డి, ఎస్‌ఐలు కిరణ్, ప్రవీణ్‌లు ఘటనా స్థలాన్ని పరిశీలించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement